వైసీపీకి జయమంగళం గుడ్ బై
వైసీపీకి ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ గుడ్ బై చెప్పారు. తాజాగా కైకలూరు నియోజకవర్గానికి ఈ నేత... గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వైసీపీలో జాయిన్ అయ్యారు.
వైసీపీకి ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ గుడ్ బై చెప్పారు. తాజాగా కైకలూరు నియోజకవర్గానికి ఈ నేత… గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వైసీపీలో జాయిన్ అయ్యారు. ఇక పార్టీకి గుడ్ బై చెప్తూ సంచలన కామెంట్స్ చేసారు. అధికార పార్టీలో ఒక సంవత్సరం ఎమ్మెల్సీగా ఉండి కూడా ప్రజలకు ఏమి సేవ చేయలేకపోయానని కనీసం పోలీసులకి ఫోన్ చేయాలన్న స్వతంత్రం లేదని జయ మంగళ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసారు.
పదవి అయితే ఇచ్చారు గాని పవర్ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. 23 సంవత్సరాలు టిడిపిలో ఉండి కొల్లేరు ప్రజల కోసం వైసీపీలోకి వచ్చాను వైసీపీలో కూడా ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసారు. ఏదైనా సమస్య కోసం వైసీపీ ప్రభుత్వాని కోరితే సజ్జలతో మాట్లాడు ధనుంజయ గారితో మాట్లాడు అనడమే తప్ప ఏ పని జరగలేదని చెప్పుకొచ్చారు. ఒక మాజీ ఎమ్మెల్యేగా కొల్లేరు ప్రజలకి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. చేసారు. ఏ పార్టీలోకి వెళ్ళేది నా ప్రజలతో మా నాయకులతో సంప్రదించి భవిష్యత్తు కార్యాచరణ తెలుపుతానన్న ఆయన… సమస్యల గురించి మాట్లాడదామని వెళితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదని తన ఆవేదన మీడియా ముందు బయటపెట్టారు.