Jyothula Chanti Babu: వైసీపీలో మార్పుల ఎఫెక్ట్.. టీడీపీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే!
సీపీ టికెట్ రాదని భావిస్తున్న ఆయన.. టీడీపీ పెద్దలతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి వైసీపీలో చేశారు.
Jyothula Chanti Babu: సీట్ల మార్పుతో వైసీపీ నేతల్లో టెన్షన్ స్టార్ట్ అయింది. ఇప్పటికే కొందరు నేతలు పక్కచూపులు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు రాదని అనుకుంటున్న నాయకులు.. సైకిల్ పార్టీతో టచ్‌లోకి వెళ్తున్నారు. టికెట్ హామీ దొరికితే జంపింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పార్టీ మారుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ టికెట్ రాదని భావిస్తున్న ఆయన.. టీడీపీ పెద్దలతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి వైసీపీలో చేశారు.
YS JAGAN: క్రిస్మస్ వేడుకల్లో జగన్.. తల్లితో కలిసి కేక్ కట్ చేసిన సీఎం జగన్
2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున జగ్గంపేట నుంచి పోటీ చేసిన జ్యోతుల చంటిబాబు.. ఓడిపోయారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. ఆయన ఏలేరు ప్రాజెక్టు ఛైర్మన్‌గా పనిచేసారు. వైసీపీ అధిష్ఠానం నియోజకవర్గాల సమన్వయకర్తలను మారుస్తోందీ. దీంతో వైసీపీలో టికెట్ ఆశలు గల్లంతు కావడంతో.. నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీ చేరిన జ్యోతుల చంటిబాబుకు.. జగన్ జగ్గంపేట టికెట్ కేటాయించారు. దీంతో ఆ ఎన్నికల్లో చంటిబాబు జగ్గంపేట ఎమ్మెల్యేగా గెలిచారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ డౌటే అని తెలియడంతో.. చంటిబాబు మళ్లీ టీడీపీ చేరేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల చంటిబాబు బంధువులు. జగ్గంపేటలో తన కుటుంబానికి చెందిన వారే ఎమ్మెల్యేగా ఉండాలని.. బయట వ్యక్తులు మద్దతు ఇవ్వలేమని జ్యోతుల చంటిబాబు తన అనుచరులతో అన్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న ఎమ్మెల్యే చంటిబాబు.. పార్టీలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి.
మేం ఏమైనా ఈ పార్టీలో శాశ్వతమా అంటూ ఈ మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారో ఎవరికి తెలుసు.. ఏ పార్టీలో ఎవరూ శాశ్వతం కాదని అన్నారు. ఎమ్మెల్యే చంటిబాబు చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఐతే ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో జంపింగ్‌లు మొదలయ్యాయ్. టికెట్ ఆశించిన నేతలు పార్టీలు మారుతున్నారు. వైసీపీ సస్పెండ్ చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. మార్పులు చేర్పుల ప్రభావంతో ఇంకెంతమంది పార్టీ మారతారన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.