KCR : గజ్వేల్‌లో కేసీఆర్‌కు మరో షాక్.. గట్టెక్కగలరా ?
తెలంగాణలో హ్యాట్రిక్ అధికారమే లక్ష్యంగా కారు స్టీరింగ్ తిప్పుతున్న కేసీఆర్‌కు.. ఆ ఆశ అంత ఈజీగా నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదు. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీగా.. జనాల్లో వ్యతిరేకత ఉంది.

KCR, who is aiming for a hat-trick of power in Telangana, does not seem to be able to fulfill that hope so easily
తెలంగాణలో హ్యాట్రిక్ అధికారమే లక్ష్యంగా కారు స్టీరింగ్ తిప్పుతున్న కేసీఆర్‌కు.. ఆ ఆశ అంత ఈజీగా నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదు. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీగా.. జనాల్లో వ్యతిరేకత ఉంది. దీనికి తోడు ఓ వైపు ఓవైపు కాంగ్రెస్ తరుముతుంటే.. మరోవైపు బీజేపీ బీజేపీ దూసుకువస్తోంది. దీంతో ఆ రెండు పార్టీలు కేసీఆర్‌ను, కారు పార్టీని ఇరకాటంలో పెడుతున్నాయ్. పార్టీలో మిగతా అభ్యర్థుల సంగతి ఎలా ఉన్నా.. కేసీఆర్ ఆలోచన ఏంటో కానీ.. రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా బరిలో ఉన్నారు. ఐతే రెండుచోట్ల రెండు ప్రధాన పార్టీలు కేసీఆర్‌ను టార్గెట్ చేశాయ్. గజ్వేల్‌లో కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఈటల పోటీకి దిగుతుంటే.. కామారెడ్డిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సై అంటున్నారు. ఇది కేసీఆర్‌కు ఒకరకంగా సవాల్ విసరడమే. ఐతే ఫలితం ఎలా ఉంటుంది అన్న సంగతి పక్కనపెడితే.. కేసీఆర్‌కు ఇది ఒకరకంగా తలపోటే ! దీని గురించి చర్చ జరుగుతున్న సమయంలోనే కేసీఆర్‌కు మరో కొత్త టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే తెలంగాణలో నామినేషన్లు ముగిశాయ్. వెరిఫికేషన్ ఒక్కటే బ్యాలెన్స్ అంతే ! ఐతే గజ్వేల్‌లో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.
KCR BOOMARANG : ఇలా జరుగుతోందేంటి .. ? అడ్డం తిరుగుతున్న బీఆర్ఎస్ ప్లాన్స్.. !
ఈసారి అక్కడ 154 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా షాక్‌కు గరయ్యారు. కేసీఆర్‌పై సొంత నియోజకవర్గంలోనే ఇంతమంది నామినేషన్లు వేయడం.. అక్కడి పరిస్థితికి అద్దం పడుతోందనే చర్చ జరుగుతోంది. 154 నామినేషన్లు అంటే మామూలు విషయం కాదు. ఇలా గంపగుత్త నామినేషన్లు పడడంతో.. గత పార్లమెంట్ ఎన్నికల్లో కవిత మీద ఎఫెక్ట్ పడింది. ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు కేసీఆర్ విషయంలోనూ అదే జరుగుతుందా అనే చర్చ జరుగుతోంది. దీంతో కేసీఆర్‌కు వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేసిన వారిని బీఆర్ఎస్ శ్రేణులు బుజ్జగించే పనిలో పడ్డారట. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఎక్కువ శాతం మంది రంగారెడ్డి వట్టి నాగులపల్లి ప్లాట్స్ బాధితులు, రైతులే ఉన్నారని తెలుస్తోంది. చెరుకు ఫ్యాక్టరీలను మళ్లీ రీ ఓపెన్ చేయించాలని రైతులు అధిక సంఖ్యలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా నామినేషన్లు వేసినట్టు తెలుస్తోంది.