BRS VASTU: బీఆర్ఎస్ ఓడింది అందుకేనా..? వాస్తు మార్పుతో ఇక తిరుగులేదా..!
పూజలు, వాస్తును గట్టిగా నమ్మే కేసీఆర్ కు.. తెలంగాణ భవన్ లో వాస్తు దోషం ఉన్నట్టు పండితులు చెప్పారు. BRS ఓటమి, ఎదురుదెబ్బల వెనుక వాస్తు దోషమే కారణమని కేసీఆర్ నమ్ముతున్నారు. తెలంగాణ భవన్ లో వాస్తు దోషం వల్లే పార్టీ పతనమైందని భావిస్తున్నారు.
BRS VASTU: తెలంగాణలో పదేళ్ళ పాటు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పతనం అంచున ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, ప్రాజెక్టుల్లో అక్రమాలపై విచారణ, కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఇలా ఒక్కోటి ఆ పార్టీ నేతలను చుట్టుముడుతున్నాయి. లోక్ సభ ఎన్నికల ముందు BRS లీడర్లు వలసపోతుండటంతో KCR మరింత కుదేలవుతున్నారు. ఈ అనర్థాలకు కారణమేంటని ఆలోచించారు.
GOLD PRICES: పసిడి పరుగు.. మిడిల్ క్లాస్‌కు బంగారం ఇక కలేనా..?
పూజలు, వాస్తును గట్టిగా నమ్మే కేసీఆర్ కు.. తెలంగాణ భవన్ లో వాస్తు దోషం ఉన్నట్టు పండితులు చెప్పారు. BRS ఓటమి, ఎదురుదెబ్బల వెనుక వాస్తు దోషమే కారణమని కేసీఆర్ నమ్ముతున్నారు. తెలంగాణ భవన్ లో వాస్తు దోషం వల్లే పార్టీ పతనమైందని భావిస్తున్నారు. అందుకే భవన్ కు మార్పులు, చేర్పులు చేయిస్తున్నారు. తెలంగాణ భవన్ తూర్పు వైపునకు తిరిగి ఉంటుంది. దాంతో వాయువ్య దిశలో ఉన్న గేటు నుంచి ప్రస్తుతం రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇలా వాయువ్య దిశలో నడవడం వల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయని పండితులు సూచించారు. దాంతో భవన్ కి ఎంట్రీ, ఎగ్జిట్స్ గేట్లు మార్చాలని నిర్ణయించారు. ఇకపై ఈశాన్యం వైపు నుంచి రాకపోకలు సాగించాలని డిసైడ్ చేశారు. అందుకే అక్కడ గేటును రెడీ చేయిస్తున్నారు గులాబీ బాస్ కేసీఆర్. వాహనాల రాకపోకల కోసం ర్యాంప్ నిర్మిస్తున్నారు. వీథి పోటు రాకుండా నర్సింహస్వామి ఫోటోతో ఫ్లెక్సీ కూడా గేటుకు ఏర్పాటు చేశారు.
ఈశాన్యం వైపు గేటు మార్చడం వల్ల బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ట్రాఫిక్ సమస్య కూడా తీరుతుందని భావిస్తున్నారు పార్టీ నేతలు. గతంలో తెలంగాణ భవన్ లోకి వెళ్ళాలంటే వాయువ్య గేటు దగ్గర కొద్ది సేపు వెహికిల్ నిలిపే ఛాన్స్ ఉండేది కాదు. ఇప్పుడు ఈశాన్యానికి మార్చడం వల్ల కొన్ని వెహికిల్స్ గేటు ముందు నిలిపి ఉంచడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ భవన్ గేట్లతో పాటు బిల్డింగ్ ఆవరణలో, భవన్ లోనూ కొద్దిపాటి వాస్తు మార్పులను కేసీఆర్ చేయిస్తున్నట్టు చెబుతున్నారు. వాస్తు మార్పులతో పార్టీకి మంచి రోజులు వస్తాయని BRS శ్రేణుల ఆశ పడుతున్నాయి.