Jr.NTR: పొలిటికల్ ఎంట్రీపై జూ. ఎన్టీఆర్ ప్లాన్ ఇదే !
శతజయంతి వేడుకల వేళ.. ఎన్టీవోడి గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో.. ఇప్పుడు బుడ్డోడి గురించి కూడా అంతే మాట్లాడుకుంటున్నారు జనాలంతా! ఒక్కసారి వచ్చిపో.. మనసులు తాకిపో తాతా అంటూ.. ఎన్టీఆర్ బర్త్‌డే రోజు ఎమోషనల్ పోస్ట్ పెట్టిన తారక్.. నందమూరి కుటుంబానికి పూర్తిగా దూరం అయ్యారా అంటే.. నిజమే అనిపిస్తోంది వరుస పరిణామాలు చూస్తుంటే ! తారకరత్న చనిపోయినప్పుడు ఎన్టీఆర్, తారకరత్నను కనీసం పలకరించని బాలయ్య.. చూసీచూడనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
నందమూరి కుటుంబానికి, ఎన్టీఆర్‌కు దూరం పెరిగిందని ఆరోజే అర్థం అయింది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలతో ఇప్పుడు అదే నిజం అయింది కూడా ! చంద్రబాబు, నందమూరి కుటుంబంతో పాటు టీడీపీ అధికారికంగా పిలిచిన ప్రతీ కార్యక్రమానికి తారక్ డుమ్మా కొడుతున్నాడు. తను వెళ్లకుండా ఉండడమే కాదు.. అన్న కల్యాణ్‌రామ్‌ను కూడా దూరంగా ఉంచుతున్నరు. దీంతో నందమూరి, నారా కుటుంబానికి మధ్య ఎన్టీఆర్‌కు రాకపోకలు ఆగిపోయినట్లేనా అనే చర్చ జరుగుతోంది.
ఈ నెల 20న హైదరాబాద్‌లో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి సభకు తారక్‌కు ఆహ్వానం అందింది. ఐతే ఆ సభకు దూరంగా ఉన్న తారక్.. ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ వేశాడు. పోనీ రాజమండ్రి సభకు అయినా వస్తారు అనుకుంటే.. ఇప్పుడు కూడా దూరంగానే ఉన్నారు. తాను నటుడిని మాత్రమే అని పదేపదే చెప్పే తారక్.. రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. ఐతే తెలుగు తమ్ముళ్లు మాత్రం.. ఎన్టీఆర్ రావాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఆయనకు పగ్గాలు అప్పగిస్తేనే.. పార్టీ బతుకుతుందంటూ చంద్రబాబును నిలదీశారు కూడా ఓ సమయంలో ! ఇంత జరుగుతున్నా.. తారక్ మాత్రం మౌనంగానే కనిపిస్తున్నారు.
ఇదే ఇప్పుడు మరింత చర్చకు కారణం అవుతోంది. లేదు అని చెప్తున్నా.. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ఖాయం.. అదే ఎప్పుడు అనేది అభిమానులు, కార్యకర్తల్లో వినిపిస్తున్న ప్రశ్న. ఇలాంటి పరిణామాల మధ్య ఎన్టీఆర్ తీరుతో అర్థం అవుతోంది ఒక్కటే ! ఇప్పట్లో ఎన్టీఆర్ రాజకీయాల వైపు, టీడీపీ వైపు చూసే అవకాశాలు కనిపించడం లేదు. తనకు 50 ఏళ్లు దాటాక..అన్నగారి సెంటిమెంట్ తెరమీదకు తీసుకువచ్చి.. టీడీపీని కైవసం చేసుకునే అవకాశాలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఎలాగూ తాత పోలికలతో ఉంటాడు.. తాతకు పోటీగా పేరు తెచ్చుకుంటాడు కాబట్టి.. ఎన్టీఆర్‌ను ఆపడం ఎవరికీ సాధ్యం కాదు అనేది చాలామంది అభిప్రాయం.
నందమూరి కుటుంబం మొహం తిప్పేసుకున్నా.. పక్కనే ఉండి పట్టించుకోకున్నా.. కార్యకర్తలు, ప్రత్యర్థుల నుంచి ఎన్ని నిందలు వచ్చినా.. ఇలాగే మౌనంగా భరిస్తూ ఎన్టీఆర్ వెయిట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఇదే జూనియర్ స్ట్రాటజీ కూడా ! సింపథీ క్రియేట్ చేసి.. ఆ తర్వాత రాజకీయం మొదలుపెట్టాలన్న వ్యూహంతో ఎన్టీఆర్ ఉన్నారన్నది పలువురి విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట. జూనియర్ స్ట్రాటజీ ఇదే అని చంద్రబాబు, బాలయ్యకు కూడా తెలుసు నిజానికి ! అందుకే కావాలని మహానాడుకు ఎన్టీఆర్‌కు పిలుపు వెళ్లలేదనే చర్చ జరుగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే లోపు.. లోకేశ్‌ను నాయకుడిగా బిల్డ్ చేయాలన్నది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. చంద్రబాబుకు ఎలాగూ వయసు అయిపోయింది. టీడీపీ గెలిచినా.. గెలవకపోయినా.. వచ్చే ఎన్నికల తర్వాత లోకేశ్‌కు పూర్తిగా పార్టీ పగ్గాలు అప్పజెప్పడం ఖాయం. ఇలా లోకేశ్‌ను లీడర్‌గా నిలబెట్టి.. తారక్‌కు అవకాశం లేకుండా చేయాలన్నది ప్లాన్‌గా తెలుస్తోంది. ఇదంతా జరుగుతుందా అంటే.. ఇది జరిగే అవకాశం కూడా ఉంది. దీంతో టీడీపీలో పరిణామాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయ్.