Kalvakuntla Kavitha: ఆ అసెంబ్లీ సెగ్మెంట్ల వైపు కల్వకుంట్ల కవిత చూపు..!

త్వరలో జరగబోయే అసెంబ్లీ పోల్స్ ద్వారా మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో చక్రం తిప్పాలని కవిత భావిస్తున్నారట. ఈక్రమంలో తనకు రెడ్ కార్పెట్ పరిచేలా ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ కోసం వెతుకుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆమె ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో యాక్టివ్‌గా పర్యటిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 11, 2023 | 10:54 AMLast Updated on: Aug 11, 2023 | 10:57 AM

Kalvakuntla Kavitha Will Contest From Ellareddy

Kalvakuntla Kavitha: కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెంచాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమె .. ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ పోల్స్ ద్వారా మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో చక్రం తిప్పాలని కవిత భావిస్తున్నారట. ఈక్రమంలో తనకు రెడ్ కార్పెట్ పరిచేలా ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ కోసం వెతుకుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆమె ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో యాక్టివ్‌గా పర్యటిస్తున్నారు. కులసంఘాల నేతలతో తరచుగా భేటీ అవుతున్నారు. దీంతో ఆమె జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.
ఎల్లారెడ్డి.. ఎందుకు..?
ఉమ్మడి నిజామాబాద్‌లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌కు బలమైన అభ్యర్థులే ఉన్నారు. అయితే ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే గ్రాఫ్‌ మాత్రం రోజురోజుకు పడిపోతోందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆ నియోజకవర్గమే ఎల్లారెడ్డి. జూజుల సురేందర్‌ ప్రస్తుతం ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారనే సానుభూతితో.. మూడో సారి (గత ఎన్నికల్లో) జూజుల సురేందర్‌ గెలిచారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం కేసీఆర్ నిర్వహించిన సర్వేల్లో ఎమ్మెల్యే జూజుల సురేందర్‌ వెనుకబడిపోతున్నారని తెలుస్తోంది. దీంతో ఆయన ప్లేస్‌లో వేరే వారికి ఛాన్స్ ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోందట. ఈ విషయం తెలియడంతో ఎమ్మెల్సీ కవిత చూపు ఎల్లారెడ్డిపై పడిందని సమాచారం. దీనిపై ఆ ఎమ్మెల్యేకు కూడా సమాచారం అందటంతో.. ఎమ్మెల్సీ కవితను నియోజకవర్గానికి పిలిపించి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారని అంటున్నారు. ఒకవేళ ఎల్లారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి కవిత పోటీ చేయకపోతే.. బీఆర్‌ఎస్‌ నుంచి కొందరు యువనేతలు రేసులో ఉన్నారు.
నిజామాబాద్ అర్బన్, ముషీరాబాద్
ఎల్లారెడ్డి సీటుపై ఇంట్రెస్ట్ లేకుంటే నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ సీటుపై కవిత దృష్టిపెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా బిగాల గణేష్ గుప్తా ఉన్నారు. ఆయన ఇప్పటికే రెండుసార్లు వరుసగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. మూడోసారి కూడా రంగంలోకి దిగేందుకు బిగాల సమాయత్తమవుతున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ గా పనిచేస్తున్న ఆకుల లలిత కూడా అర్బన్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు కవిత ఆసక్తి చూపిస్తే.. బిగాల గణేష్ గుప్తా, ఆకుల లలిత టికెట్ రేసును ఆపేసి కవితకు మద్దతు తెలపడం ఖాయమని అంటున్నారు. ముషీరాబాద్ నుంచి కవిత బరిలోకి దిగుతారనే మరో ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

ముషీరాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ జాగృతి చేపట్టిన కార్యక్రమాలు, జీఎచ్ఎంసీ ఎన్నికల్లో గాంధీనగర్ ఇన్ ఛార్జ్‌గా పనిచేసిన అనుభవం కవితకు పనికొస్తుందని భావిస్తున్నారు. అత్యధికంగా సంక్షేమ పథకాలు పొందిన మైనార్టీలు ఈ సెగ్మెంట్లోనే ఉండటంతో కవిత విజయం సాధించడం సులువవుతుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. కవిత కోసం ముషీరాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే సైతం సీటు త్యాగానికి రెడీగా ఉన్నారని సమాచారం. గత ఎన్నికల సమయంలో ముషీరాబాద్ నియోజకవర్గంలో ముఠా గోపాల్‌కు ఎమ్మెల్సీ కవిత టికెట్ ఇప్పించారు. అయితే సీఎం కేసీఆర్ మనసులో ఏముంది అనేది కూడా చాలా ముఖ్యం. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి దోహదపడే బెస్ట్ ప్లేస్ నుంచి కవితను కేసీఆర్ పోటీ చేయిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి.