KAPULU ON TDP: టీడీపీపై రగిలిపోతున్న కాపులు…. తెలంగాణ ఎన్నికల్లో ద్రోహం చేస్తారా?
తెలుగుదేశంపై కాపులు రగిలిపోతున్నారు. ఏపీలో టిడిపి జనసేన పొత్తులు ఉన్నాయని చెబుతూ...తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనని గాలికి వదిలేసిందని కాపు నేతలు ఆగ్రహంతో ఉన్నారు. రేపు ఏపీ ఎన్నికల్లో కూడా ఇలాగే వాడుకొని వదిలేస్తారా అనే చర్చ జరుగుతుంది కాపుల్లో. తెలంగాణలో టిడిపి పోటీ చేయకపోయినా ఫర్వాలేదు కనీసం జనసేన అభ్యర్థులకు ఓటు వేయమని చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదనీ.. దానివల్లే ఏడు చోట్ల జనసేన డిపాజిట్లు కోల్పోయిందనీ.. 8 చోట్ల పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేకపోయామని జనసేన నాయకులు, కాపులు ఆవేదనతో ఉన్నారు.
KAPULU ON TDP : తెలుగుదేశంపై కాపులు రగిలిపోతున్నారు. ఏపీలో టిడిపి జనసేన పొత్తులు ఉన్నాయని చెబుతూ…తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనని గాలికి వదిలేసిందని కాపు నేతలు ఆగ్రహంతో ఉన్నారు. రేపు ఏపీ ఎన్నికల్లో కూడా ఇలాగే వాడుకొని వదిలేస్తారా అనే చర్చ జరుగుతుంది కాపుల్లో. తెలంగాణలో టిడిపి పోటీ చేయకపోయినా ఫర్వాలేదు కనీసం జనసేన అభ్యర్థులకు ఓటు వేయమని చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదనీ.. దానివల్లే ఏడు చోట్ల జనసేన డిపాజిట్లు కోల్పోయిందనీ.. 8 చోట్ల పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేకపోయామని జనసేన నాయకులు, కాపులు ఆవేదనతో ఉన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, జనసేన కలిసి పోటీ చేశాయి. చివరి నిమిషంలో జనసేనకు ఎనిమిది సీట్లు కేటాయించింది బిజెపి. కాపులు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న చోట జనసేన అభ్యర్థులు నిలబడ్డారు. అయితే వ్యూహాత్మకంగా టిడిపి తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. అంతేకాదు చంద్రబాబు అరెస్టు అయినప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కమ్మ సామాజిక వర్గం, టిడిపి ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటు వేయాలని తీర్మానించాయి. అందుకు అనుకూలంగా టిడిపి ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. తెలంగాణలో సీమాంధ్ర ఓట్లన్నీ కాంగ్రెస్ కే పడేటట్లుగా వాతావరణం సృష్టించింది టిడిపి. దీనిపై కాపు నాయకులు రగిలిపోతున్నారు. టిడిపి వాళ్లు ఒకపక్క ఆంధ్రాలో జనసేనతో పొత్తు అంటారు…. తెలంగాణకు వచ్చి కాంగ్రెస్ కి మద్దతు ఇస్తారు. జనసేనతో పొత్తులో నిజాయితీ ఉంటే తెలంగాణలో కూడా పొత్తు పెట్టుకోవాలి కదా. ఆంధ్రాలో ఒకలాగా తెలంగాణలో మరోలాగా టిడిపి తనకు అనుకూలమైన విధానాల్ని అవలంబించడంపైనే కాపులు ఇప్పుడు కోపంతో ఉన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ కి ఓటేయండి అని రహస్యంగా తన కేడర్ కు కమ్మ సామాజిక వర్గానికి సందేశం ఇచ్చిన టిడిపి…. జనసేన ని ఎలా వదిలేస్తుందని ప్రశ్నిస్తున్నారు కాపు నేతలు. కూకట్ పల్లిలో జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ కాపు. కానీ ఆయనకి టిడిపి గానీ, కమ్మవాళ్ళు గాని ఓటేయలేదు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ కమ్మ. కమ్మ వాళ్లంతా బండి రమేష్ కి, పరోక్షంగా కాంగ్రెస్ కి ఓటేసుకున్నారు. ఇక్కడ కమ్మ ,కాంగ్రెస్ రెండు వాళ్లకు కలిసి వచ్చాయి. జనసేన అభ్యర్థి చిత్తుగా ఓడిపోవడానికి కూకట్ పల్లి లో కమ్మ సామాజిక వర్గం, టిడిపి వాళ్ళే కారణమని కాపులు మండిపడుతున్నారు.
ఖమ్మంలో జనసేన పోటీ చేసిన నాలుగు నియోజకవర్గాల్లోనూ డిపాజిట్ దక్కలేదు. అక్కడ టిడిపి ఓట్లు తమకు పడి ఉంటే కనీసం గౌరవంగా బయటపడే వాళ్ళని జనసేనలో కాపులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేవిధంగా రేపు ఏపీలో కూడా జరిగితే పరిస్థితి ఏంటని తమలో తమ చర్చించుకుంటున్నారు. ఏపీలో జనసేన అభ్యర్థి పోటీ చేసే చోట కమ్మ వాళ్లంతా ఓటు వెయ్యకపోతే కూకట్ పల్లి అభ్యర్థి లాగే ఓటమి తప్పదని, అలాంటప్పుడు ఏపీలో టిడిపి కమ్మ అభ్యర్థులకి కాపులు ఎందుకు ఓటేయాలని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో ఉన్న జనసేన, టిడిపి పొత్తులు తెలంగాణలో ఎందుకు ఉండవు? అక్కడో విధానం… ఇక్కడో విధానమా? ఇదేం రాజకీయం ?అంటూ ప్రశ్నిస్తున్నారు. పొత్తు విషయంలో టిడిపికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో తాను పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ…. తన క్యాడర్ కి, కమ్మ సామాజిక వర్గానికి స్పష్టంగా జనసేనకు ఓటు వేయమని చెప్పి ఉండాల్సిందనీ… అలా చేయకుండా కాంగ్రెస్ కి ఓటు వేయమని టిడిపి క్యాడర్ కి, కమ్మవాళ్ళకి ఎలా చెప్తారు అని కాపు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొత్తులు విషయంలో చంద్రబాబు ఎత్తులు ఎప్పుడూ ఇలాగే ఉంటాయనీ…. రేపు ఏపీ ఎన్నికల్లో జనసేనని వీలున్న చోట్ల వాడుకొని టిడిపి వాళ్లు దెబ్బతీసినా ఆశ్చర్యం లేదని కాపు నాయకులు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని ముందస్తుగా హెచ్చరిస్తున్నారు.