Karnataka Exit Polls: పోటాపోటీగా బీజేపీ-కాంగ్రెస్.. కర్ణాటకలో హంగ్ తప్పదా..? ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయ్?
కొన్ని సంస్థలు కాంగ్రెస్‌కు మెజారిటీ వస్తుందని చెబుతుంటే.. ఇంకొన్ని సంస్థలు బీజేపీ కూడా మెజారిటీ సీట్లు సాధించే అవకాశాలున్నాయని చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా సీట్లు సాధించే అవకాశం ఉంది.
Karnataka Exit Polls: అందరి అంచనాలకు తగ్గట్లుగానే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించనుంది. అయితే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సాధిస్తుందా.. లేదా అనేదే సందేహాస్పదంగా ఉంది. ఎందుకంటే అనేక సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. కొన్ని సంస్థలు కాంగ్రెస్‌కు మెజారిటీ వస్తుందని చెబుతుంటే.. ఇంకొన్ని సంస్థలు బీజేపీ కూడా మెజారిటీ సీట్లు సాధించే అవకాశాలున్నాయని చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా సీట్లు సాధించే అవకాశం ఉంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్, ఇతర అభ్యర్థుల పాత్ర కీలకం కానుంది. ఈ నేపథ్యంలో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీలో 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. 113 సీట్లు సాధించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. బుధవారం సాయంత్రానికి ఓటింగ్ చివరి దశకు చేరుకుంది. కొన్ని పోలింగ్ బూత్‌లలో సాయంత్రం ఆరు గంటలలోపు క్యూలో నిలబడ్డవారికి మాత్రం ఇంకా ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో నిబంధనల ప్రకారం.. సాయంత్రం ఆరున్నర గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధించబోతున్నప్పటికీ అది ప్రభుత్వ ఏర్పాటుకు దారితీస్తుందా.. లేదా అనేదే తేలాలి. ఒకవేళ బీజేపీ అధికారం కోల్పోయినప్పటికీ మరీ ఘోరంగా ఓడిపోవడం లేదు. గౌరవప్రదమైన సీట్లనే సాధించబోతుంది. అధికారం దూరమైనా బీజేపీ బలమైన ప్రతిపక్షంగా ఉండటం ఖాయం. బీజేపీ-కాంగ్రెస్.. రెండు పక్షాలకూ దాదాపు సమానమైన సీట్లు వస్తే.. జేడీఎస్ ఎవరికి మద్దతు ఇస్తుందో వాళ్లు అధికారం చేపట్టడం ఖాయం. అందువల్ల కర్ణాటక రాజకీయం మరికొంత కాలం రసవత్తరంగా కొనసాగే అవకాశం ఉంది. వివిధ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివి.
మొత్తం స్థానాలు: 224
అధికారం చేపట్టేందుకు కావాల్సినవి: 113
పీపుల్స్ పల్స్-సౌత్ ఫస్ట్ సర్వే
కాంగ్రెస్: 107-119
బీజేపీ: 78-90
జేడీఎస్: 23-29
ఇతరులు: 1-3
జీ న్యూస్-మ్యాట్రిజ్ ఏజెన్సీ
కాంగ్రెస్: 103-118
బీజేపీ: 79-94
జేడీఎస్: 25-33
ఇతరులు: 02-05
సీ వోటర్ సర్వే
కాంగ్రెస్: 100-112
బీజేపీ: 83-95
జేడీఎస్: 21-29
ఇతరులు: 02-06
సువర్ణ న్యూస్
కాంగ్రెస్: 91-106
బీజేపీ: 94-117
జేడీఎస్: 14-24
ఇతరులు: 0-2
పోల్‌స్ట్రాట్ సర్వే
కాంగ్రెస్: 99-110
బీజేపీ: 88-98
జేడీఎస్: 21-26
ఇతరులు: 0-4
రిపబ్లిక్-పిమార్క్
కాంగ్రెస్: 94-108
బీజేపీ: 85-100
జేడీఎస్: 24-32
ఇతరులు: 02-06
సీజీఎస్-న్యూస్ స్టేషన్
కాంగ్రెస్: 86
బీజేపీ: 114
జేడీఎస్: 21
ఇతరులు: 3
టీవీ9-భారత్ వర్ష
కాంగ్రెస్: 99-109
బీజేపీ: 88-98
జేడీఎస్: 21-26
ఇతరులు: 0-4
జన్ కి బాత్
కాంగ్రెస్: 91-106
బీజేపీ: 94-117
జేడీఎస్: 14-24
ఇతరులు: 0-2