కాకినాడలో రౌడీ ఎమ్మెల్యే గంగలో కలిసిన డిప్యూటీ CM పవన్ పరువు
ఆయన ఓ ప్రజాప్రతినిధి.. బాధ్యత గల ఎమ్మెల్యే. ఇంకా క్రిస్టల్ క్లియర్ కట్ గా చెప్పాలంటే... ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేన పార్టీ ఎమ్మెల్యే. జనసేన అంటేనే క్రమశిక్షణకు మారుపేరు అని ఆపార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెబుతుంటారు.
ఆయన ఓ ప్రజాప్రతినిధి.. బాధ్యత గల ఎమ్మెల్యే. ఇంకా క్రిస్టల్ క్లియర్ కట్ గా చెప్పాలంటే… ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేన పార్టీ ఎమ్మెల్యే. జనసేన అంటేనే క్రమశిక్షణకు మారుపేరు అని ఆపార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెబుతుంటారు. ప్రజలు ఇచ్చిన ఈ పదవి బాధ్యతను పెంచాలి కానీ పొగరు, అధికారమదాన్ని కాదు అని ఒక దశలో క్యాడర్ కు మాత్రమే కాదు జనసేన నేతలకు ప్రేమపూర్వక హెచ్చరిక కూడా జారీ చేసారు. కానీ ఆ స్వీట్ వార్నింగ్ ఈ జనసేన ఎమ్మెల్యే కు సరిపోలేదు.
అందుకే తాను ఓ ఎమ్మెల్యే అని మరిచిపోయి… ఓ ప్రొఫెసర్ పై రాయలేని, చెప్పలేని బూతులతో విరుచుకుపడ్డారు.
కళ్లారా చూసారుగా ఈ ఎమ్మెల్యే అధికారమదాన్ని… చెవులారా విన్నారుగా ప్రజాప్రతినిధిగారి బూతుల పురాణాన్ని… భారత రాజ్యాంగం అంటే ఇంతటి గౌరవం ఉన్న ఈసారు ఎవరో కాదు..జనసేన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. లకారం బూతులతో ఎమ్మెల్యే పంతం నానాజీ విరుచుకుపడుతోంది ఓ అరాచక శక్తిమీదో లేక సంఘవిద్రోహుల మీదో కాదు..ఇక్కడ బాధితుడు కాకినాడ రంగరాయ వైద్యకళాశాల ఫోరెన్సిక్ అధిపతి, కాలేజ్ స్పోర్ట్స్ వైస్ ఛైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరర్రావు. సభ్య సమాజం తలదించుకునే స్ధాయిలో ఎమ్మెల్యే పంతం నానాజీతో బూతులు తిట్టించుకునేంత దుర్మార్గపు పని డాక్టర్ ఉమామహేశ్వర్రావు చేయలేదు. ఎమ్మెల్యే పంతం నానాజీ గ్యాంగ్ కు చెందిన కొందరు ఆకతాయిలు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో కొంతకాలంగా వాలీబాల్ ఆడుతున్నారు.
