Janasena: ఏ జిల్లాలో జనసేన ప్రభావం ఎంత..? పవన్‌ ఇంకా చాలా కష్టపడాలా ?

రెండు జిల్లాల్లో మాత్రమే జనసేన ప్రభావం కనిపించే అవకాశం ఉండడంతో.. ఇదే సాకుగా చూపించి పొత్తుల విషయంలో టీడీపీ ఎత్తులు వేసే అవకాశం ఉంది. ఎలాగూ బలం లేదు కాబట్టి.. పవన్ ఎన్ని సీట్లు అడిగినా.. 15సీట్లకు మాత్రమే.. జనసేనను పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా జరుగుతోంది..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 9, 2023 | 05:18 PMLast Updated on: Mar 09, 2023 | 5:18 PM

Janasena Impact In Assembly Elections

ఇట్స్ ఎలక్షన్‌ టైమ్ అంటోంది ఏపీ రాజకీయం ! ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉన్నా.. పార్టీలన్నీ జనంలోనే ఉంటున్నాయ్. ఓటర్ల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయ్. వైసీపీ సంగతి ఎలా ఉన్నా.. జనసేన ఇప్పుడు ఎటు ఉంటుందన్నదే కీలకంగా మారింది. దీంతో గ్లాస్ పార్టీ బలాలు ఏంటి.. ఏ జిల్లాలో ఎంత ప్రభావం చూపిస్తుందనే ఆసక్తికర చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రధానంగా వినిపిస్తోంది. గతంతో పోలిస్తే జనసేన బలం పుంజుకున్నా.. భారీగా అనే మాటకు ఇంకా చాలా దూరంలోనే ఉంది. పొత్తు కుదిరితే టీడీపీని గట్టిగా డిమాండ్‌ చేయాలన్నా.. గట్టిగా ఓ మాట అడగాలన్నా.. మరింత బలం పుంజుకోవాల్సిన అవసరం ఉంది అన్నది క్లియర్ !

జిల్లాలవారీగా లెక్కలేస్తే.. అక్కడక్కడ బలంగా కనిపిస్తున్న జనసేన… రాష్ట్ర స్థాయిలో మాత్రం ఇంకా వీక్‌గానే ఉంది. ఈ మధ్య కొన్ని సర్వేలు వస్తే.. అవి కూడా ఇదే చెప్తున్నాయ్ మరి ! జనసేనకు 11శాతం ఓట్లు, 7 సీట్లు మాత్రమే వస్తాయని ఆత్మసాక్షి సర్వే తేల్చి చెప్పింది. ఆ ఏడు స్థానాలు కూడా ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనే వస్తున్నాయ్. ఉమ్మడి తూర్పు గోదావరిలో 4, ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 3 సీట్లు వస్తాయని ఆత్మసాక్షి సర్వేలో తేలింది. మిగిలిన జిల్లాల్లో జనసేనకు ఒక్క సీటు కూడా రాదని తేల్చేసింది. విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన ఎక్కువ ఓట్లు చీలుస్తుందని.. దాని వల్ల టీడీపీకి భారీ నష్టం జరుగుతుందని సర్వేలో వెల్లడించింది. విశాఖ, కృష్ణా, గుంటూరులో సీట్లు గెలిచే కూడా అవకాశం ఉందని.. కాకపోతే మరింత కష్టపడాలి అన్నది సర్వే చెప్తున్న మాట. ఐతే ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇప్పటికిప్పుడు బలం పుంజుకోవడం కష్టమే ! మరి దీనికోసం పవన్ ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

టీడీపీతో పొత్తు ఉంటే.. జనసేన ఎక్కువ సీట్లు సాధిస్తుంది. అందులో ఎలాంటి డౌట్‌లేదు. ఐతే పొత్తు విషయంలో క్లారిటీ లేదు. రెండు జిల్లాల్లో మాత్రమే జనసేన ప్రభావం కనిపించే అవకాశం ఉండడంతో.. ఇదే సాకుగా చూపించి పొత్తుల విషయంలో టీడీపీ ఎత్తులు వేసే అవకాశం ఉంది. ఎలాగూ బలం లేదు కాబట్టి.. పవన్ ఎన్ని సీట్లు అడిగినా.. 15సీట్లకు మాత్రమే.. జనసేనను పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా జరుగుతోంది..