నా ఇంటికి రాకు… నాతో మాట్లాడకు… కవితకు కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
తీహార్ జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన కవిత ఎక్కడ నోరు విప్పకుండా గుట్టుగా ఉంటున్నారు. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని బెయిల్ వచ్చిన రోజు తీహార్ జైలు గేటు దగ్గర ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చిన కవిత ఆ తర్వాత మాత్రం కిమ్మనకుండా అన్ని మూసుకొని ఇంట్లో కూర్చున్నారు.
తీహార్ జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన కవిత ఎక్కడ నోరు విప్పకుండా గుట్టుగా ఉంటున్నారు. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని బెయిల్ వచ్చిన రోజు తీహార్ జైలు గేటు దగ్గర ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చిన కవిత ఆ తర్వాత మాత్రం కిమ్మనకుండా అన్ని మూసుకొని ఇంట్లో కూర్చున్నారు.బి ఆర్ ఎస్ లోని అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ఇచ్చిన సమాచారం ప్రకారం, కెసిఆర్ కవితకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారట.మళ్లీ తనని కలవడానికి రావద్దని, తనతో మాట్లాడొద్దని కెసిఆర్ తన కూతురికి కరాకండిగా చెప్పేశారట. అంతేకాదు ఇంట్లోంచి బయటకు వచ్చి అతివాగుడు బాగోదని కూడా కెసిఆర్ కవితకు తగేసి చెప్పాడట.
కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా సిబిఐ ,ఈడి కేసులు ఎదుర్కొంటున్న నాటినుంచి ,కెసిఆర్ రాజకీయంగా అడ్డంగా ఇరుక్కుపోయారు. కవిత చేసిన పనికి బిజెపి వాకిట ముందు కేసీఆర్ మోకాలు వేయాల్సి వచ్చింది. బిజెపి తన ఎమ్మెల్యేలను కొంటుందని స్టింగ్ ఆపరేషన్ చేసి మరి బి ఎల్ సంతోష్ తో పాటు పలువురిపై కేసులు పెట్టే అంత సాహసం చేసిన కెసిఆర్…. కవిత ఎపిసోడ్ తర్వాత నోటికి కుట్లు వేసుకొని కూర్చోవలసి వచ్చింది. కవితను సిపిఐ కానీ ఈడీ కానీ లిక్కర్ స్కామ్ లో మొదట అరెస్టు చేయకపోవడంతో, బిజెపి బి ఆర్ ఎస్ మధ్య రహస్య సంబంధం ఉందని అందుకే కవితను అరెస్టు చేయడం లేదని విస్తృత ప్రచారం జరిగింది. ఆ దెబ్బకి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్ ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికలకు ముందు ఈడి కవితను అరెస్ట్ చేసి ఢిల్లీ తరలించింది. కానీ కవిత అరెస్టు వలన లోక్సభ ఎన్నికల్లోనూ బి ఆర్ ఎస్ కు, కెసిఆర్ కు సానుభూతి రాలేదు సరి కదా, దారుణ ఓటమి ఎదురైంది. ఇదంతా కవిత పుణ్యమే నని అని పార్టీలోనూ, బయట జనం బలంగా నమ్మారు. పైకి మా కూతురు నిర్దోషి, కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది అని కేసీఆర్ చాలాచోట్ల చెప్పుకున్నా…. ఆయనకు జరిగిందేంటో తెలుసు. కన్న కూతుర్ని జనం ముందు తిట్టుకోలేడు కనుక…. కడిగిన ముత్యం ,కడిగిన ముత్యం అని ఒకటికి పది సార్లు చెప్పుకున్నాడు. కవిత అరెస్టు తర్వాత కెసిఆర్ మళ్లీ ఎన్నడు బిజెపిని గాని, మోడీని గాని పన్నెత్తు మాట అనలేదు. అలాంటి సాహసం ఎక్కడా చేయలేదు.
