2024 లో బాగా సెన్సేషన్ అయిన విషయం జానీ మాస్టర్ రేప్ కేసు వ్యవహారం. జానీ మాస్టర్ తప్పు చేశాడా లేదా అనేది పక్కన పెడితే నేషనల్ లెవెల్లో ఇది బాగా హైలైట్ అయింది. సౌత్ ఇండియాలో అలాగే నార్త్ ఇండియాలో కూడా జానీ మాస్టర్కు మంచి ఇమేజ్ ఉంది. బాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాల్లో కూడా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తూ పాపులారిటీ తెచ్చుకున్నాడు. అందుకే అక్కడ స్టార్ హీరోలు కూడా ఈ వ్యవహారం చూసి ఒక సారిగా షాక్ అయ్యారు. మామూలుగా మూవీ ఇండస్ట్రీలో ఇలాంటి వ్యవహారాలు చాలా కామన్ అని చెప్తూ ఉంటారు. ఇక ఈ వ్యవహారం వెనుక కుట్ర కూడా ఉంది అనే న్యూస్ ఒకటి వైరల్ అయింది. జానీ మాస్టర్ జనసేన పార్టీని అభిమానించడంతో ఆయనను కొంతమంది టార్గెట్ చేశారని అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటూ కాస్త హడావుడి జరిగింది. ఇక జానీ మాస్టర్ బెయిల్ కోసం కూడా నాన కష్టాలు పడ్డారు. ఇదే టైంలో జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు కూడా క్యాన్సిల్ కావడంతో ఒకసారిగా ఆయన అభిమానులు అలాగే సినిమా వాళ్లు కూడా షాక్ అయ్యారు. కొంతమంది అయితే దీని వెనుక కులం కోణం కూడా ఉంది అంటూ హడావుడి చేయడం మనం చూసాం. అయితే జానీ మాస్టర్ పై కేసు పెట్టిన అమ్మాయి మాత్రం ఇప్పటివరకు బయటకు వచ్చి ఎక్కడ మాట్లాడలేదు. ఈ వ్యవహారంలో ముందు జానీ మాస్టర్ తప్పు ఉందని భావించిన వాళ్ళందరూ ఆ తర్వాత ఎందుకో తెలియదు సైలెంట్ అయిపోయారు. ఇక ఇదే టైంలో పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ నుంచి జానీ మాస్టర్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత కూడా జానీ మాస్టర్ ను కలవడానికి పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ చూపించలేదు అనేది క్లారిటీ వచ్చింది. అమరావతి వెళ్లి పవన్ కళ్యాణ్ ను కలవాలని జానీ మాస్టర్ నానా ప్రయత్నాలు చేశారు. కానీ పవన్ మాత్రం నో చెప్పారట. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓ జి అనే సినిమాలో కూడా జానీ మాస్టర్ కు అవకాశం ఇవ్వొద్దని డైరెక్టర్ సుజిత్ కు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. అటు నిర్మాతలకు కూడా ఇదే విషయాన్ని చెప్పేశారు పవన్ కళ్యాణ్. అయితే దీని వెనక కీలక కారణం ఒకటుంది. పవన్ కళ్యాణ్ ఏపీ ఉపముఖ్యమంత్రి కావడంతో అనవసరంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుందని.. రేప్ కేసు నిందితుడిని తన సినిమాలో పెట్టుకున్నాడని విమర్శలు వస్తాయని... దీనితో లేనిపోని రచ్చ జరుగుతుందని ముందే ఎక్స్పెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్ జానీ మాస్టర్ను పక్కన పెట్టేందుకు రెడీ అయ్యారు. వాస్తవానికి సినిమా అనౌన్స్ చేసినప్పుడే జానీ మాస్టర్ను ఫైనల్ చేశాడు సుజిత్. కానీ ఇప్పుడు అతన్ని పక్కనపెట్టి మరో కొరియోగ్రాఫర్ కు చాన్స్ ఇవ్వాలని రెడీ అయ్యారు. ఇక విషయం అర్థం కావడంతో జానీ మాస్టర్ కూడా పెద్దగా రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేయలేదట.