పవన్ మాట వింటే బాగు పడతారు: నాగబాబు
నాగబాబు సమక్షంలో జనసేనలో జాయిన్ అయ్యారు పలువురు నేతలు. ఈ సందర్భంగా నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అడ్వాంటేజ్ కోసం జనసేనలో చేరొద్దని నేతలకు నాగబాబు స్పష్టం చేసారు.

Nagababu Karchief in Anakapalli.. Another blow to TDP
నాగబాబు సమక్షంలో జనసేనలో జాయిన్ అయ్యారు పలువురు నేతలు. ఈ సందర్భంగా నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అడ్వాంటేజ్ కోసం జనసేనలో చేరొద్దని నేతలకు నాగబాబు స్పష్టం చేసారు. స్వప్రయోజనాలు పక్కన పెట్టాలని సూచించారు. పార్టీ విలువలను, అధినేత లక్ష్యాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని స్పష్టం చేసారు. ప్రజల కోసమే నీస్వార్థంగా పని చేయాలని సూచించారు. కాంట్రవర్సీలు ,గొడవలకు వెళ్ళద్దని కోరారు.
వ్యక్తిగత ప్రయోజనాలు జనసేనలో లేవన్నారు నాగబాబు. బాధ్యతతో వ్యవహరిస్తే జనసేనలో మంచి నాయకులవుతారన్నారు. అత్యధిక స్థానానికి వెళ్లడానికి జనసేన అవకాశం కల్పిస్తుందని జనసేనలో మావాడు అనే వ్యత్యాస బేధాలు లేవని స్పష్టం చేసారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే దాని ప్రకారం చేయాలి తప్పా వ్యక్తిగతంగా మీ అభిప్రాయాలను పార్టీ మీద రుద్దకుండా, పార్టీ ఆలోచనలు, ఆశయాలను మాత్రమే ప్రజల్లోకి తీసుకు వెళదామని స్పష్టం చేసారు.