Gudivada Amaranath: అమర్‌నాథ్‌కు చుక్కలు చూపిస్తున్న జనసేన.. ట్రోలింగ్‌లో దేశంలోనే నంబర్ వన్
పవన్‌ను మాట అనేందుకు కూడా ఇప్పుడు వైసీపీ ఆలోచనలో పడిపోతున్న పరిస్థితి. అంబటి, రోజా.. సైలెంట్ అవడం వెనక కారణం కూడా అదే ! ఇవన్నీ ఇప్పటికైనా అమర్నాథ్ తెలుసుకోవాలి మరి !

పవన్‌కల్యాణ్, ఆయన అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది ! క్రేజ్ కా బాప్ అనిపిస్తుంటారు ఎప్పుడూ. ఐతే అలాంటి పవన్ ఫ్యాన్స్.. మాతో పెట్టుకుంటే మాములుగా ఉండదు అన్నట్లుగా కనిపిస్తున్నారీ మధ్య ! వైసీపీ నేతలు.. ముఖ్యంగా మంత్రులు టార్గెట్‌గా సోషల్ మీడియాలో జనసైనికులు, పవన్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. మంత్రి అమర్‌నాథ్‌తో పాటు రోజా, అంబటిని లక్ష్యంగా చేసుకొని ట్రోల్స్ మీద ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి అమర్‌నాథ్‌ను మాములుగా ఆడుకోవడం లేదు జనసైనికులు.
కారణం ఏదైనా.. పవన్ మీద విమర్శలు గుప్పించడంలో గుడివాడ అమర్‌నాథ్ ముందుంటారు. దీంతో అమర్‌నాథ్‌ను పవన్ ఫ్యాన్స్, జనసైనికుల టార్గెట్ చేసినట్లు కనిపిస్తున్నారు. వారాహిని తిరగనివ్వం అని ఒకసారి.. పవన్‌తో కంటే తనతోనే ఎక్కువమంది సెల్పీలు దిగుతారని మరోసారి.. ఇలా వరుసగా నోరుజారుతూ.. సెల్ఫ్‌గోల్ వేసుకుంటూ.. ట్రోలర్స్‌కు మంచింగ్‌లా మారిపోతున్నారు అమర్నాథ్. పవన్ ఏం మాట్లాడినా సరే.. సేమ్ సామాజికవర్గం కాబట్టి.. వెంటనే మీడియా ముందుకు వచ్చేది అమర్‌నాథే ! వచ్చాక అయినా కంట్రోల్‌లో విమర్శలు చేస్తారా అంటే.. అధిష్టానం మెప్పు కోసమో.. పవన్ మీద అప్పర్‌హ్యాండ్ సాధించాలనో.. లేదంటే మరేదో కారణమో కానీ.. టక్కున ఓ మాట జారేస్తారు. అదే ట్రోలర్స్‌కు ఆయుధంగా మారుతుంటుంది.
ఆ మధ్య దావోస్ పర్యటనకు వెళ్లకపోవడంపై అమర్నాథ్ ఇచ్చిన వివరణకు జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత గుడివాడ వారి రికార్డింగ్ డ్యాన్స్ అంటూ ఒక వీడియో.. దావోస్ చలికి సంబంధించిన మరో వీడియో.. తెగ వైరల్ అయ్యాయ్. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందా అని లెక్క తీస్తే.. పవన్ కల్యాణే తనతో సెల్పీ దిగాడంటూ.. ఆ మధ్య అమర్‌నాథ్ ఇచ్చిన బిల్డప్.. కొంప ముంచినట్లు అవుతోంది. మీమర్స్‌కు, ట్రోలర్స్‌కు ఆహారంగా మారిపోయాయ్. ఇంత జరుగుతున్నా.. అతి తగ్గించుకున్నారా అంటే.. పవన్ కంటే తననే ఎక్కువమంది సెల్ఫీలు అడుగుతారంటూ మళ్లీ ట్రోలర్స్‌కు టార్గెట్ అయ్యారు.
ఏమైనా జనసేన, జనసైనికులు ఒకప్పటిలా లేరు.. అప్డేట్ అయ్యారు అన్ని విధాలా ! క్షేత్రస్థాయిలో, సోషల్ మీడియాలో.. రాజకీయాల్లో ! అన్ని విషయాల్లో దూసుకుపోతున్నారు. పవన్‌ను ఒక్క మాట అంటే.. ఊరుకునేది లేదన్నట్లుగా రెచ్చిపోతున్నారు. దీంతో పవన్‌ను మాట అనేందుకు కూడా ఇప్పుడు వైసీపీ ఆలోచనలో పడిపోతున్న పరిస్థితి. అంబటి, రోజా.. సైలెంట్ అవడం వెనక కారణం కూడా అదే ! ఇవన్నీ ఇప్పటికైనా అమర్నాథ్ తెలుసుకోవాలి మరి !