ASSEMBLY ELECTIONS: నోరు జారింది! జర చూసి మాట్లాడండి! కేసీఆర్, కేటీఆర్ నోట ఓటమి మాట !!
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ఈ అంశాలపైనే ఫోకస్ చేస్తున్నారు. వీటికి తోడు ఓడిపోతే ఇంట్లో కూర్చుంటాం.. మాకేమీ నష్టం లేదు అని కేసీఆర్, కేటీఆర్ నోటి నుంచి తరుచుగా వస్తోంది. ఇప్పటికే నాలుగైదు సభల్లో.. ఇంటర్వ్యూల్లో ఈ తరహా స్టేట్‌మెంట్స్ ఇచ్చారు ఈ ఇద్దరు నేతలు.
ASSEMBLY ELECTIONS: తెలంగాణ సెంటిమెంట్.. ప్రస్తుత పథకాలు.. రాబోయే రోజుల్లో తమ కొత్త పథకాలు.. మంచి పాలన.. ప్రధానంగా ఇలాంటి అంశాలనే BRS చీఫ్ కేసీఆర్ (KCR), వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), హరీష్ రావు (HARISH RAO), కవిత కూడా చెప్పుకుంటూ ఉంటారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ఈ అంశాలపైనే ఫోకస్ చేస్తున్నారు. వీటికి తోడు ఓడిపోతే ఇంట్లో కూర్చుంటాం.. మాకేమీ నష్టం లేదు అని కేసీఆర్, కేటీఆర్ నోటి నుంచి తరుచుగా వస్తోంది. ఇప్పటికే నాలుగైదు సభల్లో.. ఇంటర్వ్యూల్లో ఈ తరహా స్టేట్‌మెంట్స్ ఇచ్చారు ఈ ఇద్దరు నేతలు. దాంతో BRS లీడర్లు, కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు. అయ్యో.. మా లీడర్లు అలా అనకుండా ఉండాల్సింది.. పార్టీకి డ్యామేజీ అయితది.. అని మదనపడుతున్నారు.
Boda Janardhan: కాంగ్రెస్‌కు భారీ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి..
పైగా ఈ స్టేట్‌మెంట్స్‌ని రేవంత్ రెడ్డి తమ పార్టీకి అనుకూలంగా మార్చుకుంటున్నారు. లేటెస్ట్‌గా పొలిటికల్ అనలిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో కేటీఆర్ ఇంటర్వ్యూని BRS పార్టీ రిలీజ్ చేసింది. అందులో రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోంది.. ఇటీవల విడుదలైన నేషనల్ సర్వేలు కూడా అదే చెబుతున్నాయి.. మీ పార్టీకి అనుకూలంగా లేవు అని ప్రశ్న అడిగారు ప్రొ.నాగేశ్వర్. దానికి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు తెలివిగా ఓట్లేయాలి అని చెబుతూనే.. అధికారం శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు ఇంటికి పోవాలని అన్నారు. సరిగ్గా ఇదే పాయింట్‌ను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్.. BRS ఓటమిని ఒప్పుకుందంటూ ట్వీట్ చేసింది. ఒక్క కేటీఆరే కాదు.. పది రోజుల క్రితం సీఎం కేసీఆర్ కూడా ఇలాగే మాట్లాడారు. అచ్చంపేట సభలో కేసీఆర్ నైరాశ్యం ప్రదర్శించారు.
Telangana Politics : గాడిదపై వచ్చి నిరుద్యోగి నామినేషన్.. తరువాత ఏమైందంటే..
ఓడిపోతే ఏమైతది.. ఇంట్లో కూర్చుంటాం. మాకేమన్నా నష్టమా.. అనడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు, లీడర్లు ఆశ్చర్యపోయారు. పెద్దాయన నోట ఆ మాట రాకుండా ఉండాల్సింది అనుకున్నారు. అచ్చంపేట సభ తర్వాత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఈ కామెంట్స్‌ని బాగా క్యాష్ చేసుకున్నారు. కేసీఆర్ ఓటమిని ఒప్పుకున్నారని.. BRSను ఇంటికి పంపాలని ట్విట్టర్ వేదికగా స్పందించారు. తర్వాత ప్రతి సభలోనూ విమర్శలు చేస్తూ వచ్చారు. వరుసగా వెల్లడవుతున్న సర్వేలు కాంగ్రెస్ పుంజుకుంటోందని చెబుతున్నాయి. BRSకు గట్టి పోటీ ఇస్తుందని అంటున్నాయి. పోలింగ్ టైమ్ దగ్గరపడే కొద్దీ.. ఓటర్లు ఎటు టర్న్ అవుతారో తెలియని పరిస్థితి. కొన్ని నియోజకవర్గాల్లో BRS సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. దాన్ని అర్థం చేసుకోకుండా.. మళ్ళీ వాళ్ళకే టిక్కెట్లు ఇచ్చారు కేసీఆర్. ఇప్పుడు ఆ అభ్యర్థులు గ్రామాల్లోకి వెళితే.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, రోడ్లు, దళిత బంధు, బీసీ బంధు, గృహ లక్ష్మి.. ఇలా ప్రభుత్వ పథకాలు రాలేదని బాధితులు ఏకరువు పెడుతున్నారు.
అటు చూస్తే కాంగ్రెస్ ఇప్పటికే ఆరు గ్యారంటీలు ప్రకటించింది. ఇంకా మేనిఫెస్టోలో తాయిలాలు చాలా ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు, మైనార్టీలు, బీసీలకు వరాల ప్రకటించబోతున్నారు. ఇవన్నీచూసి.. KCR, KTRకి ఓటమి భయం పట్టుకుందనీ.. అందుకే ఇలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మాట జారితే వెనక్కి తీసుకోవడం కష్టం. అందుకే ఆచి తూచి మాట్లాడాలి. ఈ సూత్రం పొలిటికల్ లీడర్స్ విషయంలో ఖచ్చితంగా వర్తిస్తుందని BRS పెద్దలు గుర్తుంచుకోవాలి.