KCR: సిటీలో నాకు ఓ ఇల్లు కావాలి.. వెతికి పెట్టండి అంటూ కేసీఆర్‌ రిక్వెస్ట్..

కేసీఆర్ ప్రగతిభవన్‌ వీడి ఫామ్ హౌస్‌కు వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు హైదరాబాద్‌లో ఉండాలంటే ఆయనకు పెద్ద ఇల్లు అవసరం. ఆరోగ్యరీత్యా సిటీలో అందరికీ అందుబాటులో ఉండటానికి ఓ పెద్ద ఇల్లు అద్దెకు తీసుకోవాలి అనుకుంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 15, 2023 | 04:09 PMLast Updated on: Dec 15, 2023 | 4:09 PM

Kcr Searching For A Home In Banjarahills Or Jubileehilss

KCR: ఓటమి తర్వాత నిమిషాల్లో ప్రగతిభవన్ ఖాళీ చేసి తిన్నగా ఫామ్ హౌస్‌కి వెళ్లిపోయారు కేసీఆర్. ఇప్పుడు సిటీలో ఉండడానికి ఇల్లు వెతుక్కుంటున్నారు. తెలంగాణలో గడిచిన పదేళ్లు రారాజులా బతికిన కేసీఆర్‌కు.. హైదరాబాదులో ఇల్లు లేదా అని ఆశ్చర్యపోకండి. ఎమ్మెల్యేగా ఉన్న రోజుల నుంచి బంజారాహిల్స్‌లోని నంది నగర్‌లో తన సొంత ఇంట్లో కేసీఆర్‌ ఉండేవారు. 2014లో ముఖ్యమంత్రి అయ్యాక ప్రగతిభవన్‌లో రాజభవనం లాంటి ఇల్లు కట్టుకున్నారు.

RAJINI SAI CHAND: ఫొటో తీసేసి అవమానిస్తారా.. సాయిచంద్ భార్య కన్నీళ్లు

దానిలోనే చివరి నిమిషం వరకు ఉంటానని అనుకున్నారు. ఐతే రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. దారుణంగా ఓడిపోయారు కేసీఆర్. ప్రగతిభవన్‌ వీడి ఫామ్ హౌస్‌కు వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు హైదరాబాద్‌లో ఉండాలంటే ఆయనకు పెద్ద ఇల్లు అవసరం. ఆరోగ్యరీత్యా సిటీలో అందరికీ అందుబాటులో ఉండటానికి ఓ పెద్ద ఇల్లు అద్దెకు తీసుకోవాలి అనుకుంటున్నారు. ఇల్లు వెతికే బాధ్యత ఒకరిద్దరు ఎంపీలకు అప్పచెప్పారు. కనీసం 20 కార్లు పట్టేటట్లుగా.. విశాలమైన లాన్, మొదలైన సౌకర్యాలతో జూబ్లీహిల్స్ లేదా బంజారాహిల్స్‌లో ఇల్లు కావాలని కోరుతున్నారు కేసీఆర్. ఆయన కుటుంబ సభ్యులైన కేటీఆర్, కవిత, సంతోష్ రావు, హరీష్ రావు వీళ్లంతా గడచిన 10 ఏళ్లలో ఎవరికి వాళ్లు సొంత ఇండ్లు కొనుక్కున్నారు. కేటీఆర్ రాయదుర్గంలో ఒక ప్రైవేట్ విల్లాలో ఉంటున్నారు. కవిత బంజారాహిల్స్‌లో 6వేల గజాల స్థలం కొనుక్కొని ఒక మంచి ప్యాలెస్ కట్టుకున్నారు.

YS JAGAN: వైసీపీకి దూరమవుతున్న రెడ్లు.. బీసీ ఓట్ బ్యాంక్‌పై జగన్ నజర్..

సంతోష్ రావు కూడా జూబ్లీహిల్స్‌లో మంచి ఇల్లు కొనుక్కున్నారు. హరీష్ రావు కోకాపేట దగ్గరలోని విల్లాలో ఉంటున్నారు. దామోదర్ రావులాంటి వాళ్లు కూడా బంజారాహిల్స్‌లో అర ఎకరంలో ఇల్లు కట్టుకున్నారు. ఎవరికి వాళ్లు బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే వ్యాపారాలు, సొంతిల్లు చక్కబెట్టుకున్నారు. కేసీఆర్‌ అనుచరులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో పాటు ఓఆర్ఆర్ చుట్టుపక్కల బ్రహ్మాండమైన విల్లాలు సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. కేసీఆర్‌కి కేవలం బంజారాహిల్స్ నందినగర్‌లోని పాత ఇల్లు మాత్రమే మిగిలింది. అందుకే ఒక సొంత పెద్ద ఇల్లు కొనడం కానీ.. అద్దెకు తీసుకోవడం కానీ చేయాలని కెసిఆర్ యోచిస్తున్నారు. శాశ్వతంగా ఫామ్‌హౌస్‌లో ఉండిపోతే జనాలకు పూర్తిగా దూరమైపోతానని.. అలాగే ఆరోగ్యరీత్యా హాస్పిటల్‌కి తిరగాలన్నా కూడా ఇబ్బందేనని కెసిఆర్ గ్రహించారు. సీఎంగా ఉన్నప్పుడు అంటే ఎలాగైనా నడిచిపోయేది.

ఇప్పుడు అన్నీ సాధ్యం కాదు కదా. మొన్న ఫామ్‌హౌస్ ఇంట్లో పడిపోతే సిటీకి తీసుకురావడానికి రెండు గంటల పైనే పట్టింది. అదే సిటీలో ఉంటే అందరికీ అందుబాటులో ఉండొచ్చు. అవసరాలకు ఎక్కడికైనా వెళ్లొచ్చు. అందుకే ఒక పెద్ద ఇల్లు అద్దెకు తీసుకునే పనిలో ఉన్నారు కేసీఆర్‌.