Kadiyam Srihari Vs Rajaiah: వరంగల్ బీఆర్ఎస్ ఎంపీగా రాజయ్య.. కడియం మీద ప్రతీకారం తీర్చుకుంటారా..?
కడియం కుట్ర చేసి.. తనకు టికెట్ రాకుండా చేశారని రాజయ్య రగిలిపోయారు. ఐతే ఇప్పుడు ఎంపీ పోటీ రూపంలో.. తనకు మంచి చాన్స్ వచ్చిందని రాజయ్య ఫీల్ అవుతున్నారు. వరంగల్ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న కడియం కావ్యను ఓడిస్తే.. శ్రీహరి మీద ప్రతీకారం తీర్చుకున్నట్లు ఉంటుందని రాజయ్య భావిస్తున్నారు.
Kadiyam Srihari Vs Rajaiah: వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఎవరికిన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే బ్యాక్ టు బీఆర్ఎస్ అన్నారు. ఆయనకే వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చారు కేసీఆర్. స్టేషన్ ఘన్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ ఖరారు చేయగా.. ఆమె పోటీ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత తండ్రితో కలిసి కాంగ్రెస్‌లో చేరి.. ఆ పార్టీ నుంచి వరంగల్ ఎంపీ బరిలో ఉంది.
Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ పేలుడు.. కీలక నిందితుల అరెస్టు..
కడియం శ్రీహరి వ్యవహారంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయ్. కడియం వ్యవహారాన్ని కేసీఆర్ కూడా పర్సనల్‌గా తీసుకున్నట్లు కనిపిస్తున్నారు. దీంతో ఆయనకు ఎలాగైనా షాక్ ఇవ్వాలన్న ఆలోచనతో ఉంది గులాబీ పార్టీ. కడియం మీద రగిలిపోతున్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు టికెట్ ఇచ్చింది. రాజయ్యను ఫామ్‌హౌస్‌కు పిలిపించుకున్న కేసీఆర్… కీలక సూచనలు కూడా చేశారు. నిజానికి ఇద్దరు బీఆర్ఎస్‌లో ఉన్నప్పటి నుంచే కడియం శ్రీహరి, రాజయ్య మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయ్. కడియం కుట్ర చేసి.. తనకు టికెట్ రాకుండా చేశారని రాజయ్య రగిలిపోయారు. ఐతే ఇప్పుడు ఎంపీ పోటీ రూపంలో.. తనకు మంచి చాన్స్ వచ్చిందని రాజయ్య ఫీల్ అవుతున్నారు. వరంగల్ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న కడియం కావ్యను ఓడిస్తే.. శ్రీహరి మీద ప్రతీకారం తీర్చుకున్నట్లు ఉంటుందని రాజయ్య భావిస్తున్నారు.
నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ టికెట్‌ను రాజయ్యకు ఇచ్చేందుకు కేసీఆర్ నిరాకరించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య కాదని కడియం శ్రీహరికి టికెట్ కేటాయించారు. దీంతో అసంతృప్తికి గురైన రాజయ్య.. కొన్నాళ్లు మౌనంగా ఉండి.. ఈ మధ్యే బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఐతే ఇంతవరకు ఏ పార్టీలోనూ చేరలేదు. కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ లభించడంతో.. మళ్లీ బీఆర్ఎస్‌లో చేరి వరంగల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.