KCR: అసెంబ్లీకి కేసీఆర్ వస్తారా.. రారా.. కారణమేంటి..?
నిజానికి ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రావాల్సి ఉంది. వస్తారనే అనుకున్నారు అంతా. కానీ, కేసీఆర్ ఈసారి కూడా అసెంబ్లీకి రాలేదు. మరో రెండు రోజుల్లో అసెంబ్లీకి వస్తారని ప్రచారం జరుగుతున్నా దీనిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో అసలు.. కేసీఆర్ నిజంగా అసెంబ్లీకి వస్తారా..? రారా..?
KCR: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత జరుగుతున్న రెండో అసెంబ్లీ సమావేశాలివి. అయితే, మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు కూడా అసెంబ్లీకి హాజరు కాలేదు. మొదటి సమావేశాల సమయానికి ఆయన గాయపడి, తుంటి శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. దీంతో విశ్రాంతి తీసుకోవడం వల్ల ఆయన అసెంబ్లీకి రాలేదనుకోవచ్చు. ఇప్పుడు ఆయన కాస్త కోలుకున్నారు.
King Charles: బ్రిటన్ కింగ్‌కు కేన్సర్.. కోహినూర్ వజ్రం శాపమేనా..? భయపెడుతోన్న డైమండ్ చరిత్ర..
పైగా అసెంబ్లీకి వచ్చి, గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ నేతలతో సమావేశం కూడా నిర్వహించారు. నిజానికి ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రావాల్సి ఉంది. వస్తారనే అనుకున్నారు అంతా. కానీ, కేసీఆర్ ఈసారి కూడా అసెంబ్లీకి రాలేదు. మరో రెండు రోజుల్లో అసెంబ్లీకి వస్తారని ప్రచారం జరుగుతున్నా దీనిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో అసలు.. కేసీఆర్ నిజంగా అసెంబ్లీకి వస్తారా..? రారా..? అనే చర్చ జరుగుతోంది. అయితే, కేసీఆర్.. రాబోయే ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అందువల్ల అసెంబ్లీకి హాజరవుతారా అనే సందేహాలు కూడా తలెత్తాయి. పైగా రేవంత్ సీఎంగా ఉండగా, అసెంబ్లీకి ప్రతిపక్ష నేతగా రావడానికి కేసీఆర్ అంగీకరించకపోవచ్చని మరో వాదనా తెరపైకి వచ్చింది. అందువల్లే ఆయన అసెంబ్లీకి రాకపోవచ్చని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. దీనికి తగ్గట్లే కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ, కేసీఆర్ ఈ నెల 10న సమావేశాలకు హాజరవుతారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. అదే రోజు తెలంగాణలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు.
అందువల్ల బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ అందుబాటులో ఉంటారు. పైగా ఇప్పుడు కేసీఆర్ మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. అంటే పార్లమెంటుకు వెళ్లకుండా.. ఎమ్మెల్యేగానే ఉంటూ పార్టీపై, తెలంగాణపై దృష్టి పెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారట. పైగా బీఆర్ఎస్ పాలనపై రేవంత్ సహా కాంగ్రెస్ సర్కార్ తీవ్ర విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ పాలనలోని అవినీతిని, వైఫల్యాల్ని కాంగ్రెస్ ఎండగడుతోంది. ఈ పరిస్థితుల్లో తాను ఇక్కడుంటేనే కాంగ్రెస్‌ను ఎదుర్కోవచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. అందువల్ల కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపై పార్టీపై దృష్టి పెడుతూనే, కాంగ్రెస్‌పై కేసీఆర్ పోరాడుతారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.