KCR DEFEAT: 40 ఏళ్ల తర్వాత ఓటమి.. జీర్ణించుకోలేకపోతున్న కేసీఆర్‌..

తన నాలుగు దశాబ్దాల పొలిటికల్‌ జర్నీలో ఒకే సారి ఓటమిని చవిచూసిన ఆ మహానేతకు.. ఇప్పుడు మరో మారు షాక్‌ తగిలింది. ఎన్టీఆర్‌ పిలుపు మేరకు 1983లో టీడీపీ తరపున కేసీఆర్‌ పోటీచేసి తన రాజకీయ గురువైన మదన్‌మోహన్‌ చేతిలో కేవలం 879 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 4, 2023 | 03:01 PMLast Updated on: Dec 04, 2023 | 3:01 PM

Kcr Cant Digest His Defeat In Kamareddy

KCR DEFEAT: కేసీఆర్‌.. ఉద్యమకారుడిగా రగిలిపోయాడు.. రాష్ట్ర నాయకుడుగా వెలిగి పోయాడు. దేశ్‌ కా నేతగా మారే లక్ష్యంలోనే ఓటమిని చవి చూశాడు. ఇదంతా ఢిల్లీ నుంచి గల్లీ దాకా పేరు తెలిసిన నాయకుడు కేసీఆర్‌ గురించి. 1985 నుంచి అప్రతిహత విజయాలు ఎన్నో సొంతం చేసుకున్నారు ఆయన. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా, ఐదు సార్లు ఎంపీగా గెలుపొందడం అంటే ఆషామాషి విషయం కాదు. 2001 నుంచి 2014 వరకు రాష్ట్ర సాధన కోసం కృషి చేశారు. స్వరాష్ట్రంలో సీఎంగా అభివృద్ధి, సంక్షేమ పాలన చేస్తూ రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచారు.

Chhattisgarh: 7సార్లు ఎమ్మెల్యేను ఓడించిన కూలీ.. బీజేపీ వ్యూహానికి ఫిదా అంటున్న జనాలు..

తన నాలుగు దశాబ్దాల పొలిటికల్‌ జర్నీలో ఒకే సారి ఓటమిని చవిచూసిన ఆ మహానేతకు.. ఇప్పుడు మరో మారు షాక్‌ తగిలింది. ఎన్టీఆర్‌ పిలుపు మేరకు 1983లో టీడీపీ తరపున కేసీఆర్‌ పోటీచేసి తన రాజకీయ గురువైన మదన్‌మోహన్‌ చేతిలో కేవలం 879 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత మధ్యంతర ఎన్నికల్లో 1985లో తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి మహేందర్‌రెడ్డిపై తొలిసారి విజయం సాధించారు. అప్పటి నుంచి కేసీఆర్‌ ప్రస్థానం ఆరంభమైంది. ఆ తర్వాత ఆయనకు ఓటమి అంటే తెలియదు. ఎక్కడ పోటీచేసినా విజయలక్ష్మి వరించింది. 1985లో టీడీపీ తరపున 16వేల 156 ఓట్ల మెజార్టీ, 1989లో 13వేల 816 ఓట్ల మెజార్టీ, 1994లో 27వేల 107 ఓట్ల మెజార్టీ, 1999లో 27వేల 555 ఓట్ల మెజార్టీతో టీడీపీ తరపున కేసీఆర్‌ వరుసగా గెలుపొందారు.

2001లో టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో సిద్దిపేట నుంచి 58వేల 712 ఓట్ల మెజార్టీతో కేసీఆర్‌ గెలుపొందారు. మొత్తం మీద 8సార్లు ఎమ్మెల్యేగా, 5సార్లు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అలా తన పొలిటికల్‌ జర్నీని కొనసాగించిన కేసీఆర్‌.. 40ఏళ్ల తర్వాత ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌, కామారెడ్డి నుంచి పోటీ చేశారు. అయితే.. గజ్వేల్‌లో గలిచిన కేసీఆర్‌.. కామారెడ్డిలో మాత్రం ఓటమి పాలయ్యారు.