బిజెపి అధిష్టానానికి మధ్యవర్తుల ద్వారా రకరకాల సమాచారాలు పంపించాడు. ఎన్ని రకాలుగా ప్రాధేయ పడాలో అన్ని రకాలుగా కేసీఆర్ మోడీ , అమిత్షాలను ప్రాదేయ పడ్డారు. ఏం కావాలన్నా ఇస్తాను తన కూతుర్ని… వదిలి పెట్టాలన్నారు. తన వ్యవహార శైలికి భిన్నంగా… ఎన్నో రాజీ ప్రతిపాదనలను బిజెపికి పంపారు. ఈ లొంగుబాటు కారణం తన కూతురు కవితేనని , ఆమె లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోకుండా ఉండుంటే తనకి రాజకీయంగా ఇన్ని సమస్యలు వచ్చేవే కాదని, ఇంత దారుణ ఓటమిని చూసేవాడిని కాదని కెసిఆర్ అభిప్రాయానికి వచ్చాడు. కవిత ఈ డి, సి బి ఐ కేసులో అరెస్టై ఐదున్నర నెలలు ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న, ఒక్కసారి కూడా కెసిఆర్ ఢిల్లీ వెళ్లి కూతుర్ని చూడలేదు. జైల్లో ఉన్న సమయంలో ఆరోగ్యం బాగోక కవిత హాస్పిటల్ లో ఉన్న సమయంలో కూడా కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఆమెను చూడలేదు . ఆ విషయంలో కవిత చాలా బాధపడి, కేటీఆర్ దగ్గర ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ కెసిఆర్ తన పట్టు వీడలేదు. ఢిల్లీ వెళ్లి కవితను చూడలేదు. మొత్తం మీద అంతర్గతంగా మారిన పరిణామాలతో… కవిత తీహార్ నుంచి బయటపడింది. అదేదో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలు నుంచి వచ్చినట్లు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆమెకు భారీ స్వాగతమే లభించింది. నేరుగా కెసిఆర్ దగ్గరికి వెళ్లి… తండ్రి ఆశీస్సులు తీసుకుంది కవిత. ఆ రోజే కెసిఆర్ కి మధ్య భారీ వాగ్వాదమే నడిచింది. కవిత వల్లే… ఆమె అత్యాశ వల్లే ఇదంతా జరిగిందని, తాను రాజకీయంగా పతనమయ్యా నని, చివరికి రేవంత్ రెడ్డి లాంటి వాడి చేతిలో ఓడిపోయి నిత్యం మాటలు పడుతున్నానని ఆగ్రహం వ్యక్తం చేసేటట్టు కేసీఆర్. మళ్లీ తన దగ్గరికి రా వద్దని, తనతో మాట్లాడవద్దని స్పష్టంగా చెప్పేశాడు బి ఆర్ ఎస్ అధినేత. అంతే ఆ రోజు నుంచి మళ్లీ కవిత కేసిఆర్ ని కలవలేదు. కెసిఆర్ ఆదేశాల మేరకు బంజారాహిల్స్ లోని తన ఇల్లు వీడి బయటకు రాలేదు. ఎక్కడ ప్రెస్ మీట్ లు పెట్టలేదు. అతి మాటలు మాట్లాడలేదు. బిజెపిని కూడా ఒక్క మాట అనలేదు. కవితపై కేసీఆర్ కోపం తగ్గేవరకు ఆమెకు ఈ మౌనవ్రతం తప్పదు. ఇప్పుడు బయటకు వచ్చి ఎవరిని ఏం విమర్శించిన అవతలి వాళ్ళు తిట్టే తిట్లకు, మళ్లీ ఇంట్లోంచి బయటికి రాలేదు కవిత. అందుకే కెసిఆర్ సూచన మేరకు కొన్నాళ్లు మౌనంగానే ఉండాలని డిసైడ్ అయింది ఆమె.