Jr NTR: టీడీపీలో జూ.ఎన్టీఆర్ లొల్లి..!! ఫ్లెక్సీలతో మొదలైన వివాదం

టీడీపీలో ఓ వర్గం జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలని కోరుకుంటోంది. అయితే పార్టీలో పరిస్థితి, కుటుంబ వివాదాల కారణంగా జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండిపోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 18, 2023 | 09:04 AMLast Updated on: Jul 18, 2023 | 9:11 AM

Jr Ntr Controversy In Tdp In Ongole Over Flexis

Jr NTR: తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ కలకలం కొనసాగుతోంది. టీడీపీలో ఓ వర్గం జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలని కోరుకుంటోంది. అయితే పార్టీలో పరిస్థితి, కుటుంబ వివాదాల కారణంగా జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండిపోతున్నారు. కానీ ఆయన అభిమానులు మాత్రం ఎప్పటికైనా టీడీపీకి జూనియర్ ఎన్టీఆరే నాయకుడని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మరోసారి టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ హాట్ గా మారింది. ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లోకేశ్ పాదయాత్ర సమయంలో వెలిసిన ఈ ఫ్లెక్సీలు టీడీపీలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. నారా లోకేశ్ ఇప్పుడు యువగళం పాదయాత్ర కొనసాగుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతోంది. నేడో రేపో ఈ యాత్ర ఒంగోలులోకి ప్రవేశించబోతోంది. నారా లోకేశ్ పాదయాత్రకోసం టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే వీటితో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు అర్ధరాత్రి హఠాత్తుగా వెలిసాయి. ఎప్పటికైనా టీడీపీ నాయకుడు జూనియర్ ఎన్టీఆరేనని పోస్టర్లలో దర్శనమిచ్చింది. అంతేకాక.. అసలోడు వచ్చే వరకూ కొసరోడికి పండగే అని కొటేషన్లు ఉన్నాయి. ఈ ఫ్లెక్సీలను వైసీపీ వాళ్లే ఏర్పాటు చేసి ఉంటారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు వినిపించడం కొత్తకాదు. చాలా సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలనే నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. కుప్పంలో చంద్రబాబు పర్యటనలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ను స్వాగతించాలని నేరుగా ఆయన్నే డిమాండ్ చేశారు. పార్టీని లీడ్ చేయడం లోకేశ్ వల్ల కాదని.. ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే పార్టీకి దిక్కని చాలా మంది భావిస్తున్నారు. అయితే టీడీపీ నేతలు ఈ విషయాన్ని నేరుగా చెప్పలేకపోతున్నారు. అయితే కొంతమంది నేతలు మాత్రం దొంగచాటుగా జూనియర్ ఎన్టీఆర్ జపం చేస్తూనే ఉన్నారు. మరి ఈ వివాదాన్ని చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.