TDP : టీడీపీకి మద్దతుగా జూ.ఎన్టీఆర్ ?
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండు నెలలు మాత్రమే ఉండటంతో ఎవరికి వాళ్లు తమ సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ మధ్య వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీ జరగబోతోంది అనేది అందరికీ తెలిసిన నిజం. ఇదే క్రమంలో ఇప్పుడు హీరో కళ్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో ప్రకంపణలు సృష్టిస్తున్నాయి.
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండు నెలలు మాత్రమే ఉండటంతో ఎవరికి వాళ్లు తమ సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ మధ్య వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీ జరగబోతోంది అనేది అందరికీ తెలిసిన నిజం. ఇదే క్రమంలో ఇప్పుడు హీరో కళ్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో ప్రకంపణలు సృష్టిస్తున్నాయి. రీసెంట్‌గా తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ ఎన్నికలు, టీడీపీకి మద్దతు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు కళ్యాణ్‌రామ్. టీడీపీకి మద్దతిచ్చే విషయం తాను ఒక్కడినే తీసుకునే నిర్ణయం కాదని.. తారక్‌తో కూడా మాట్లాడిన తరువాత చెప్తానంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు తారక్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. మొన్నటి వరకూ ఏపీ రాజకీయాలను అసలు జూనియర్ ఎన్టీఆర్ పట్టించుకోలేదు. చంద్రబాబు అరెస్ట్ ఐనప్పుడు, సీనియర్ ఎన్టీఆర్ కాయిన్ విడుదలైనప్పుడు కూడా స్పందించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఎన్నికలకు ఇంకా రెండు నెలల మాత్రమే ఉంది. ఖచ్చితంగా తన వైఖరిని చెప్పాల్సిన సమయం వచ్చింది. దీంతో ఎన్టీఆర్ నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గతంలో కూడా టీడీపీ కోసం ఎన్టీఆర్ పని చేశాడు. కానీ ఆ తరువాత కొన్ని కారణాల వల్ల పార్టీకి దూరంగా ఉంటూ వచ్చాడు. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ పార్టీలోకి మళ్లీ వస్తాడని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. పార్టీకి రావాలని కూడా కోరుతున్నాయి. ఎన్టీఆర్ వస్తేనే మళ్లీ ఏపీలో పార్టీకి పూర్వవైభవం వస్తుంది అనేది మేజార్టీ సభ్యులు చెప్తున్న మాట. ఇదే విషయంలో కళ్యాణ్‌రామ్‌తో చర్చించిన తరువాత ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.