KCR: ఆ బుక్‌లో ఏముంది.. ఓటమి తరువాత కేసీఆర్ చదువుతున్న బుక్ ఇదే
కేసీఆర్.. ఓ పుస్తకాల పురుగు. ఈ విషయం చాలాసార్లు ఆయనే స్వయంగా చెప్పారు. ఇప్పటి వరకూ దాదాపు 80 వేల పుస్తకాలు చదివాను అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు 80 వేల ఒకటో పుస్తకం పట్టుకున్నారు. తన తప్పులను సరిదిద్దుకుని మళ్లీ సరికొత్తగా సిద్ధం అవుతున్నారు.
KCR: తెలంగాణ (telangana) మాజీ సీఎం కేసీఆర్ (KCR) పేరు చెప్తే మొదట గుర్తొచ్చేది ఉద్యమం, సుదీర్ఘ రాజకీయ అనుభవం. తెలంగాణ మీద పూర్తి స్థాయి పట్టున్న ఏకైక ఈ తరం నాయకుడు కేసీఆర్. తప్పులు చేయడం మానవ సహజం అన్నట్టు.. ఇంతటి రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ కూడా తన పొలిటికల్ జర్నీలో కొన్ని తప్పులు చేశారు. ఇప్పుడు ఆ తప్పులను తెలుసుకునే పనిలో పడ్డారు అనిపిస్తోంది. రాజకీయంగా తనను తాను ఎన్‌లైట్ చేసుకునే పుస్తకాలు చదువుతున్నారు.
JANASENA: వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. జనసేనలోకి మరో సిట్టింగ్ ఎంపీ జంప్!
కేసీఆర్.. ఓ పుస్తకాల పురుగు. ఈ విషయం చాలాసార్లు ఆయనే స్వయంగా చెప్పారు. ఇప్పటి వరకూ దాదాపు 80 వేల పుస్తకాలు చదివాను అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు 80 వేల ఒకటో పుస్తకం పట్టుకున్నారు. తన తప్పులను సరిదిద్దుకుని మళ్లీ సరికొత్తగా సిద్ధం అవుతున్నారు. ఇంటర్నెట్‌లో కేసీఆర్ అభిమానులు ఈ బుక్‌ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. కేసీఆర్ లాంటి వ్యక్తికే రాజకీయ పాఠాలు నేర్పే ఆ బుక్ ఏంటి..? అందులో ఏముంది..? ఆ బుక్ రాసింది ఎవరు..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఆ బుక్కే “21 ఇర్రిఫ్యూటబుల్ లాస్ ఆఫ్ లీడర్‌షిప్”. 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఓ వ్యక్తి తన అనుభవాన్ని రంగరించి ఓ పుస్తకం రాస్తే ఎలా ఉంటుందో ఈ బుక్ కూడా అలానే ఉంటుంది. రాజకీయాల్లో షైన్ అవ్వాలంటే ఎలాంటి పనులు చేయాలి. ఎలాంటి పనులు చేస్తే ప్రజలకు దగ్గరవ్వొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ఇదే ఈ బుక్ సారాశం. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ప్రఖ్యాత రచయిత “జాన్ సీ మ్యాక్స్‌వెల్” రాసిన ఈ బుక్‌కు మిలియన్స్‌లో సేల్స్ ఉన్నాయి. ఇప్పుడు అదే బుక్ చదువుతున్నారు కేసీఆర్. అయితే ఈ బుక్ ఒకటే బీఆర్‌ఎస్‌ను మళ్లీ అధికారంలోకి తెస్తుందా అంటూ కేసీఆర్ వ్యతిరేకులు కామెంట్లు పెడుతున్నారు.
వీళ్ల మాటల యుద్ధం సంగతి కాసేపు పక్కన పెడితే.. తన జీవితంలో 80 వేల బుక్స్ చదివిన కేసీఆర్‌కు ఈ బుక్ ఇప్పటి వరకూ కనిపించలేదా. ఒకవేళ కనిపించినా ఈ బుక్‌తో అవసరం పడుతుంది అని గుర్తించలేదా..? నిజానికి కేసీఆర్ ఓడిపోడానికి కారణం ఏంటో ఇంటర్ చదివే పిల్లలు కూడా చెప్తారు. బీఆర్‌ఎస్ ఓడిపోడానికి కారణం ఏంటి అనేది ఒక్క బీఆర్‌ఎస్ అగ్ర నేతలకు తప్ప అందరికీ చాలా క్లియర్‌గా అర్థమైంది. విషయం క్లియర్‌గా తెలిసాక దాన్ని సెట్ చేసుకోవాలి. కానీ ఇలాంటి బుక్స్‌తో పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పరిణామాలు ప్రతీ రోజూ మారిపోతుంటాయి. అలాంటి వాటిని ఇలాంటి ప్రింటెడ్ స్ట్రాటజీతో ఫేస్ చేయాలి అనుకోవడం కరెక్టా కాదా అనేది కేసీఆరే తేల్చుకోవాలి.