KCR, Telangana Moment : కేసీఆర్ నయా స్కెచ్.. బీఆర్ఎస్ ప్లాన్ తో అన్నీపార్టీలు ఫట్..
పోలింగ్ తేదీకి సరిగ్గా ఒక్కరోజు ముందు బీఆర్ఎస్ ఛీఫ్, సీఎం కేసీఆర్ పార్టీల ఊహకందని విధంగా ఓ ప్లాన్ అమలు చేయబోతున్నారు.. ప్రభుత్వ వ్యతిరేకత.. కాంగ్రెస్ వేవ్ నడుస్తోంది.. లాంటి టాక్స్ కి చెక్ పెట్టేలా దిమ్మతిరిగే ప్లాన్ వేశారు. సరిగ్గా పోలింగ్ కు ముందు రోజు.. ఒక్క కార్యక్రమం నిర్వహించడం ద్వారా తెలంగాణ జనంలో మళ్ళోసారి సెంటిమెంట్ రెచ్చగొట్టవచ్చు. ఓట్లన్నీకారు గుర్తుకే పడతాయి.. హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని బీఆర్ఎస్ లీడర్లు సంబుర పడుతున్నారు. ఇంతకూ ఆ ప్లానేంటి ?

BRS : బీఆర్ఎస్ కి మౌత్ టాక్ భయం..
నవంబర్ 29.. అంటే దీక్షా దివస్.. తెలంగాణ ప్రజలందరికీ గుర్తుండిపోయే రోజు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన రోజు. ప్రతి యేటా ఆ రోజును బీఆర్ఎస్ ఘనంగా నిర్వహిస్తోంది. ఈసారి కూడా ఎన్నికల తేదీ అంటే నవంబర్ 30కి ఒక్క రోజు ముందు.. దీక్షా దివస్ వచ్చింది. అందుకే ఈ రోజును ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ ప్లాన్ వేసింది. 28 సాయంత్రానికి రాజకీయ నేతల ప్రచారం ఆగిపోతుంది. అందువల్ల నవంబర్ 29 నాడు దీక్షా దివస్ నాడు సేవా కార్యక్రమాలు నిర్వహించాలనీ.. తమ ఇళ్ళపై బీఆర్ఎస్ జెండాలు ఎగరవేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు ఇచ్చారు. చావునోట్లో తలపెట్టిన కేసీఆర్‌లాగా పోరాడాలంటే.. ఎంతో గుండె దమ్ము కావాలన్న కేటీఆర్.. అందుకే ఆయన పోరాటానికి గుర్తుగా.. నవంబర్ 29ని దీక్షా దినోత్సవంగా జరుపుతామని తెలిపారు.
దీక్షా దివస్ ను జరపడం ద్వారా మరోసారి రాష్ట్ర ఉద్యమ సాధన రోజులను తెలంగాణ జనానికి గుర్తు చేయాలన్నది బీఆర్ఎస్ ఆలోచనగా కనిపిస్తోంది. రెండు పర్యాయాలు ఇదే సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చింది గులాబీ పార్టీ. ఇప్పుడు ఆ అస్త్రం వర్కవుట్ కాదు.. ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉంది.. కాంగ్రెస్ వేవ్ నడుస్తోంది అన్న టాక్ రాష్ట్రంలో నడుస్తోంది. ఈ అంశాల నుంచి జనం ఆలోచనను మళ్ళించి.. మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించడానికి దీక్షా దివస్ కలిసొస్తుందని బీఆర్ఎస్ అధిష్టానం ప్లానేసింది. ఈ ప్లాన్ తో కాంగ్రెస్, బీజేపీలకు ఒకేసారి చెక్ పెట్టొచ్చని గులాబీ పార్టీ ఆలోచిస్తోంది.
నవంబర్ 28కే ఎన్నికల ప్రచారం ముగుస్తుండటంతో.. 29న బీఆర్ఎస్ చేపట్టే దీక్షా దివస్ కార్యక్రమం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందా అన్న చర్చ మొదలైంది. దీక్షాదివస్ బీఆర్ఎస్ కు మైలేజీ తెచ్చే అవకాశం ఉండటంతో.. దీన్ని జరపకుండా అడ్డుకోవాలి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.