Kavita: ఫోన్లు ధ్వంసం చేయలేదు సరే..అన్ని మొబైల్స్‌తో ఏం చేశావ్ కవితమ్మా ?
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ఎపిసోడ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఈడీ నిర్ణయాలు ఎలా ఉంటాయో.. కవిత అరెస్ట్ అవుతుందో లేదో అనే టెన్షన్.. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కనిపిస్తోందిప్పుడు ! ఉక్కు పిడికిలి బిగించి విచారణకు వెళ్లడం.. రెండు వేళ్లు ఊపుతూ బయటకు రావడం.. రెండుసార్లు జరిగింది ఇదే ! ఇప్పుడు మూడోసారి ఏం జరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
మూడోరోజు విచారణకు వెళ్లే ముందు ఫోన్‌లు మీడియాకు చూపిస్తూ మరీ వెళ్లింది కవిత ! ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. కవిత పది ఫోన్లను ధ్వంసం చేశారని.. ఈడీ గతంలో చార్జిషీట్‌లో తెలిపింది. ఐతే ఫోన్ల ధ్వంసం చేయలేదని కవిత ఎక్కడా, ఎప్పుడూ చెప్పలేదు. ఈడీ ఆరోపణలను ఖండించలేదు. ఐతే ఇప్పుడు అనుకోని ఝలక్ ఇచ్చారు. తాను ధ్వంసం చేశానని ప్రచారం జరుగుతున్న ఫోన్లను బయటకు వచ్చాక ప్రదర్శించారు.
ఆ ఫోన్లపై తెల్లకాగితంతో రాసిన IMEI నంబర్లు కూడా ఉన్నాయ్. తాను ఫోన్లు విరగ్గొట్టలేదు అనే సందేశాన్ని మీడియా ద్వారా జనాల్లోకి పంపించే ప్రయత్నం చేశారు కవిత. ఐతే ఇది కాదు మ్యాటర్. పది ఫోన్లు ధ్వంసం చేయలేదు సరే.. అన్ని ఫోన్లు వాడాల్సిన అవసరం కవితకు ఏమొచ్చిందన్నదే ఇక్కడ అసలు మ్యాటర్. జాగృతి అధ్యక్షురాలిగా, ఎమ్మెల్సీగా, రాజకీయ నాయకురాలిగా.. ఎక్కువ ఫోన్లు, ఎక్కువ నంబర్లు అవసరమే ! రెండు మూడు మొబైల్స్ అంటే పర్లేదు.. మరి పది ఫోన్లతో ఏం దందా చేశావ్ కవితమ్మా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్.
పది ఫోన్లు వాడారు సరే.. అవేవి ధ్వంసం కాలేదని ముందే చెప్పొచ్చు కదా.. ఈ ఫోన్లు చూపించేది ఏదో ముందే చూపిస్తే.. ఇన్నాళ్ల విచారణ తీరు, జనాల్లో కనిపించే సింపథీ వేరేలా ఉండేది కదా.. ఈ ప్రశ్నలే ఇప్పుడు కవితను వెంటాడుతున్నాయ్. పది ఫోన్లు ధ్వంసం చేయలేదు సరే.. మరి ఆ పది నంబర్లు ఎందుకు పనిచేయలేదు.. కావాలనే స్విచ్ఛాఫ్ చేశారా.. ఈడీని పక్కదారి పట్టించడానికి ఆ ఫోన్లను దాచిపెట్టారు.. దాచిపెడితే పెట్టారు, ఇప్పుడెందుకు బయటకు తీశారు. ఈ ఫోన్లు చూపించినంత మాత్రాన సీన్ మొత్తం మారిపోతుందా.. పది ఫోన్లు చూపించడం కాదు.. పలు ప్రశ్నలకు కవిత సమాధానం చెప్పాల్సిన అవసరం కచ్చితంగా ఉందనే చర్చ జరుగుతోంది.