Kaushik Reddy: ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి
గత ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న కొందరు నేతలు.. మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. వాళ్లు ఇప్పుడున్న పదవులకు రాజీనామా చేయకుండా ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయకూడదు. దీంతో వరుసగా తమ పాత పదవులకు రాజీనామాలు చేస్తున్నారు.
Kaushik Reddy: తెలంగాణలో కొత్త అసెంబ్లీ కొలువుదీరింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్లతో ప్రమాణస్వీకారం చేశారు. కానీ ఇప్పటికే పదవుల్లో ఉన్నవాళ్లు మాత్రం ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయలేదు. గత ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న కొందరు నేతలు.. మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. వాళ్లు ఇప్పుడున్న పదవులకు రాజీనామా చేయకుండా ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయకూడదు.
దీంతో వరుసగా తమ పాత పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన కౌశిక్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి శనివారం రాజీనామా చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి తన రాజీనామాను అందించారు. కౌశిక్ రాజీనామాను మండలి చైర్మన్ వెంటనే ఆమోదించారు. దీంతో ఇప్పటి నుంచి కౌశిక్ హుజురాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగబోతున్నారు. కౌశిక్‌తో పాటు మరి కొందరు కూడా ఇవాళ అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయలేదు. మాజీ మంత్రి కేటీర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అసెంబ్లీకి రాలేదు.
కేసీఆర్‌కు ఆపరేషన్ జరిగిన కారణంగా అసెంబ్లీకి రాలేకపోతున్నట్టు అసెంబ్లీ సెక్రెటరీకి తెలిపారు కేటీఆర్. ప్రమాణ స్వీకారానికి మరో తేదీ ఇవ్వాల్సిందిగా కోరారు. దీంతో ఇప్పుడు ప్రమాణస్వీకారం చేయని ఎమ్మెల్యేలంతా.. మరో రోజు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.