PAVAN FUND : 10 కోట్లు ఇచ్చేసిన పవన్
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మనసున్న మారాజు అని జనసైనికులు, ఆయన అభిమానులు చెప్పుకుంటారు. ఎవరైనా డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి వస్తే... పవన్ మాత్రం తన సొంత డబ్బులను జనం కోసం ఖర్చుపెడుతుంటారు. తను సినిమాల్లో నటిస్తే వచ్చే డబ్బులను జనసేన పార్టీతో పాటు ఆపదలో ఉన్న వారికి కూడా అందిస్తుంటారు. ఇప్పుడు జనసేనకు ఏకంగా 10కోట్ల రూపాయల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు.

Jana Sena leader Pawan Kalyan who gave 10 crores
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మనసున్న మారాజు అని జనసైనికులు, ఆయన అభిమానులు చెప్పుకుంటారు. ఎవరైనా డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి వస్తే… పవన్ మాత్రం తన సొంత డబ్బులను జనం కోసం ఖర్చుపెడుతుంటారు. తను సినిమాల్లో నటిస్తే వచ్చే డబ్బులను జనసేన పార్టీతో పాటు ఆపదలో ఉన్న వారికి కూడా అందిస్తుంటారు. ఇప్పుడు జనసేనకు ఏకంగా 10కోట్ల రూపాయల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు.
2014లో పవన్ కల్యాణ్ జనసేన (Jana Sena) పార్టీ పెట్టినప్పుడు…తాను జీరో బడ్జెట్ పాలిటిక్స్ (Zero Budget Politics) నడుపుతానని పదే పదే చెప్పేవారు. కానీ డబ్బులు లేనిదే పార్టీ నడవడం కష్టమని ఆ తర్వాత ఆయనకు తెలిసొచ్చింది. అందుకే తాను సినిమాల్లో నటించడం ద్వారా వచ్చిన డబ్బులను తీసుకొచ్చి జనసేన పార్టీలో పెట్టేస్తున్నారు. ఏపీలో ఓవైపు ఓటుకు 5 నుంచి 10 వేల రూపాయల దాకా ఖర్చుపెట్టగల సామర్థ్యం ఉన్న వైసీపీ(YCP), అందులో సగమైనా ఇచ్చే పరిస్థితి ఉన్న టీడీపీ… ఇక అంతంత మాత్రం డబ్బులతో నడిచే పార్టీ జనసేన. పార్టీకి అడపాదడపా విదేశాల నుంచి, సినీ రంగానికి చెందిన వారి నుంచి విరాళాలు వస్తున్నాయి. ఇవి జనసేన నడపడానికి ఎంతవరకు సరిపోతున్నాయో లేదో గానీ… పవన్ మాత్రం ఏపీ ఎన్నికల (AP Elections) ముందు 10 కోట్ల రూపాయలను జనసేనకు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ బలోపేతం, ఎన్నికల నిర్వహణ కోసం తన వంతుగా ఈ మొత్తం ఇస్తానన్నారు.
వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections) జగన్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు పవన్ కల్యాణ్. నెక్ట్స్ టీడీపీ, జనసేన కూటమియే అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. విశాఖపట్నం, అనకాపల్లి నియోజకవర్గాల జనసేన నేతలతో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వ్యక్తిగతంగా తన గెలుపు గురించి ఆలోచించడం లేదనీ… సమిష్టిగా గెలుపు కోసమే తన అడుగులు ఉంటాయన్నారు పవన్. పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లు వదులుకోక తప్పదని జనసైనికులకు హింట్ ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది… ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తాం. స్థానిక ఎన్నికల్లో, PACSలు, ఇతర కీలక నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానాలు మనకే దక్కుతాయంటూ పవన్ భరోసా ఇచ్చారు. ఇప్పటి ఎన్నికల్లో స్థానాలు గురించి కాకుండా.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చే అవకాశాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు పవన్. మొత్తానికి టిక్కెట్లు రాలేదన్న అసంతృప్తిని రానీయకుండా జనసేనానికి ముందు నుంచే లీడర్లకు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు.