Jupally Krishna Rao: జూపల్లి రికార్డ్.. ఐదుగురు సీఎంల దగ్గర మంత్రిగా..
1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2004లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. 2009, 2012లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ జూపల్లి గెలుపొందారు.
Jupally Krishna Rao: కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జూపల్లి కృష్ణారావుకి రేవంత్ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే అయిన జూపల్లి.. ఐదేళ్ళ తర్వాత మంత్రి అయ్యారు. కేసీఆర్‌తో విభేదించిన జూపల్లి.. ఈ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే పొంగులేటి, తుమ్మలతో కలసి కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్‌తో కలిసి.. ఐదుగురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసిన అనుభవం జూపల్లికి ఉంది. ప్రస్తుత వనపర్తి జిల్లా చిన్నంభవి మండలం పెద్ద దగడలో 1955లో జూపల్లి కృష్ణారావు జన్మించారు.
REVANTH REDDY: శభాష్ రేవంత్.. చంద్రబాబు శుభాకాంక్షలు..
1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2004లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. 2009, 2012లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ జూపల్లి గెలుపొందారు. ఇప్పటికి నలుగురు ముఖ్యమంత్రుల క్యాబినెట్‌లో మంత్రిగా జూపల్లి పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య, కేసీఆర్ క్యాబినెట్‌లో జూపల్లి మంత్రిగా పని చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేసిన జూపల్లి టీఆర్ఎస్‌లో చేరారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కేసిఆర్ కేబినెట్‌లో భారీ పరిశ్రమలు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పని చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా జూపల్లి కృష్ణారావు ఓడిపోయారు. తనపై గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డిని బీఆర్ఎస్‌లోకి చేర్చుకున్నారు కేసీఆర్. దాంతో జూపల్లి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. బీఆర్ఎస్‌లోనే కొనసాగుతూ క్యాడర్ దెబ్బతినకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అనుచరులను గెలిపించుకున్నాడు.
2023లో టికెట్ తనకే వస్తుందని జూపల్లి ఆశ పెట్టుకున్నారు. కానీ సిట్టింగ్‌లకే టిక్కెట్లు అని కేసిఆర్ ప్రకటించడం జూపల్లిలో అసంతృప్తి కలిగించింది. ఇదే టైమ్‌లో ఖమ్మం జిల్లాలోని కీలక నేతలు పొంగులేటి, తుమ్మలతో సంప్రదింపులు జరిపి కాంగ్రెస్ పార్టీలోకి మారేందుకు సిద్ధమ్యారు జూపల్లి కృష్ణారావు. అయితే ఆయన్ని బీఆర్ఎస్ అధిష్టానం సస్పెండ్ చేసింది. దాంతో జూపల్లి కాంగ్రెస్ పార్టీ నుంచి కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి, గెలిచారు. ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారు జూపల్లి. తాజాగా రేవంత్ కేబినెట్లో మంత్రిగా ప్రమాణం చేశారు.