KCR: కేసీఆర్ గజ్వేల్‌లో ఓడిపోతారా.. సర్వే రిపోర్ట్‌లు ఏం చెప్తున్నాయి..?
రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని నడిపిన బీఆర్‌ఎస్ పార్టీ క్రమంగా తెలంగాణలో పట్టు కోల్పోతోంది. ఏకంగా కేసీఆర్ నియోజకవర్గంలోనే నిరసన గళాలు వినిస్తున్నాయి. నాయకులు కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడేందుకు భయపడ్డా.. ప్రజలు మాత్రం రోడ్డెక్కుతున్నారు.
KCR: గులాబీ బాస్ కేసీఆర్‌ను సొంత నియోజకవర్గం గజ్వేల్ టెన్షన్ పెడుతున్నట్టు కనిపిస్తోంది. పార్టీ సంగతి పక్కన పెడితే తన గెలుపుపైనే కేసీఆర్ ధీమా కోల్పోయినట్టు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కకు పెట్టి మరీ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారంటే.. కేసీఆర్‌కు ఓటమి భయం బాగానే పట్టుకుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని నడిపిన బీఆర్‌ఎస్ పార్టీ క్రమంగా తెలంగాణలో పట్టు కోల్పోతోంది. ఏకంగా కేసీఆర్ నియోజకవర్గంలోనే నిరసన గళాలు వినిస్తున్నాయి.
నాయకులు కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడేందుకు భయపడ్డా.. ప్రజలు మాత్రం రోడ్డెక్కుతున్నారు. ఏ రైతులను బలంగా చేసుకుని కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారో.. ఇప్పుడు అదే రైతుల నుంచి ఇప్పుడు ఆయనకు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదురవుతోంది. మరోపక్క సర్వే రిపోర్టులు కూడా కేసీఆర్‌కు వ్యతిరేకంగానే వస్తున్నాయి. ఇదే ఇప్పుడు గులాబీ దళపతిని టెన్షన్ పెడుతోంది. తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టి మూడోసారి సీఎం అవ్వాలి అనుకుంటున్న కేసీఆర్‌కు ఇప్పుడు ఓటమి భయం పట్టుకుంది. గజ్వేల్‌లో నాయకులను కంట్రోల్ చేయొచ్చు కానీ ప్రజా వ్యతిరేకతను ఏ నాయకుడు తట్టుకోలేడు. దీనికి కేసీఆర్ అతీతుడు కాదు. అందుకే ఆయన రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.
ఇప్పుడున్న వ్యతిరేకత దృష్ట్యా గజ్వేల్‌లో ఓడిపోయినా కామారెడ్డిలో గెలవచ్చు అనే లెక్కల్లో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంలో ప్రతిపక్షాలు కూడా కేసీఆర్ మీద విమర్శలు చేస్తున్నాయి. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని.. ఖచ్చితంగా ఈసారి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాదని చెప్తున్నాయి. గెలుపుకోసం సామ దాన బేద దండోపాయాలను ఉపయోగిస్తున్న కేసీఆర్ ఎన్నికలను ఎలా ఎదుర్కుంటారో చూడాలి.