ఆట ఒక్కటే ఆడితే సరిపోయేది కానీ బెట్టింగ్స్ పెట్టుకుని వాలీబాల్ ఆడటం మాత్రమే కాకుండా అరుపులు, కేకలతో నానా బీభత్సం సృష్టిస్తుండేవారట. ఎమ్మెల్యే నానాజీ గ్యాంగ్ మెంబర్స్ వికృత చేష్ఠలకు విద్యార్ధిని విద్యార్ధులకు ఆటంకంగా నిలవడంతో… సరైన అనుమతులు వచ్చేంత వరకు మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో వాలీబాల్ ఆడేందుకు నో చెప్పారు. అయిన సరే వినకుండా ఎమ్మెల్యే పంతం నానాజీ గ్యాంగ్ వాలీబాల్ ఆడేందుకు నెట్ కడుతుండటంతో.. డాక్టర్ ఉమామహేశ్వర్రావు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా, రాకుండా వాలీబాల్ ఆడేందుకు ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పారు. ఇది తమ అధికారమదానికి తలవంవులుగా భావించిన గ్యాంగ్ సభ్యులు నేరుగా ఎమ్మెల్యే పంతం నానాజీ వద్దకు వెళ్లి డాక్టర్ ఉమామహేశ్వర్రావు మీద ఒకటికి వంద చెప్పారట. అంతే కాదు మిమ్మల్ని కూడా తిట్టారని చెప్పడంతో…కోపంతో ఊగిపోయిన ఎమ్మెల్యేగారు తన గ్యాంగ్‌తో సహా వచ్చి డాక్టర్ ఉమామహేశ్వర్రావు మీద దాడి చేసారు. నా కొడకా అంటూ బూతు పంచాంగంతో విరుచుకుపడిన ఎమ్మెల్యే పంతం నానాజీ రాయలేని బూతులతో డాక్టర్ ను అవమానించారు. మాస్క్ లాగేసి మరీ దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే గారే శివతాండవం చేస్తుంటే… నేనేందుకు ఊరుకోవాలనుకున్న నానాజీ మేనల్లుడు బన్నీ.. డాక్టర్ ఉమామహేశ్వర్రావుపై అటాక్ చేసాడు.
గ్యాంగ్‌స్టర్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా రెచ్చిపోయిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అండ్ కో పై కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ యాజమాన్యం ఫైర్ అయింది. నిబంధనల ప్రకారం నడుచుకోండి అని చెబితే వినకుండా డాక్టర్ ఉమామహేశ్వర్రావుపై బూతులతో విరుచుకుపడినందుకు గాను నిరసన ప్రదర్శనలు చేయాలని డిసైడ్ అయింది. అదే జరిగితే తన రౌడీయిజం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతుందని భావించిన ఎమ్మెల్యే పంతం నానాజీ రాజీకి ప్రయత్నించారు. ఏదో కోపంలో మాట తూటాలను అంటూ క్షమాపణలతో కవరింగ్ చేసుకునేందుకు ప్రయత్నించారు. బాధితుడు ఉమామహేశ్వర్రావుతో కూడా మాట్లాడించారు.
ఎమ్మెల్యే పంతం నానాజీ క్షమాపణలు అడిగినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ శాంతించలేదు. ఎమ్మెల్యేతో పాటు డాక్టర్ ఉమామహేశ్వర్రావుపై దాడి చేసిన ఆయన గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేయాలని లేకుంటే మెరుపు సమ్మెకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. అటు దళితసంఘాలు కూడా డాక్టర్ ఉమామహేశ్వర్రావుపై ఎమ్మెల్యే నానాజీ గ్యాంగ్ అటాక్‌ను ఏమాత్రం సహించటం లేదు. MLA పంతం నానాజీని కూడా అదే స్ధాయిలో బూతులు తిట్టి, ఎటాక్ చేసి.. ఆపై సారీ చెబితే సరిపోతుందా, అలా ఒప్పుకుంటారా అని నిలదీస్తున్నారు. పాలిటిక్స్ ఆర్ ది లాస్ట్ రిసార్ట్ ఆఫ్ స్కౌండ్రల్స్ అనే విన్‌స్టన్ చర్చిల్ కోట్‌కు.. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తీసిపోని ఉదాహరణగా నిలిచారని ఫైర్ అవుతున్నారు దళిత సంఘాల నేతలు . ఇదిలా ఉంటే… వైసీపీ అంటేనే రౌడీలు,హంతకుల పార్టీ అంటూ ఇదే కాకినాడ నడిబొడ్డున గర్జించిన జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేను వెనకేసుకొస్తారా లేక భవిష్యత్తులో ఇలాంటి దుర్మార్గపు చర్యలు రిపీట్ కాకుండా ఉండేలా ఏదైనా షాక్ ట్రీట్‌మెంట్ ఇస్తారా అనేది వేచి చూడాలి.