AIG హాస్పిటల్‌లో కేసీఆర్‌

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గచ్చిబౌలి AIG ఆస్పత్రికి వెళ్లారు. ఫామ్‌హౌజ్ నుంచి హుటాహుటిన కేసీఆర్ ఆస్పత్రికి చేరుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 11, 2025 | 09:07 PMLast Updated on: Apr 12, 2025 | 10:08 AM

Kcr At Aig Hospital

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గచ్చిబౌలి AIG ఆస్పత్రికి వెళ్లారు. ఫామ్‌హౌజ్ నుంచి హుటాహుటిన కేసీఆర్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఒక్కసారిగా ఆయన హాస్పిటల్‌లో కనిపించడంతో బీఆర్ఎస్‌ కార్యకర్తలు కేసీఆర్‌ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే కేసీఆర్‌ రెగ్యులర్‌ హెల్త్‌ చెకప్‌ కోసమే హాస్పిటల్‌కు వచ్చారంటూ బీఆర్ఎస్‌ ప్రకటించింది. AIG డాక్టర్లు ఆయనకు పలు రకాల హెల్త్ టెస్టులు చేశారు. టెస్ట్ రిపోర్టులు వచ్చాక కేసీఆర్ కండీషన్‌పై వైద్యులు క్లారిటీ ఇవ్వనున్నారు. మరో 17 రోజుల్లో బీఆర్ఎస్ ఏప్రిల్ 27న ఛలో వరంగల్ సభ నిర్వహిస్తోంది. ఆరోగ్యం పరంగా కేసీఆర్‌ బహిరంగ సభకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి 25ఏళ్లు కావస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు జరుపుతున్నారు. 20 లక్షల మందితో వరంగల్ ఎల్కతుర్తిలో సభ ఏర్పాటు చేస్తున్నారు. ఆ సభకు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు.