JANASENA VS YSRCP: సివిల్స్‌ చదివిన యువతికి వాలంటీర్‌ జాబ్‌.. జనసేన రియాక్షన్ చూస్తే..

తన ముగ్గురు కూతుళ్లు వాలంటీర్లుగా పని చేస్తున్నారని ఒక తండ్రి చెప్పుకొచ్చారు. ఒక అమ్మాయి పీజీ, ఒక అమ్మాయి సివిల్స్, మరో అమ్మాయి డిగ్రీ చదివి వాలంటీర్లుగా పని చేస్తున్నారని.. తన కూతుళ్ల వల్ల ప్రభుత్వ పథకాలు అందుతుండటంతో.. వాళ్లకు చేతులెత్తి దండం పెడుతున్నారని ఆ తండ్రి కామెంట్‌ చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 21, 2024 | 07:03 PMLast Updated on: Feb 21, 2024 | 7:03 PM

Janasena Vs Ysrcp About Volunteer Jobs In Ap Video Goes Viral

JANASENA VS YSRCP: ఏపీలో ఎన్నికల రచ్చ పీక్స్‌కు చేరింది. పొత్తుగా వస్తున్న టీడీపీ, జనసేన.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారం దక్కించుకోవాలని ప్లాన్ చేస్తుంటే.. అధికారం నిలబెట్టుకొని తీరుతామని వైసీపీ అధినేత జగన్ ధీమాగా కనిపిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్‌కు చేరింది. ప్రతీ అంశం.. పార్టీల మధ్య ఆయుధంగా మారుతోంది. వాలంటీర్ వ్యవస్థ మీద కూడా పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

TDP SENIORS: సీటు గోవిందా.. టీడీపీలో సీట్ల సిగపట్లు.. సీనియర్లకీ టిక్కెట్లు డౌటే

దీనికి కారణం ఓ తండ్రి చెప్పిన మాటలే ! ఏపీలో ప్రస్తుతం 2లక్షల 50 వేల మందికి పైగా వాలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఐతే దీనికి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తన ముగ్గురు కూతుళ్లు వాలంటీర్లుగా పని చేస్తున్నారని ఒక తండ్రి చెప్పుకొచ్చారు. ఒక అమ్మాయి పీజీ, ఒక అమ్మాయి సివిల్స్, మరో అమ్మాయి డిగ్రీ చదివి వాలంటీర్లుగా పని చేస్తున్నారని.. తన కూతుళ్ల వల్ల ప్రభుత్వ పథకాలు అందుతుండటంతో.. వాళ్లకు చేతులెత్తి దండం పెడుతున్నారని ఆ తండ్రి కామెంట్‌ చేశారు. ఆ వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్‌ చేసి.. ఘాటుగా రాసుకొచ్చింది. నీకొక్క ఛాన్స్ ఇస్తే వాలంటీర్ ఉద్యోగాల పేరుతో జనాలను మభ్యపెట్టి, యువశక్తిని నీరుగార్చేశావ్‌ జగన్ అంటూ జనసేన అధికారిక హ్యాండిల్ నుంచి పోస్ట్ వచ్చింది. పవన్ కూడా వాలంటీర్ వ్యవస్థపై చాలాసార్లు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. వాలంటీర్ల ఉద్యోగాలతో యువతను జగన్‌ గ్రామాలకే పరిమితం చేస్తున్నారని విమర్శించారు.

యువతలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించడంలో ఏపీ సర్కార్‌ విఫలమవుతోందని మండిపడ్డారు. డిగ్రీలు, పీజీలు చదివిన వాళ్లతో వైసీపీ ఊడిగం చేయించుకుంటోందని కామెంట్లు చేశారు. ఈ వీడియోను కూడా.. ఆ పోస్ట్‌లో యాడ్ చేశారు. ఐతే ఆ తండ్రి అన్న మాటలు.. జససేన నుంచి వచ్చిన రియాక్షన్ పోస్ట్.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ కింద కామెంట్లు మాత్రం.. పొలిటికల్ ఫీవర్‌ను మరింత పెంచేలా కనిపిస్తున్నాయ్.