Amit Shah: పీవోకేలో 24 అసెంబ్లీ సీట్లు.. పార్లమెంట్‌లో అమిత్ షా సంచలన బిల్లులు

జమ్మూ కశ్మీర్‌‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. లేటెస్ట్ గా అక్కడ అసెంబ్లీని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా.. జమ్మూకశ్మీర్‌ రిజర్వేషన్‌ సవరణ బిల్లు-2023, జమ్మూకశ్మీర్‌ రీ ఆర్గనైజేషన్‌ సవరణ బిల్లు-2023ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 6, 2023 | 07:58 PMLast Updated on: Dec 06, 2023 | 8:25 PM

Jk Bills Passed By Lok Sabha Home Minister Amit Shah Said

Amit Shah: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (POK) మనదే అని పార్లమెంట్‌లో మరోసారి స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అంతేకాదు.. పీఓకేలో 24 అసెంబ్లీ సీట్లను ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌‌కు సంబంధించిన రెండు కీలక బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అందులో జమ్ము, కశ్మీర్‌తో పాటు POKలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను డిసైడ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. జమ్మూ కశ్మీర్‌‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. లేటెస్ట్ గా అక్కడ అసెంబ్లీని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా.. జమ్మూకశ్మీర్‌ రిజర్వేషన్‌ సవరణ బిల్లు-2023, జమ్మూకశ్మీర్‌ రీ ఆర్గనైజేషన్‌ సవరణ బిల్లు-2023ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. వాటికి రెండు సభల్లో ఆమోదం లభించింది.

REVANTH REDDY: ఈ ఇద్దరితో చిక్కులేనా..? రేవంత్‌కు చిక్కులు తప్పవా..?

ఈ బిల్లుల్లో పునర్విభజన తర్వాత శాసనసభ నియోజక వర్గాల సంఖ్యను డిసైడ్ చేశారు. వీటిల్లో ఏయే స్థానాలు రిజర్వుడ్ కేటగిరీకి ఇచ్చారన్నది కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివరించారు. జమ్మూకశ్మీర్‌లో శాసనసభ నియోజకవర్గాలు గతంలో 83 ఉన్నాయి. ఈ బిల్లులో వాటిని 90కి పెంచాలని ప్రతిపాదించారు. ఇంతకుముందు కశ్మీర్‌ డివిజన్‌లో 46, జమ్ములో 37 సీట్లు ఉండేవి. సవరణ బిల్లులో కశ్మీర్‌ అసెంబ్లీ స్థానాలను 47, జమ్ములో 43కు పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ రెండిటితో పాటు.. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ కూడా మన దేశంలో భాగమే. అందుకే, అక్కడ కూడా 24 స్థానాలను రిజర్వ్‌ చేసినట్లు ప్రకటించారు అమిత్ షా. కశ్మీర్‌లో రెండు స్థానాలను కశ్మీర్‌ నుంచి వలస వెళ్లిన పండిట్స్ కోసం, ఇంకో సీటును పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి వచ్చి స్థిరపడిన వారికి రిజర్వ్‌ చేశారు. జమ్ముకశ్మీర్ లో మొదటిసారిగా ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీలకు 9 స్థానాలు కేటాయించింది ప్రభుత్వం. సొంత దేశంలోనే 46 వేల మంది కశ్మీరీ పండిట్ల కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. 70 ఏళ్లుగా వాళ్ళకి అన్యాయం జరుగుతోంది. వాళ్ళకి భారత రాజ్యాంగం ద్వారా అన్నిరకాల న్యాయం చేస్తామన్నారు అమిత్ షా. ప్రస్తుతం చాలా మంది కశ్మీరీలు శరణార్థి శిబిరాల్లో తలదాచుకొంటున్నారు.

ఈ బిల్లుతో వారికి హక్కులు, ఉద్యోగాలు, విద్యావకాశాలు, రిజర్వేషన్ల సాయంతో ఎన్నికల్లో నిలబడే అవకాశాలు వస్తాయన్నారు. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 తొలగింపు తర్వాత కూడా ఉగ్రవాదం కొనసాగుతోంది అంటూ ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలపై అమిత్‌షా స్పందించారు. మోడీ గవర్నమెంట్ వచ్చాక పౌర మరణాల్లో 70 శాతం, భద్రతా సిబ్బంది మరణాల్లో 62శాతం తగ్గాయన్నారు. ఆర్టికల్‌ 370 తొలగింపుతో ఉగ్రవాదం అంతమైపోతుందని చెప్పలేమని, కానీ వేర్పాటువాదం అంతమవుతుందని అన్నారు అమిత్ షా. 2026 నాటికి జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద ఘటనలు ఏవీ జరక్కుండా చూడటమే తమ లక్ష్యం అన్నారు హోంమంత్రి. అయితే ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం చెప్పారు. పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ ప్రకటించడం, కశ్మీర్ అంశాన్ని UNO దృష్టికి తీసుకెళ్ళడం అనే నెహ్రూ చేసిన రెండు పెద్ద తప్పుల వల్లే ఇన్ని ఇబ్బందులు వచ్చాయన్నారు. హోంమంత్రి వ్యాఖ్యలపై మండిపడిన కాంగ్రెస్ ఎంపీలు లోక్ సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయారు.