KCR Target 100: 100 సీట్లు కొట్టేంత సీన్ ఉందా..? కేసీఆర్‌కు ఎందుకంత ధీమా..?

ఈసారి బీఆర్ఎస్ కు సీట్లు తగ్గుతాయని, ఆ పార్టీ ప్రభావం తగ్గిందనే ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్ లు బలపడ్డాయని.. వాటికి సీట్లు పెరుగుతాయని భావించారు. విపక్షాలకు సీట్లు పెరుగుతున్నాయంటే అధికార పార్టీకి తగ్గుతున్నట్టే లెక్క. కానీ కేసీఆర్ మాత్రం గతంలో వచ్చిన సీట్ల కంటే ఈసారి ఎక్కువ వస్తాయని, పైగా సెంచురీ కొడ్తామని ధీమాగా చెప్తున్నారు. ఇంతకూ ఏంటి ఆయన ధీమా..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 28, 2023 | 12:53 PMLast Updated on: Apr 28, 2023 | 12:59 PM

Kcr Target 100 Seats Why He Is So Confident

ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్.. వందమందిని ఒకేసారి రమ్మను.. అనేది సినిమా డైలాగ్. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూడా ఈ డైలాగ్ బాగా నచ్చినట్టుంది. వచ్చే ఎన్నికల్లో వందకు ఒక్కటి కూడా తక్కువ కాకుండా సాధిస్తామని ధీమాగా చెప్తున్నారు. ఈసారి బీఆర్ఎస్ కు సీట్లు తగ్గుతాయని, ఆ పార్టీ ప్రభావం తగ్గిందనే ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్ లు బలపడ్డాయని.. వాటికి సీట్లు పెరుగుతాయని భావించారు. విపక్షాలకు సీట్లు పెరుగుతున్నాయంటే అధికార పార్టీకి తగ్గుతున్నట్టే లెక్క. కానీ కేసీఆర్ మాత్రం గతంలో వచ్చిన సీట్ల కంటే ఈసారి ఎక్కువ వస్తాయని, పైగా సెంచురీ కొడ్తామని ధీమాగా చెప్తున్నారు. ఇంతకూ ఏంటి ఆయన ధీమా..?

తెలంగాణలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లో పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే కేసీఆర్ మాత్రం మూణ్ణెల్ల మందుగానే ఎన్నికలు జరగొచ్చని చెప్తున్నారు. తమన దెబ్బకొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ముందస్తు ఎన్నికలకు ప్లాన్ వేస్తోందనేది కేసీఆర్ చెప్తున్న మాట. అయినా ఎన్నికలు ఎప్పుడొచ్చినా తగ్గేదే లేదని తేల్చేశారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని.. బీజేపీ మైండ్ బ్లాక్ అయ్యేలా తీర్పు ఇవ్వాలని సూచించారు. అంతేకాక.. మొదటి సారి ఎన్నికల్లో 63 సీట్లు, రెండోసారి 88 సీట్లు సాధించామని కేసీఆర్ చెప్పారు. ఈసారి మాత్రం వంద సీట్లకు తగ్గకుండా సాధించబోతున్నామని చెప్పారు. గెలవడం మనకు ముఖ్యం కాదని.. అయితే ఆ గెలుపు ప్రత్యర్థులు వణికేలా ఉండాలనేది కేసీఆర్ ఆలోచన.

ఒకవైపీ బీజేపీయోమో తాము తెలంగాణలో గెలవబోతున్నట్టు గట్టిగా చెప్తోంది. కాంగ్రెస్ కూడా ఈసారి గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించబోతున్నామని చెప్పుకుంటోంది. కేసీఆర్ మాత్రం గతంలో కంటే ఎక్కువ సీట్లతో విపక్షాలకు మైండ్ బ్లాంక్ చేస్తామంటున్నారు. ఇంతకూ కేసీఆర్ కు ఇంత ధీమా ఎక్కడి నుంచి వచ్చిందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే తాజా సర్వేలు కేసీఆర్ కు పూర్తి అనుకూలంగా వచ్చాయి. గత ఆరు నెలల ముందుతో పోల్చితే ఇప్పుడు బీఆర్ఎస్ ఇంపాక్ట్ బాగా పెరిగిందని సమాచారం. బీజేపీ, కాంగ్రెస్ పైపైన హడావుడి తప్ప బీఆర్ఎస్ ను కొట్టేంత దమ్ము ధైర్యం ఆ పార్టీలకు లేవని.. ఈసారి కూడా కారు పార్టీదే అధికారం అని తేల్చేశాయి తాజా సర్వేలు.

అయితే వాస్తవానికి సర్వేల్లో 65 సీట్లు పక్కా అని తేలింది. కానీ కేసీఆర్ మాత్రం వందకు తగ్గవంటున్నారు. కేడర్ లో జోష్ నింపేందుకే కేసీఆర్ ఇలా చెప్పినట్లు అర్థమవుతోంది. ఇలా చెప్పకుంటే కేడర్ నీరుగారిపోతుంది. పాజిటివ్ యాటిట్యూడ్ తో వాళ్లను నింపి వాళ్ల చేతికి అస్త్రశస్త్రాలు ఇవ్వాలి. అప్పుడే కేసీఆర్ అనుకున్న టార్గెట్ రీచ్ అవగలరు. ఇన్నాళ్లూ కాస్త అటూఇటూ ఉన్న కేడర్ లో కేసీఆర్ కామెంట్స్ ఫుల్ జోష్ తీసుకొచ్చాయి. గెలుపు ఖాయమని తేలిపోయింది కాబట్టి ఇకపై పూర్తిగా మెజారిటీపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నారు కేసీఆర్.