JANASENA: పొత్తులో బీజేపీ లేనట్లే! మరి జనసేన పరిస్థితేంటి..?
అమిత్ షా మీటింగ్ తర్వాత.. చంద్రబాబు మౌనంగానే కనిపిస్తున్నారు. దీంతో ఆ సైలెన్స్ వెనక అంతరార్ధం ఏంటన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం బీజేపీకి ఇష్టం లేదని.. ఐతే తానే పొత్తు కోసం బ్రతిమిలాడానని పవన్ ఆ మధ్య ఓ మాట వదిలేశారు.
JANASENA: ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ ప్లాన్‌ల మీద ప్లాన్లు వేస్తోంది. ఈ ఎన్నికలు టీడీపీకి చాలా కీలకం. ఈసారి కూడా ఓడిపోతే పార్టీ ఉనికి కూడా ప్రమాదంలో పడే చాన్స్ ఉంటుంది. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని ఫిక్స్ అయిన చంద్రబాబు.. జనసేనతో కలిసి పొత్తుగా వెళ్తున్నారు. ఐతే టీడీపీని కూడా కూటమిలోకి తీసుకువస్తానని పవన్ పదేపదే చెప్తున్నారు. అటు చంద్రబాబు కూడా ఆ మధ్య ఢిల్లీ వెళ్లి.. అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు.
YS JAGAN: ఏపీ రాజధానిగా విశాఖ.. తేల్చేసిన సీఎం జగన్
దీంతో బీజేపీతో పొత్తు ఉందా.. పొత్తులో బీజేపీ ఉందా లేదా అనే సస్పెన్స్ అలాగే కంటిన్యూ అవుతోంది. అమిత్ షా మీటింగ్ తర్వాత.. చంద్రబాబు మౌనంగానే కనిపిస్తున్నారు. దీంతో ఆ సైలెన్స్ వెనక అంతరార్ధం ఏంటన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం బీజేపీకి ఇష్టం లేదని.. ఐతే తానే పొత్తు కోసం బ్రతిమిలాడానని పవన్ ఆ మధ్య ఓ మాట వదిలేశారు. టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ కూడా బీజేపీ రాకకోసమే ఎదురుచూస్తున్నట్లు అనిపించింది. 118 స్థానాలను మాత్రమే రెండు పార్టీలు అభ్యర్థులను అనౌన్స్ చేశాయ్. పొత్తులో బీజేపీ కూడా వస్తే మిగిలిన స్థానాలను ప్రకటించేలా టీడీపీ, జనసేన ఉమ్మడిగా ప్లాన్ చేసుకోగా.. ఇప్పుడు బీజేపీ ఈ కూటమికి షాక్ ఇచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. చంద్రబాబుతో పొత్తులో ఉండడం కంటే ఒంటరిగా పోటీకి దిగడమే మంచిదనే భావనలో బీజేపీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయ్. ఈ వార్తలకు బలం ఇచ్చేలా.. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి.. బీజేపీ జాతీయ నాయకుడు శివప్రకాష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బీజేపీతో పొత్తు కోసం టీడీపీ, జనసేన కూటమి తీవ్ర ప్రయత్నం చేస్తుంటే.. బీజేపీ మాత్రం అభ్యర్థుల ఎంపికలో, మేనిఫెస్టో రూపకల్పనలో బిజీబిజీగా గడుపుతోంది. ఈ పరిణామాల ప్రకారం పొత్తు ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. బీజేపీ మాత్రం పొత్తు విషయంలో నాన్చుడు ధోరణిలో ముందుకు సాగుతోంది. బీజేపీ దాటవేత ధోరణితో టీడీపీ జనసేన పార్టీలు అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతూ వస్తుంది. దీంతో జనాల్లోకి వెళ్లలేకపోతున్నామనే భావన టీడీపీ, జనసేన నాయకుల్లో బలంగా ఉంది.