KCR: కేసీఆర్ తగ్గేదేలే ! కాంగ్రెస్ సర్కార్‌పై పోరాటానికి కేసీఆర్ రెడీ !

బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ నేతను ఎన్నుకునేందుకు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం అవుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరుగుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 8, 2023 | 07:40 PMLast Updated on: Dec 08, 2023 | 7:40 PM

Kcr As Brs Lp Leader Party Will Decide Saturday

KCR: కాంగ్రెస్ సర్కార్‌తో పోరాటానికి తగ్గేదేలే అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆరే ఉండాలని డిసైడ్ అయినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్‌పై కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న ఆలోచనలో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. అందుకే బలమైన ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ సర్కార్‌ను ఎదుర్కొంటూనే.. జాతీయ రాజకీయాలపైనా దృష్టి పెట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ నేతను ఎన్నుకునేందుకు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం అవుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరుగుతోంది.

REVANTH REDDY: ఎంపీ పదవికి రేవంత్ రాజీనామా.. స్పీకర్‌కు రాజీనామా పత్రం సమర్పణ..

అయితే ఈ సమావేశంలో పార్టీ శాసన సభా పక్ష నేతగా కేసీఆర్‌ను ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దాంతో అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా కేసీఆ్ వ్యవహరిస్తారు. బీఆర్ఎస్ఎల్పీ లీడర్‌గా KCR కాకుండా.. కేటీఆర్, హరీశ్ రావు లేదా కడియం శ్రీహరిలో ఎవరినో ఒకరిని ఎన్నుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ అసెంబ్లీలో అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోవాలంటే అందుకు కేసీఆరే సమర్థుడని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం కేసీఆర్ కాలి తుంటె విరగడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. రెండు నెలల దాకా బయటకు వచ్చే పరిస్థితి లేదు. అయినప్పటికీ ఆయన్నే తమ నేతగా ఎంపిక చేసుకోవాలని ఎమ్మెల్యేలు నిర్ణయించారట. వచ్చే రెండు నెలల్లోగా.. అసెంబ్లీలో సమావేశాలు జరిగితే.. ఉప నేతగా ఎన్నికయ్యే సీఎల్పీ నేత బాధ్యతలు నిర్వహిస్తారు. అధికారికంగా ప్రతిపక్ష నేతగా మాత్రం కేసీఆరే కొనసాగుతారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నారనీ.. ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తారని టాక్ నడుస్తోంది.

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అపోజిషన్ లీడర్‌గా కేసీఆర్ ఉండటమే బెటర్ అని కొందరు పార్టీ సీనియర్లు కూడా అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల టైమ్ ఉంది. ఒకవేళ జాతీయ రాజకీయాలకు వెళ్ళాలనుకుంటే అప్పుడే ఎమ్మెల్యే పదవికి, ప్రతిపక్షనేత పదవికి రిజైన్ చేయొచ్చు. కానీ అప్పటిదాకా కేసీఆరే కంటిన్యూ అవడం బెటర్ అని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.