CM kcr: కర్ణాటక ఫలితాలతో కేసీఆర్‌కు షాక్‌… బీఆర్‌ఎస్‌కు లెక్కలన్నీ రివర్స్ అయ్యాయా ?

సార్వత్రిక ఎన్నికలపై కర్ణాటక ఫలితాల ప్రభావం ఉంటుందో లేదో కానీ.. తెలంగాణ, ఏపీ మీద మాత్రం పక్కాగా కనిపిస్తుంది ఎఫెక్ట్. తెలుగు రాష్ట్రాలు కూడా ఈ ఫలితాలను ఆసక్తిగా గమనించింది అందుకే ! జంపింగ్‌ చేద్దామనుకున్నవాళ్లు.. కర్ణాటక ఫలితాల కోసమే ఆగిపోయారు కూడా ! మిగతా వాళ్ల సంగతి ఎలా ఉన్నా.. బీఆర్ఎస్‌ మాత్రం కర్ణాటక ఫలితాలపై కోట్ల ఆశలు పెట్టుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 13, 2023 | 05:17 PMLast Updated on: May 13, 2023 | 5:17 PM

Karnataka Election Result Shock To Cm Kcr

కర్ణాటకలో జేడీఎస్‌ కీ రోల్ ప్లే చేస్తుందేమో.. బీఆర్ఎస్ జాతీయ వ్యూహాలు పక్కాగా అమలు చేయొచ్చని ప్లాన్ చేస్తే.. కేసీఆర్‌కు సీన్‌ రివర్స్ అయిన పరిస్థితి. ఫలితాలతో షాక్‌ తగిలింది ఒకరకంగా ఆయనకు! నిజానికి బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి జేడీఎస్‌ గులాబీ పార్టీతోనే కనిపించింది. ఒకరకంగా బీఆర్ఎస్‌ మొదటి ఫ్రెండ్‌ కుమారస్వామినే ! కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ సత్తా చాటితే.. ఢిల్లీ రాజకీయాల్లో తిరుగు ఉండదని కేసీఆర్‌ భావించారు.

కట్ చేస్తే.. మొత్తానికే సీన్ రివర్స్‌. జేడీఎస్సే ఇప్పుడు ఉనికి కోసం పోరాడే పరిస్థితులు తలెత్తాయ్. మళ్లీ హంగ్ వస్తుందేమో అని కేసీఆర్ చాలా ప్లాన్లే వేశారు. ఐతే కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ సాధించింది. దీంతో కేసీఆర్ అంచనాలు తారుమారు అయ్యాయ్. గతంలోనే కంటే జేడీఎస్‌కు తక్కువ సీట్లు వచ్చాయ్. దాదాపు పది సీట్లకు పైగా తగ్గిపోయాయ్. దీంతో రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో జేడీఎస్‌తో కలిసి పోటీ చేయాలని ఆలోచన చేసిన కేసీఆర్.. ఇప్పుడు మళ్లీ ఆలోచనలో పడినట్లు కనిపిస్తున్నారు. జేడీఎస్‌తో ఎలాంటి లాభం లేదని తేలిపోయింది. దీంతో కర్ణాటకలో బీఆర్ఎస్‌ను ఎలా లాంచ్ చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

జేడీఎస్ సంగతి వదిలేస్తే.. కర్ణాటక, తెలంగాణలో పరిణామాలు సేమ్ టు సేమ్ అనిపిస్తున్నాయ్. కన్నడనాట బీజేపీ సర్కార్‌ మీద, ఎమ్మెల్యేల మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు వినిపించాయ్. దీన్ని కాంగ్రెస్ క్యాష్‌ చేసుకుంది. గ్రాండ్ విక్టరీ కొట్టింది. తెలంగాణలోనూ కేసీఆర్‌ మీద, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత పెరుగుతోంది. అవినీతి ఆరోపణలు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయ్. ఇక్కడ కూడా వాటిని కాంగ్రెస్ క్యాష్‌ చేసుకొని.. స్ట్రాంగ్ అయితే పరిస్థితి ఏంటా అనే టెన్షన్ కూడా కేసీఆర్‌ను వెంటాడుతుందనే చర్చ జరుగుతోంది. బీజేపీతో కంపేర్‌ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్సే బలంగా ఉంది. దీంతో హస్తం పార్టీ వ్యూహాలకు ఇప్పటి నుంచే చెక్ పెట్టాలని కేసీఆర్ ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.