Kadiyam Kavya: కావ్యకు రెండు పార్టీల్లో శత్రువులు ! గెలుపు అంత ఈజీ కాదా!!
వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న కడియం కావ్యకు అడుగడునా ఇబ్బందులు తప్పడం లేదు. పార్టీ మారినందుకు, కాంగ్రెస్‌లో జాయిన్ అయినందుకు కడియం శ్రీహరి, కావ్య.. అధికార, అపోజిషన్ పార్టీలకు శత్రువుగా మారారు.
Kadiyam Kavya: వరంగల్ ఎంపీ BRS టిక్కెట్ వద్దనుకొని కాంగ్రెస్‌లో చేరిన కడియం కావ్య పరిస్థితి.. ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నట్టుగా ఉంది. తమ పార్టీని కాదని వెళ్ళిన ఆమెను ఎలాగైనా ఓడించాలని గులాబీ శ్రేణులు చూస్తున్నాయి. ఇక కాంగ్రెస్‌లోకి వచ్చి.. తమ అవకాశాలను కావ్య దెబ్బతీసిందని హస్తం పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యా తన కూతురును గెలిపించుకోవాలని మాజీ మంత్రి కడియం శ్రీహరి పోరాటం చేస్తున్నారు.
CM Revanth IPL Match: ఫ్యామిలీతో కలిసి IPL మ్యాచ్‌కి సీఎం రేవంత్ రెడ్డి..!
వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న కడియం కావ్యకు అడుగడునా ఇబ్బందులు తప్పడం లేదు. పార్టీ మారినందుకు, కాంగ్రెస్‌లో జాయిన్ అయినందుకు కడియం శ్రీహరి, కావ్య.. అధికార, అపోజిషన్ పార్టీలకు శత్రువుగా మారారు. ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ మారినందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. తమ టిక్కెట్టుకు ఎసరు పెట్టారంటూ కాంగ్రెస్ నేతలు కోపంగా ఉన్నారు. టిక్కెట్టు ప్రకటించాక గులాబీ బాస్‌ను అవమానిస్తూ కాంగ్రెస్‌లోకి జంప్ చేయడంపై BRS ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కోపంగా ఉన్నారు. కావ్యను ఓడించడం ద్వారా కడియం శ్రీహరికి కూడా చెక్ పెట్టాలని గట్టి ప్రయత్నంలో ఉన్నారు. వరంగల్ BRS పార్టీ మీటింగ్‌లో ఆ పార్టీ నేతలంతా కడియంపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు వరంగల్ నేతలంతా మండిపడ్డారు. కడియం కావ్యకు ఎలా చెక్ పెట్టాలన్న దానిపై వ్యూహం రచించారు. కావ్య పార్టీ మారకముందు కాంగ్రెస్‌లో వరంగల్ సీటు కోసం ఆశావహులు భారీగా గాంధీభవన్ ముందు క్యూలు కట్టారు. ఢిల్లీలో AICC స్థాయిలోనూ పైరవీలు చేసుకున్నారు.
కానీ వాళ్ళెవరికీ కాకుండా కావ్యకు టిక్కెట్ ఇవ్వడంపై హస్తం పార్టీ నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కడియం శ్రీహరి కాంగ్రెస్‌లోకి రావడంపై మంత్రులు సీతక్క, కొండా సురేఖ కూడా ఇబ్బందిగా ఫీలవుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌లో తమ విధేయతను లెక్కలోకి తీసుకోకుండా.. శ్రీహరి కూతురికి టిక్కెట్ ఇవ్వడమేంటని కొందరు లీడర్లు మండిపడుతున్నారు. కడియం శ్రీహరి చేరికను ఓ మంత్రితో పాటు నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు వీళ్ళంతా కడియం కావ్యకు శత్రువులుగా మారుతున్నారు. ఆమెను ఓడించడమే లక్ష్యంగా BRS, కాంగ్రెస్ నేతలు పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో నేతలను దగ్గర చేసుకుంటూనే.. BRS దాడిని తట్టుకొని.. తన కూతురు కావ్యను కడియం శ్రీహరి ఎలా గెలిపించుకుంటారో చూడాలి. కానీ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కడియం కావ్య గెలుపు మాత్రం అంత ఈజీ కాదన్న టాక్ నడుస్తోంది.