KCR: సార్‌ మళ్లీ డుమ్మా.. కేసీఆర్‌ అసెంబ్లీకి ఎందుకు రాలేదంటే..

రీసెంట్‌గా రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్‌ సభకు రావాలంటూ డిమాండ్‌ చేశారు. దీంతో బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజు సభకు రావాలని కేసీఆర్‌ డిసైడయ్యారు. బీఆర్ఎస్‌ నేతలు కూడా కేసీఆర్‌ సభకు వస్తారంటూ చెప్పారు. కానీ చివరి నిమిషంలో కేసీఆర్‌ డుమ్మా కొట్టారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 10, 2024 | 04:55 PMLast Updated on: Feb 10, 2024 | 4:55 PM

Kcr Not Attending Telangana Budget Assembly Session

KCR: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అసెంబ్లీలో తొలిసారిగా బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. 2 లక్షల 75 వేల 891 కోట్లతో ఓట్‌ఆన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క. అయితే ఈ సభలో కాంగ్రెస్‌ ప్రవేశపెట్టే బడ్జెట్ కంటే కేసీఆర్‌ వస్తున్నారన్న ఇంట్రెస్టే ఎక్కువ మందిలో ఉంది. తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తరువాత కేసీఆర్‌ ఒక్కసారి కూడా సభకు రాలేదు. రీసెంట్‌గా రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్‌ సభకు రావాలంటూ డిమాండ్‌ చేశారు.

PAWAN KALYAN: పొత్తులపై తొందరపాటు మాటలొద్దు.. జనసైనికులకు పవన్ సూచన

దీంతో బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజు సభకు రావాలని కేసీఆర్‌ డిసైడయ్యారు. బీఆర్ఎస్‌ నేతలు కూడా కేసీఆర్‌ సభకు వస్తారంటూ చెప్పారు. కానీ చివరి నిమిషంలో కేసీఆర్‌ డుమ్మా కొట్టారు. అసెంబ్లీకి హాజరు కాలేదు. దీంతో ప్రతిపక్ష నేత లేకుండానే బడ్జెట్‌ ప్రపేశపెట్టారు కాంగ్రెస్‌ మంత్రులు. కేసీఆర్‌ అసెంబ్లీకి మొహం చాటేయడంపై సెటైర్లు వేస్తున్నారు. ఓటమితో కాంగ్రెస్‌ నేతలకు కేసీఆర్‌ మొహం చూపించలేకపోతున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయిన తరువాత ఇప్పటి వరకూ అసెంబ్లీకి రాలేదు కేసీఆర్‌. కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే ఆయన ప్రమాదానికి గురయ్యారు. తరువాత హిప్‌ రీప్లేస్‌మెంట్‌ ఆపరేషన్‌ జరగడంతో దాదాపు నెల రోజులు బెడ్‌కే పరిమితమయ్యారు. రీసెంట్‌గానే కాస్త కోలుకుని ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు కూడా అసెంబ్లీకి రాలేదు. స్పీకర్‌ ఛాంబర్‌లో స్పీకర్‌ ముందు ప్రమాణం చేశారు. దీంతో ఇప్పటి నుంచి కేసీఆర్‌ ఇక వరుసగా సభకు హాజరవుతారని అంతా అనుకున్నారు. కానీ బడ్జెట్‌ సెషన్‌ ప్రారంభమై రెండు రోజులు గడుస్తున్నా.. కేసీఆర్‌ మాత్రం సభకు రాలేదు.

JANASENA: జనసేన బలం ఎక్కడ ? ఏం చూసుకొని పవన్ సీట్లు అడుగుతున్నట్టు ?

సభకు రావాలంటూ రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరినప్పటికీ.. బడ్జెట్‌ సెషన్‌కు హాజరు కాలేదు. మరోపక్క కేసీఆర్‌ వస్తే ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై ప్రశ్నల వర్షం కురిపించేందుకు కాంగ్రెస్‌ మంత్రులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే నీళ్ల విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య చిన్నపాటి యుద్ధం జరుగుతోంది. ఇలాంటి సిచ్యువేషన్‌లో అసెంబ్లీకి వెళ్లడం మంచిది కాదు అనుకున్నారో.. లేక మరే కారణం ఉందో తెలియదు కానీ.. కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేస్తున్నా కూడా కేసీఆర్‌ మాత్రం సభకు రావడంలేదు. వాళ్ల విమర్శకు రెస్పాండ్‌ కూడా అవ్వడంలేదు. ఇదిలా ఉండగానే ప్రతిపక్ష నేత లేకుండానే అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు భట్టి విక్రమార్క. ఈ నెల 12న బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చ జరగబోతోంది. మరి ఆ సభకైనా కేసీఆర్‌ వస్తారా లేదా చూడాలి.