Top story: డాడీ నాకు పార్టీలో పెద్దపోస్ట్ కావాలి…. కెసిఆర్ కి డిమాండ్ పెట్టిన కవిత
బి ఆర్ఎస్ అధినేత , తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కి పెద్ద కష్టమే వచ్చి పడింది. ఆయన ముద్దుల కూతురు కవిత తనకు పార్టీలో ఏదో ఒక పెద్ద పొజిషన్ ఇవ్వాల్సిందేనని పట్టు పట్టుకుని కూర్చుందట.

బి ఆర్ఎస్ అధినేత , తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కి పెద్ద కష్టమే వచ్చి పడింది. ఆయన ముద్దుల కూతురు కవిత తనకు పార్టీలో ఏదో ఒక పెద్ద పొజిషన్ ఇవ్వాల్సిందేనని పట్టు పట్టుకుని కూర్చుందట. లిక్కర్ కేసులో జైలు కెళ్ళి వచ్చాక…. కవితకు తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఒక పెద్ద కార్యక్రమం ఏది దొరకడం లేదు. అంతేకాకుండా పార్టీలో కూడా కవిత కంటూ ఒక పొజిషన్ లేకపోవడంతో ఏ హోదాతో మాట్లాడాలో అర్థం కాక తనకు ఏదో ఒక పెద్ద పోస్ట్ ఇవ్వాలంటూ కెసిఆర్ ని డిమాండ్ చేస్తుందట కవిత.
తెలంగాణ జాగృతి తరపున కవిత ఇప్పటికే ముమ్మరంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటు జ్యోతిరావు పూలే ఫ్రంట్ పేరుతో వివిధ కార్యక్రమాలు చేస్తూ బీసీలకు కూడా దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నారామె. జైలు నుంచి వచ్చాక… కొన్నాళ్ళు కామ్‌గానే ఉన్నా… ఇటీవలి కాలంలో పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలతో పాటు సొంతగా కూడా కొన్ని ప్రోగ్రామ్స్ నిర్వహిస్తోంది కవిత.
అయితే… ఇలా బీసీ రిజర్వేషన్స్ మీద రౌండ్ టేబుల్ డిస్కషన్స్, జాగృతి పేరుతో ఇతర కార్యక్రమాలు ఎన్ని నిర్వహించినా….పెద్దగా ఉపయోగం ఉండదని, బీఆర్‌ఎస్ కీలక పదవిలో ఉండి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తే… ఆ కిక్కే వేరని అంటున్నారట కవిత సన్నిహితులు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నా…. ఆ పదవితో రాష్ట్రం మొత్తం తిరగడం కాస్త ఇబ్బందిగా ఉంటోందట. అందుకే… పార్టీలో స్టేట్ లెవల్ పోస్ట్, అది కూడా కీలకమైనది తీసుకోవాలన్నది కవిత ప్లాన్.అందుకు తగ్గట్టే ఆమె కూడా సదరు కీలక పదవి గురించి… తండ్రి కేసీఆర్ దగ్గర ప్రస్తావించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల్లో. ఆ మధ్య పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ కూడా కవిత ప్రస్తావన తీసుకువచ్చారు. తెలంగాణ జాగృతి తరఫున ఆమె కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు… పార్టీ కూడా సహకరించాలని చెప్పారు.
ఆ తర్వాతే జాగృతి ప్రోగ్రామ్స్ ఇంకా ఊపందుకున్నాయి. ఇక ఇదే ఊపులో….జాగృతి కన్నా… డైరెక్ట్‌గా పార్టీ రాష్ట్రస్థాయి పదవి తీసుకుని ప్రజల్లోకి వెళితే ఇంకా లాభం ఉంటుందన్న ఆలోచనలో ఉంది కెసిఆర్ కుమార్తె. కవిత ఏం చేసినా… అంతిమ లక్ష్యం బీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకురావడమేకాబట్టి… పెద్ద పదవితో పోరాడితే…. ఇంకా ఎఫెక్టివ్‌గా ఉంటుందని భావిస్తోంది. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. కవితకు కూడా ఆ స్థాయిలోనే ఓ పదవిని క్రియేట్ చేసి ఇస్తే బాగుంటుందన్న చర్చ జరుగుతోందట కొన్ని సర్కిల్స్‌లో. ఖాళీగా ఉన్న సెక్రటరీ జనరల్ కానీ, లేదంటే… వైస్ ప్రెసిడెంట్ పదవిని కొత్తగా క్రియేట్ చేసిగానీ.. ఆ పదవిలో ఉండాలన్నది కవిత మనసులో మాట.దీనికి సంబంధించి ఇప్పటికే కేసీఆర్‌కు క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతానికి బీఆర్ఎస్ కంటే ఎక్కువగా జాగృతి కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇదే ఊపుతో పార్టీ పదవి తీసుకుని జనాల్లోకి వెళితే ఇంకా కలిసి వస్తుందని కేసీఆర్‌ని కన్విన్స్ చేయడానికి కవిత ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడే ఇంకో సమస్య వచ్చింది. ఇప్పటికే బీఆర్ఎస్ మీద కుటుంబ పార్టీ ముద్ర ఉంది. తండ్రీ కొడుకులు ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారని విమర్శిస్తున్నాయి విపక్షాలు.
