KA PAUL: కేఏ పాల్‌పై విష ప్రయోగం జరిగిందా.. వైరల్ ఆడియోలో ఏముంది..?

కేఏ పాల్ మాట్లాడినట్లు ఉన్న ఆడియో వైరల్ అవుతోంది. డిసెంబర్ 25న ఫుడ్ పాయిజన్‌తో తనను చంపాలని చూశారని.. దీంతో ఎవరికీ చెప్పకుండా తాను విశాఖలో చికిత్స పొందుతున్నట్లు కేఏ పాల్ అన్నట్లుగా ఆ ఆడియోలో ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 5, 2024 | 06:29 PMLast Updated on: Jan 05, 2024 | 6:29 PM

Ka Paul Audio About His Health Goes Viral On Social Media

KA PAUL: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పేరతో ఆడియో ఒకటి.. సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తనను చంపాలని చూస్తున్నారంటూ.. కేఏ పాల్ మాట్లాడినట్లు ఉన్న ఆడియో వైరల్ అవుతోంది. డిసెంబర్ 25న ఫుడ్ పాయిజన్‌తో తనను చంపాలని చూశారని.. దీంతో ఎవరికీ చెప్పకుండా తాను విశాఖలో చికిత్స పొందుతున్నట్లు కేఏ పాల్ అన్నట్లుగా ఆ ఆడియోలో ఉంది. విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని ఆ ఆడియోలో చెప్పారు.

YS JAGAN: పవన్‌ను తిట్టే తిట్లే.. జగన్‌ కొంప ముంచుతున్నాయా..?

ఫుడ్ పాయిజనింగ్ తర్వాత ప్రస్తుతం కోలుకుంటున్నానని.. దేవుడి దయ వల్ల ప్రాణాలతో బతికి బయటపడ్డానంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయం చెప్పొచ్చో.. లేదోనని ఇన్ని రోజులు తాను మౌనంగా ఉన్నట్లు.. పది రోజుల నుంచి నరకం అనుభవిస్తున్నట్లు.. కాన్ఫిడెన్షియల్‌గా చికిత్స తీసుకుంటున్నట్లు ఆ ఆడియోలో ఉంది. రాజకీయ కుట్రలతో తనపై హత్యాయత్నం జరిగిందని కేఏ పాల్ చెప్పినట్లుగా ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇలా తనపై విష ప్రయోగం జరిగిందని కేఏ పాల్ పేరుతో ఆడియో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. మెడికో ప్రీతి కేసు, ఇతర ప్రభుత్వాల వైఫల్యాలపై గట్టిగా ప్రశ్నించినందుకు తనను టార్గెట్‌ చేశారని.. అందుకే తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ.. ఆ మధ్య కేఏ పాల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఐతే ఇప్పుడు విషప్రయోగం అంటూ మళ్లీ ఆడియో వైరల్‌గా మారడం కలకలం రేపుతోంది. గ్లోబల్‌ పీస్‌ మేకర్‌గా కేఏ పాల్‌కు పేరుంది.

ఏపీలోని చిట్టివలస గ్రామంలో ఆయన పుట్టారు. మత ప్రచారకుడిగా తన తండ్రితో కలిసి వెళ్తూ అలా గోస్పల్ ఫౌండేషన్‌కు అన్నీ తానై క్రిస్టియానిటీ బోధకుడిగా మారారు. తనకు బోయింగ్ విమానం ఉందని పదేపదే చెప్పే కేఏపాల్‌.. దాన్ని చూపించలేదు ఎప్పుడూ! దీనికితోడు ఆయన ఆరోపణలు, మాటలు కూడా కోటలు దాటినట్లు ఉంటాయ్. దీంతో కేఏ పాల్‌ మీద ఒకరకమైన అభిప్రాయం వచ్చింది ఓ వర్గం జనాలకు. అలాంటిది ఇప్పుడు విష ప్రయోగం అంటూ ఆయన వాయిస్‌తో ఆడియో వైరల్ కావడం.. కొత్త చర్చకు కారణం అవుతోంది.