సీజ్ ది షిప్… పవన్ కు కలెక్టర్ షాక్
ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపిన సీజ్ ది షిప్ వ్యవహారంలో కాకినాడ కలెక్టర్ కీలక ప్రకటన చేసారు. స్టెల్లా షిప్ సీజ్ చేయడం కుదరదని పరోక్షంగా చెప్పేశారు.
ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపిన సీజ్ ది షిప్ వ్యవహారంలో కాకినాడ కలెక్టర్ కీలక ప్రకటన చేసారు. స్టెల్లా షిప్ సీజ్ చేయడం కుదరదని పరోక్షంగా చెప్పేశారు. గత నెల 29 న “సీజ్ ద షిప్” అని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఆ తర్వాత ఇది కస్టమ్స్ వ్యవహారం అని వార్తలు వచ్చాయి. ఏపీ ప్రభుత్వ పరిధిలోకి రాదని స్పష్టత వచ్చింది. ఈ తరుణంలో కాకినాడ కలెక్టర్ కీలక ప్రకటన చేసారు. ముందు షిప్ లో ఉన్న రేషన్ బియ్యం కిందకి దింపి తర్వాత లోడ్ చేస్తామని చెప్పారు.
రేషన్ బియ్యం కిందకి ఆన్ లోడ్ చేసిన తరువాత షిప్ పై నిర్ణయం తీసుకుంటామన్నారు. స్టెల్లా ఎల్ పనామా షిప్ లో12 శాంపిల్స్ సేకరించామన్న ఆయన షిప్ లో 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయని మొదట అనుకుంటే ..పరీక్షలు చేసిన తర్వాత 1320 టన్నులు రేషన్ బియ్యం ఉన్నట్లు తేలిందన్నారు. ఆ బియ్యాన్ని మొదట ఆన్ లోడ్ చేస్తామని తెలిపారు. అసలు ఏ రైస్ మిల్లు నుంచి ఆ బియ్యం వచ్చాయో తేలాలన్నారు. ఆ లోడ్ సత్యం బాలాజీ అనే ఎక్సపర్టర్స్ కి చెందినది గా గుర్తించామన్నారు.