నిజానికి కవితపై తెలంగాణ సమాజంలో మొదటి నుంచి చాలా వ్యతిరేకత ఉంది. ప్రత్యక్ష ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయిన తర్వాత కవిత ఒత్తిడితో మళ్లీ ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు కేసీఆర్. అప్పుడే ఆమెపై చాలా వ్యతిరేకత వచ్చింది. కానీ కూతురు మీద ప్రేమతో కెసిఆర్ అవేమీ లెక్క చేయలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత బాగోతం కెసిఆర్, బి ఆర్ ఎస్ ప్రతిష్టను పూర్తిగా దిగజార్చింది. కవిత అరెస్టు వల్లే బి ఆర్ఎస్ మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక దారుణంగా ఓడిపోయింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నుంచి జైలు నుంచి బయటకు వచ్చాక కవితని ఎక్కువగా జనంలోకి రావద్దని కెసిఆర్ ఆదేశించా డు. కానీ అవేమీ వినకుండా రెండు నెలలకి ప్రజాక్షేత్రంలోకి వచ్చేసారు కవిత. ఇప్పుడు ఏకంగా బీసీ నినాదం ఎత్తుకొని రోజుకో కార్యక్రమం చేస్తున్నారు. అసలు కవిత ఏం చేస్తున్నారో పార్టీ హై కమాండ్ కి కూడా తెలియడం లేదు. ఇలా పార్టీకి సమాచారం లేకుండా కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదని ఆమెకు నచ్చ చెప్పాలని కెసిఆర్ చేసిన ప్రయత్నం ఫలించలేదు.
ఏదో ఒక పెద్ద పోస్ట్ ఇస్తే…. అప్పుడు అందరికీ చెప్పి చేస్తానంటూ కవిత ఇచ్చిన సమాధానం ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో అందరినీ ఆలోచనలో పడేసింది. ఇప్పుడు కవితకు పెద్ద పోస్ట్ ఇస్తే…. ఇప్పటికే టిఆర్ఎస్ లో మూడు పవర్ సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు నాలుగో పవర్ సెంటర్ కూడా తయారైపోతుంది. జనంలో రాంగ్ మెసేజ్ వెళుతుంది అని కెసిఆర్ ఆలోచిస్తున్నారట. కవిత మాత్రం ఐ డోంట్ కేర్. నాకు ఏదో ఒక పోస్ట్ ఇస్తారా ఇవ్వరా అని డిమాండ్ చేస్తుంది అట. పార్టీ పుట్టిన నాటి నుంచి…. పార్టీ జీవితం గా బతికే హరీష్ రావుకి ఇప్పటివరకు వరకు పార్టీలో ఒక పెద్ద పోస్ట్ అంటూ ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు కవితలు తీసుకొచ్చి…. సెక్రటరీ జనరల్ వైస్ ప్రెసిడెంట్ ఇలాంటి ఉద్యోగాలు క్రియేట్ చేసి ఇస్తే… ఇప్పటికే అసంతృప్తితో ఆవేదంతో రగిలిపోతున్న హరీష్ రావు ని ఇంకా రెచ్చగొట్టినట్టు అవుతుంది అని కెసిఆర్ ఆలోచిస్తున్నారట. కవిత మాత్రం డాడీ నాకు ఏదో ఒక జాబ్ చూడు కష్టంగా ఉంది అని రోజు విన్నపాలు చేస్తున్నట్లు సమాచారం.