Top story: కవిత ఎక్కడ? జనంలో కనిపించని కెసిఆర్ కూతురు.
స్వయం ప్రకటిత తెలంగాణ బతుకమ్మ.... కెసిఆర్ కూతురు కవితమ్మ కనిపించుటలేదు. వినిపించుటలేదు కూడా. తిహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో గాని... ప్రజా జీవితంలో గాని కవిత కనిపించడం లేదు.
స్వయం ప్రకటిత తెలంగాణ బతుకమ్మ…. కెసిఆర్ కూతురు కవితమ్మ కనిపించుటలేదు. వినిపించుటలేదు కూడా. తిహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో గాని… ప్రజా జీవితంలో గాని కవిత కనిపించడం లేదు. కెసిఆర్ ఆదేశాలు మేరకే కవిత కేవలం ఇంటికే పరిమితం అయ్యారా…? లేక ఉద్దేశపూర్వకంగానే జన జీవితానికి దూరంగా ఉంటున్నారా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఐదు నెలలకు పైగా తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కెసిఆర్ కూతురు కవిత ఈ ఏడాది ఆగస్ట్ 28న బెయిల్ పై విడుదలయ్యారు. అందుకోసం తెరవెనక చాలా కసరత్తు జరిగిందని…. పొలిటికల్ టాక్. జైలు నుంచి బయటకు వచ్చిన రోజు కవిత చేసిన ప్రతిజ్ఞలు… వార్నింగులు… బిగించిన పిడికిలి చూస్తే సగటు బిఆర్ఎస్ కార్యకర్తలు అందరికీ రోమాలు నిక్కబడిచాయి. ఇక తెలంగాణ అంతా అగ్గి పుడుతుందని… రాజకీయ ప్రత్యర్థుల మొత్తం మట్టి కరుస్తారని… కాంగ్రెస్ బిజెపి నేతలని కవితమ్మ వేటాడుతుందని టిఆర్ఎస్ క్యాడర్ మొత్తం ఆశించింది. అయితే జైలు నుంచి విడుదల కాగానే తండ్రి కేసీఆర్ కలిసిన కవితకు బి ఆర్ ఎస్ అధినేత…. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కొంతకాలం పాటు నోరు విప్పొద్దని… అనవసరంగా అతి ప్రేలాపనలు పేలవద్దని గట్టిగా ఘాటుగా చెప్పారు. దీనికి ప్రధాన కారణం కవిత అరెస్టు బి ఆర్ ఎస్ కి ఏ రకంగానూ కలిసి రాలేదు. లోక్సభ ఎన్నికల్లో సానుభూతి వర్కౌట్ కాలేదు. ఒక ఓటు అదనంగా రాలలేదు. అంటే కవితపై , కెసిఆర్ కుటుంబం పై తెలంగాణ సమాజం ఎంత ఆగ్రహంగా ఉందో లోక్సభ ఎన్నికల్లో లో బయటపడింది. కోర్టుకి వెళ్ళినప్పుడల్లా కవిత ఇచ్చిన నినాదాలు…. బిగించిన పిడికిళ్ళు ఎన్నికల్లో వర్కౌట్ కాలేదు. అంతేకాదు కెసిఆర్ కుటుంబం తమ అవినీతికి ప్రతిసారి తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ట్యాగ్ లైన్ గా వాడుతుంది అనే విషయాన్ని జనం గుర్తించారు. ఈ విషయాని కేసీఆర్ కూడా గుర్తించారు. తాము చేసిన ప్రతి పనికిమాలిన పనికి తెలంగాణ నినాదాన్ని తగిలిస్తే జనం సహించరనే విషయాన్ని బాగా అవగాహన చేసుకున్నారు.
అందుకే కవితను నోరు మూసుకొని కొనాలి ఇంట్లోనే ఉండాలని కరాకండిగా చెప్పేశారు. తన దగ్గర కూడా రావద్దంటూ, తనని కలవద్దంటూ నిర్మొహమాటంగా స్పష్టం చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కెసిఆర్ ను కలిసిన రోజు నుంచి ఈరోజు వరకు ఆయన్ని కలవలేదు కవిత. ఏడాది బతుకమ్మ వేడుకల్లో కూడా ఎక్కడా కవిత కనిపించలేదు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ సోషల్ మీడియా ఎత్తిచూపుతోందనే దేశంతో… దసరా సమయంలో అనారోగ్యంతో హాస్పిటల్లో చేరినట్లు కవిత వీడియోలు రిలీజ్ చేసింది ఆమె అనుచరవర్గం. అలాగే ఇటీవల ప్రభుత్వ కుల గణన ఇంటికి వచ్చినప్పుడు వాళ్లకి దర్శనం ఇచ్చింది కవిత. ఈ రెండు సందర్భాల్లో మినహాయించి మూడు నెలల్లో ఎక్కడా కవిత కనబడలేదు. బిఆర్ఎస్ తరఫున అన్ని వ్యవహారాల్లో కేటీఆర్ ముందుండి మాట్లాడుతున్నారు. తన ఉనికి నిలబెట్టుకోవడానికి హరీష్ రావు కూడా ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూనే ఉన్నారు. కానీ కవిత మాత్రం ఎక్కడ కనిపించడం లేదు .వినిపించడం లేదు.
కవిత జనంలోకొస్తే పార్టీకే నష్టమని, ఆమె అవినీతి బాగోతం పై జనం మళ్ళీ మళ్ళీ చర్చించుకుంటారని, మిగిలిన పార్టీలకు అనవసరంగా లేనిపోని భూతం ఇచ్చినట్లు అవుతుందని ముందుగా గుర్తించే కెసిఆర్ కవితని పూర్తిగా ఇంటికి పరిమితం అవ్వాలని చెప్పారు. అన్ని కవిత తూచా తప్పకుండా పాటిస్తోంది. టిఆర్ఎస్ నేతల ఇళ్లల్లో జరిగే పెళ్లి ,పేరంటాలకు కూడా కవిత హాజరు కావడం లేదు. మరోవైపు ఫార్ములా ఈ రేస్ నిధులు దుర్వినియోగం కేసులో కేటీఆర్ రేపు మాకు అరెస్టు అయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కవిత ఎక్కడ నోరు విప్పడం లేదు. మీడియాకి కనిపించడం లేదు. ఎంత తక్కువ మాట్లాడితే, ఎంత తక్కువ కనిపిస్తే తనకు అంత మేలు అని కవిత గుర్తించినట్లు ఉంది. కేటీఆర్ అరెస్టు దాదాపు ఖాయమని ఇప్పటికే అందరికీ తెలిసింది. ఇలాంటి సమయంలో గొంతు విప్పాల్సిన పరిస్థితుల్లో కూడా కవిత ఎక్కడ మాట్లాడ్డం లేదు. దీనికి ప్రధాన కారణం తానే మాట్లాడిన జనం నమ్మరు. అంతేకాదు లోపాయికారిగా జరిగిన ఒప్పందాలు ప్రకారం కవిత నోరు విప్పకూడదు కూడా. అందుకే కెసిఆర్ కుమార్తె ప్రజలకు కనిపించడం లేదు .వినిపించడం లేదు. కానీ కవిత అతను చూసుకొని జనంలోకి ఉరుకుతారని…. సమయం కోసం వేచి చూస్తున్నారు అని… ఆమె చుట్టూ ఉండేవాళ్లు చెబుతున్నారు. కవిత రాక కోసం…. చేయబోయే రాజకీయ విన్యాసాల కోసం తెలంగాణ ప్రజానీకం కొన్నాళ్ళు ఇంకా వేచి చూడాల్సిందే.