KCR: ప్రగతి భవన్‌తోపాటు ఆ ఇల్లు కూడా ఖాళీ చేస్తున్న కేసీఆర్..

అన్ని రాష్ట్రాల సీఎంలకు ఇలా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అధికారిక నివాసాల్ని కేటాయిస్తుంది. వివిధ పనుల కోసం ఢిల్లీ వచ్చినప్పుడు సీఎంలు ఉండేందుకు వీలుగా ఇళ్లను కేటాయిస్తారు. అలా కేసీఆర్ సీఎం అయినప్పటి నుంచి తుగ్లక్ లేన్‌లోని ఇంట్లోనే ఉండేవారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 5, 2023 | 03:09 PMLast Updated on: Dec 05, 2023 | 3:09 PM

Kcr Vacating His Home In Delhi Tuglak Road

KCR: తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. పార్టీ పరాజయం పాలవడంతో కేసీఆర్ తన సీఎం పదవికి వెంటనే రాజీనామా చేశారు. అనంతరం ప్రగతి భవన్ ఖాళీ చేసి వెళ్లిపోయారు. అయితే, ఇప్పుడు ఢిల్లీలోని తన అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా తుగ్లక్ లైన్‌లోని ఇంట్లో ఉండేవాళ్లు. అన్ని రాష్ట్రాల సీఎంలకు ఇలా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అధికారిక నివాసాల్ని కేటాయిస్తుంది.

BRS MP SEATS: కారు తిరుగుతుందా..? కారుకు పొంచి ఉన్న మరో గండం..

వివిధ పనుల కోసం ఢిల్లీ వచ్చినప్పుడు సీఎంలు ఉండేందుకు వీలుగా ఇళ్లను కేటాయిస్తారు. అలా కేసీఆర్ సీఎం అయినప్పటి నుంచి తుగ్లక్ లేన్‌లోని ఇంట్లోనే ఉండేవారు. అయితే, ఇప్పుడు కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో పదవి కోల్పోయిన వాళ్లు ఇల్లు ఖాళీ చేసేందుకు నెల రోజుల సమయం ఉంటుంది. ఈ లెక్కన కేసీఆర్.. ఢిల్లీలోని ఇంటిని మరో నెల పాటు వినియోగించుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ, తన నివాసాన్ని వెంటనే ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఢిల్లీ, తుగ్లక్ లేన్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేయించే పనిలో ఉన్నారు అధికారులు. నిజానికి ఈ ఇంటితో కేసీఆర్‌కు దాదాపు 20 ఏళ్ల అనుబంధం ఉంది. 2004లో ఎంపీగా గెలిచినప్పటి నుంచి కేసీఆర్ అదే నివాసంలో ఉంటున్నారు. ఎంపీలకు కూడా ఢిల్లీలో ఇల్లు కేటాయిస్తారనే సంగతి తెలిసిందే. దీంతో 2004లో ఎంపీ అయినప్పటి నుంచి కేసీఆర్ అదే ఇంటిని తన అధికారిక నివాసంగా ఎంచుకున్నారు.

2006లో కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన కేసీఆర్.. ఉప ఎన్నికల్లో ఎంపీగా గెలిచి అదే సభలో కొనసాగారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టినా, 2009లో మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా ఎన్నికైనా, చివరకు 2014 నుంచి సీఎంగా కొనసాగుతున్నా.. కేసీఆర్ ఆ ఇంటినే ఎంపిక చేసుకున్నారు. తెలంగాణ నుంచి ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా అక్కడే ఉండేవారు. ఆయన కూతురు. మాజీ ఎంపీ కవిత కూడా అప్పట్లో అదే ఇంటిని వినియోగించుకునే వారు.