BRS PLAN: నీళ్లతోనే కాంగ్రెస్‌ని కొట్టాలి.. కాంగ్రెస్‌ను ఎదుర్కొనేలా బీఆర్ఎస్ ప్లాన్
ఏ కాళేశ్వరం పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో బద్నాం అయ్యారో.. అదే కాళేశ్వరం నుంచి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టే ప్లాన్‌లో ఉందట గులాబీ పార్టీ అధినాయకత్వం. నీటి సమస్యలే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.
BRS PLAN: అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన ఊహించని షాక్‌తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న బీఆర్‌ఎస్ అధినాయకత్వం తట్టుకుని తిరిగి లేచే ప్రయత్నంలో ఉంది. పవర్‌లో ఉన్న పదేళ్ళలో మర్చిపోయిన ఉద్యమ స్వరాన్ని మళ్ళీ సవరించుకుంటోంది. నీళ్ళు, నిధులు, నియామకాలు అంటూ ఉద్యమం ప్రారంభించిన పార్టీ.. తిరిగి నీళ్ళతోనే రీఛార్జ్ అవ్వాలనుకుంటోంది. ఏ కాళేశ్వరం పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో బద్నాం అయ్యారో.. అదే కాళేశ్వరం నుంచి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టే ప్లాన్‌లో ఉందట గులాబీ పార్టీ అధినాయకత్వం. నీటి సమస్యలే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.
PAWAN KALYAN: అంత మాట అనేశాడే ! పవన్‌పై టీడీపీ గరంగరం.. బతిమలాడుకుంటున్న బాబు
నీళ్ళ సెంటిమెంట్‌తో నిప్పులు రగిల్చి తిరిగి నిలబడాలనుకుంటోందట బీఆర్‌ఎస్ అధిష్టానం. దాని ద్వారా పోగొట్టుకున్నచోటే వెదుక్కోవాలని ఫిక్స్ అయినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుతో డిఫెన్స్‌లో పడింది బీఆర్‌ఎస్. పైకి ఎంత గాంభీర్యం ప్రదర్శించినా లోలోపల ఆ పార్టీని అప్పట్లో మేడిగడ్డ భయం వెంటాడిందట. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ పాయింట్‌ను బాగానే వాడేసుకుంది. కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి అంటూ చేసిన ప్రచారం జనంలోకి బాగానే ఎక్కింది. చివరికి ఫలితాల్లో ఆ ప్రభావం కనిపించింది. దీంతో ఈసారి గోదావరి, కృష్ణా జలాలే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకుంటున్నట్టు తెలిసింది. అందుకోసం పార్టీ అధిష్టానం ప్రణాళికలు రూపొందిస్తోందట. గోదావరికి సంబంధించి కాళేశ్వరం, కృష్ణా జలాలకు సంబంధించి నాగార్జునసాగర్ నుంచి యాత్రలను ప్రారంభించే యోచనలో ఉన్నట్టు తెలిసింది. రెండింటికీ వేర్వేరుగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సారధ్యం వహించబోతున్నట్టు చెబుతున్నాయి బీఆర్‌ఎస్ వర్గాలు.
Nara Bhuvaneswari: భువనేశ్వరి సరదా కామెంట్స్.. బాబుని ఆటాడుకుంటున్న వైసీపీ !
త్వరలోనే ఈ యాత్రలను మొదలు పెట్టాలనుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఉత్తర, దక్షిణ తెలంగాణల్లో ఒకేసారి నీటి యాత్రలు ప్రారంభించి రెండిటినీ ఒకేసారి హైదరాబాద్‌లో ముగించాలనీ.. ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించి కాంగ్రెస్ సర్కార్ మీద సమర శంఖం పూరించాలనుకుంటున్నట్టు తెలిసింది. కేంద్రానికి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారంపై ఇప్పటికే నల్లగొండలో భారీ సభ నిర్వహించింది బీఆర్‌ఎస్. కృష్ణా ప్రాజెక్ట్‌లను కేఆర్‌ఎంబీకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందనీ.. తమ ఆందోళన వల్లే ఆ విషయంలో వెనక్కు తగ్గిందని చెబుతున్నారు బీఆర్‌ఎస్ నేతలు. నీళ్ళన్నది ఎప్పటికీ సెంటిమెంట్ సబ్జెక్టేనని, దాన్ని సరిగ్గా వాడుకుంటే.. తిరిగి పుంజుకోవడం పెద్ద కష్టం కాదన్నది బీఆర్‌ఎస్ పెద్దల అభిప్రాయంగా తెలిసింది. అందుకే ఈ విషయంలో జరుగుతున్న అన్యాయంపై పార్టీ కేడర్ ప్రజలకు వివరించాలని కూడా ఆల్రెడీ ఆదేశాలు వెళ్ళాయట. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై దర్యాప్తునకు సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకు కూడా కౌంటర్‌ను సిద్ధం చేసుకుంటోందట గులాబీ దళం.
పిల్లర్స్ కుంగితే మరమ్మతులు చేయకుండా సర్కార్ రైతులకు అన్యాయం చేస్తోందని, గోదావరి జలాలు పొలాల్లో పారకుండా కాంగ్రెస్ అడ్డుపడుతోందని ఆరోపిస్తూ యాత్రను ప్రారంభిస్తున్నట్టు తెలిసింది. సాగునీటి విషయంలో సర్కార్ చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టడమే లక్ష్యంగా రెండు యాత్రలు జరుగుతాయని, త్వరలోనే తేదీలు ప్రకటిస్తారని చెబుతున్నాయి బీఆర్‌ఎస్ వర్గాలు. మరి గులాబీ పార్టీ తాజా ఉద్యమం ఎలా ఉంటుందో చూడాలంటున్నాయి రాజకీయవర్గాలు.