దెబ్బకు దెయ్యం వదిలింది భారత్‌తో స్నేహం కావాలట..!
'స్నేహమా, సమరమా? ఏదో ఒకటి తేల్చుకోండి'. హిందువులపై దాడులు, భారత వ్యతిరేక అజెండాతో రెచ్చిపోతున్న యూనస్ సర్కార్‌కు ఇటీవల జైశంకర్ ఇచ్చిన చివరి ఆప్షన్ ఇది. హసీనా సర్కార్ కుప్పకూలిన తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. హత్యలు, అత్యాచారాలు, దొపీడీలు.. ఒక్కటేంటి మాటల్లో చెప్పలేని నరకం అనుభవిస్తున్నారు.

‘స్నేహమా, సమరమా? ఏదో ఒకటి తేల్చుకోండి’. హిందువులపై దాడులు, భారత వ్యతిరేక అజెండాతో రెచ్చిపోతున్న యూనస్ సర్కార్‌కు ఇటీవల జైశంకర్ ఇచ్చిన చివరి ఆప్షన్ ఇది. హసీనా సర్కార్ కుప్పకూలిన తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. హత్యలు, అత్యాచారాలు, దొపీడీలు.. ఒక్కటేంటి మాటల్లో చెప్పలేని నరకం అనుభవిస్తున్నారు. ఈ దారుణాలను అడ్డుకోవాలని మోడీ ప్రభుత్వం ఎంతగానో చెప్పి చూసింది. కానీ, ఆ దేశ ప్రభుత్వంలో మార్పురాలేదు. వస్తుందన్న గ్యారెంటీ కూడా లేదు. అందుకే, విదేశాంగ మంత్రి జైశంకర్ స్నేహమో, సమరమో తేల్చుకోవా లని తేల్చి చెప్పారు. అయినా వారిలో నో ఛేంజ్. కట్‌చేస్తే.. అమెరికా నిఘా విభాగాధిపతి తులసి గబ్బార్డ్ ఇండియా వచ్చారు. ఈ పర్యటనే బంగ్లా బెండు తీయడంలో గేమ్ ఛేంజర్‌గా మారింది. ప్రధాని మోడీతో యూనస్ కాళ్ళ బేరానికి వచ్చేలా చేసింది. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం..
ఇటీవల ఢిల్లీలో ప్రపంచ నిఘా సంస్థల అధినేతల సమావేశం జరిగింది. ఈ బేటీకి ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ అధ్యక్షత వహించారు. దీని అజెండా ఉగ్రవాదం, భద్రతా సవాళ్లపై చర్చించి పరిష్కార మార్గాలు అన్వేషించడం. ఇంతటి కీలక భేటీలో బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న దారుణాలు చర్చకు రాకుండా ఎలా ఉంటాయి? అందులోనూ హిందూ ధర్మాన్ని ఆచరించే తులసి బంగ్లాదేశ్ పరిస్థితులపై ఆరా తీయకుండా ఎలా ఉంటారు? అదే జరిగింది. దోవల్, రాజ్‌నాథ్, జైశంకర్‌తో విడివిడిగా జరిగిన సమావేశాల్లో అధిక చర్చ బంగ్లాదేశ్ అరాచకాల గురించే జరిగింది. తర్వాత ఒక ఇంటర్వూలో బంగ్లాదేశ్‌పై తులసి గబ్బార్డ్ గర్జించారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, బౌద్ధులు ఇతర మతపరమైన మైనారిటీలపై చాలా కాలంగా జరుగుతున్న హింస, హత్యలు అమెరికా ప్రభుత్వానికి, ట్రంప్, అతని పరిపాలనకు ఆందోళన కలిగించే ప్రధాన అంశమన్నారు. మైనారిటీలపై దాడులను బంగ్లాదేశ్ ప్రభుత్వం అరికట్టాలని తేల్చి చెప్పారు. ఇక్కడే యూనస్ సర్కార్ ఇగో హర్ట్ అయింది.
