కౌశిక్ రెడ్డి ఇంట్లో కూర్చున్న గాంధీ, దమ్ముంటే రా
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం ఇప్పుడు ఇంటి వరకు వెళ్ళింది. అరికేపూడి గాంధీ ఇంటికి వస్తా అంటూ కౌశిక్ రెడ్డి సవాల్ చేయగా... దాన్ని గాంధీ సీరియస్ గా తీసుకున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం ఇప్పుడు ఇంటి వరకు వెళ్ళింది. అరికేపూడి గాంధీ ఇంటికి వస్తా అంటూ కౌశిక్ రెడ్డి సవాల్ చేయగా… దాన్ని గాంధీ సీరియస్ గా తీసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎదురు చూసిన గాంధీ… నేరుగా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. గాంధీని కాంగ్రెస్ కార్యకర్తలను అదుపు చేయడానికి పోలీసులు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
కౌశిక్ రెడ్డి ఇంటి గేట్లు విరగొట్టి గాంధీ అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించారు. కౌశిక్ రెడ్డి ఇంట్లో గాంధీ ధర్నాకు దిగారు. కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు పగలగొట్టారు. కోడి గుడ్లు విసిరి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారు. దీనితో పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించుతున్నారు. కౌశిక్ రెడ్డిపై టమాటాలు, కోడి గుడ్లు విసిరారు కాంగ్రెస్ కార్యకర్తలు. కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తా అని రాలేదని అందుకే నేను వచ్చా అన్నారు గాంధీ. కౌశిక్ రెడ్డికి దమ్ము లేదు అని తనకు ఉంది కాబట్టే తాను వచ్చా అన్నారు. దమ్ముంటే కౌశిక్ రెడ్డి బయటకు రావాలని సవాల్ చేసారు.