తమపై తులసి గబ్బార్డ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు బంగ్లాదేశ్ ఒక ప్రకటన విడుదల చేసింది. సరైన ఆధారాలు లేకుండా.. తప్పుదారి పట్టించే ప్రకటన చేశారని విమర్శించింది. అంతేకాదు, ఆమె మాటలతో తమ దేశం మొత్తానికి మరకలు అంటించే ప్రయత్నం చేశారని ఆరోపించింది. సరైన ఆధారాలు లేకుండానే తులసి ఆరోపణలు చేశారనీ.. బంగ్లాదేశ్ ప్రపంచంలోని అనేక దేశాల మాదిరిగానే తీవ్రవాద సవాళ్లను ఎదుర్కొంటోందని.. తమను తాము బాధితులుగా చూపించే ప్రయత్నం చేసింది. కానీ, నిజం ఏంటో ప్రపంచం మొత్తానికీ తెలుసు. బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ రాడికలిజం పేట్రేగిపోడానికి కారణం అక్కడి తాత్కాలిక ప్రభుత్వం అండదండలే అన్న నిజం అమెరికాకు కూడా తెలుసు. అందుకే, ఢాకా కౌంటర్‌కు ఆ దేశ పాలకులు ఊహించలేని పంచ్ ఇచ్చింది. ఆ పంచే ప్రధాని మోడీతో భేటీ కోసం యూనస్ విశ్వ ప్రయత్నాలు చేసే స్థాయికి తీసుకొచ్చింది.
బంగ్లాదేశ్‌పై తులసి గబ్బార్డ్ చేసిన వ్యాఖ్యలపై కామెంట్ చేయాల్సిందిగా అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్‌ను మీడియా ప్రశ్నించింది. దీనికి బదులిచ్చిన ఆమె.. బంగ్లాదేశ్‌లోని యూనస్ సర్కార్‌ను కడిగిపారేశారు. ఏ దేశంలో అయినా మైనారిటీలపై జరిగే హింసను తాము వ్యతిరేకిస్తామనీ, బం గ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. అప్పుడే యూనస్ సర్కార్ ఉలిక్కిపడే ప్రకటన చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై నిఘా పెట్టాం అన్నదే ఆ ప్రకటన సారాంశం. సింపుల్‌గా చెప్పాలంటే బంగ్లాదేశ్‌పై అగ్రరాజ్యం నిఘా నేత్రం ఎప్పుడూ తెరుచుకునే ఉంటుందని ప్రకటించారు. ఈ ప్రకటనే ఇప్పుడు బంగ్లాదేశ్ పాలకుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కట్‌చేస్తే.. మోడీతో భేటీ కోసం యూనస్ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటివరకూ భారత్ అయితే ఏంటట అంటూ రెచ్చిపోయిన యూనస్ అండ్ టీమ్.. ఇప్పుడు మోడీతో ఒక్క మీటింగ్ కావాలని భారత విదేశాంగ శాఖను రిక్వెస్ట్ చేస్తున్నారు. దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది.
బంగ్లాదేశ్ విషయంలో అమెరికా క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో ఉంది. ఇప్పటికే ఢాకాకు అన్ని రకాల సహాయాలు ఆపేసింది. ఇప్పుడు ఏకంగా బంగ్లా మొత్తం తన రాడార్‌లో ఉందని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. అంటే బంగ్లాలో చీమ చిటుక్కుమన్నా అగ్రరాజ్యానికి తెలిసిపోతుంది. సింపుల్‌గా చెప్పాలంటే హిందువులు, మైనారిటీలపై దాడులకు దిగితే వెంటనే అమెరికా నుంచి రియాక్షన్ వస్తుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఊహించని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ జరక్కుండా ఉండాలంటే మోడీతో చర్చలు జరిపి, హిందువులు మైనారిటీల భద్రతకు హామీ ఇచ్చి కాంప్రమైజ్ కావడం ఒక్కటే ఆప్షన్. కాదని మొండిగా వైరాన్ని కొని తెచ్చుకుంటే 18 నిఘా విభాగాలకు అధిపతి అయిన తులసి గబ్బార్డ్‌కు బంగ్లాదేశ్ లెక్క సరిచేయడం పెద్ద విషయం కాదు. పైగా ఇప్పటివరకూ భారత సమస్యగానే ఉన్న హిందువులపై దాడుల అంశం.. తులసి గబ్బార్డ్ ఎంట్రీతో అమెరికా ఇజ్జత్ కా సవాల్‌గా మారింది. ఇలాంటి టైంలో ఎక్స్ ట్రాలు చేస్తే నాశనమయ్యేది యూనస్ ప్రభుత్వమే. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే యూనస్ సర్కార్‌ను గద్దె దించి షేక్ హసీనాకు పగ్గాలిచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో.. యూనస్ ముందున్న ఏకైక ఆప్షన్.. మోడీతో కాంప్రమైజ్ కావడం ఒక్కటే. అందుకే, ఒక్క ఛాన్స్ అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో లేడీ గబ్బర్ తులసి గబ్బార్డ్‌దే కీలక పాత్ర అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.