బిజెపికి కేశినేనినాని… రంగం సిద్ధం చేసుకుంటున్న మాజీ ఎంపీ.

కేశినేని ట్రావెల్స్ తో పాపులర్ అయిన కేశినేని నాని... పి ఆర్ పి తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి..... చిరంజీవిని నానా బూతులు తిట్టి ఆ పార్టీని విడిచిపెట్టి, ఆ తర్వాత తిన్నగా టిడిపిలో చేరిపోయారు. పది సంవత్సరాలు ఎంపీగా ఉండి..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 18, 2025 | 05:15 PMLast Updated on: Feb 18, 2025 | 5:15 PM

Keshineninani Is A Former Mp Who Is Preparing The Field For Bjp

కేశినేని ట్రావెల్స్ తో పాపులర్ అయిన కేశినేని నాని… పి ఆర్ పి తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి….. చిరంజీవిని నానా బూతులు తిట్టి ఆ పార్టీని విడిచిపెట్టి, ఆ తర్వాత తిన్నగా టిడిపిలో చేరిపోయారు. పది సంవత్సరాలు ఎంపీగా ఉండి… టిడిపి అధిష్టానికే కాలులో ముల్లులా మారారు. మాట్లాడితే బెజవాడ నాది అని ఒకటికి పది సార్లు చెప్పుకునే కేశినేని నాని నిజానికి బెజవాడకు చేసింది శూన్యం. ఎంపీగా ఉన్నప్పుడు బిజెపి అగ్రనేత, కేంద్ర మంత్రి నితిన్ ఘట్కరితో పెరిగిన పరిచయాన్ని నాని అటు పాలిటిక్స్ లోను, ఇటు ఫ్యామిలీ డెవలప్మెంట్ లోను ఫుల్ గా వాడేసారు. అయితే దానివల్ల విజయవాడకి ఒరిగింది ఏమీ లేదు. నాని అహంకారంతో విసిగిపోయిన టిడిపి క్యాడర్, అధిష్టానం రెండు చివరికి ఆయన్ని బలవంతంగా వదిలించుకోవలసి వచ్చింది. నాని సోదరుడు శివనాథ్ అలియాస్ కేసినేని చిన్నికి బెజవాడ ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకుంది టిడిపి అధిష్టానం.

కలుపుగోలు మనిషి కావడం…. రాజకీయాల్లోకి రాకముందే…. సేవా కార్యక్రమాల్లో బాగా తిరగడంతో కేశినేని చిన్నికి జనంలో పలుకుబడి పెరిగింది. ఆయన అన్న కేసినేని నానికి కుటుంబంలో కూడా వ్యతిరేకత వచ్చేసింది. టిడిపిలో తనకి మూడోసారి ఎంపీ సీటు నిరాకరించారు అన్న కసితో నేరుగా జగన్ దగ్గరికి వెళ్లి వైసిపి టికెట్ తెచ్చుకున్నారు కేసినేని నాని.కానీ దారుణంగా ఓడిపోయారు. దాంతో బాగా ఫ్రస్టేషన్ లో కిందటేడు జూన్ 10న తాను రాజకీయాల్లో ఇకపై కొనసాగబోనని ప్రకటించేశారు.ఎన్నికలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారాలను కూడా నిలిపేశారు. రాజకీయాలు లేక ,వ్యాపారాలు లేక…. అయిన వాళ్ళు ఎవరు పలకరించక….. పూర్తిగా మరుగున పడిపోయారు కేసినేని నాని. తనకు చంద్రబాబు నాయుడు నిత్యం టచ్ లో ఉన్నాడని, తనను వదులుకొని పెద్ద తప్పు చేసినట్లుగా టిడిపి భావిస్తోందని, లోకేష్ ఫోన్ చేసినా తాను కాల్స్ ఎత్తడం లేదని, సీనియర్ నేతలు కొందరు పార్టీలోకి తిరిగి రావాలని విజ్ఞప్తి చేస్తున్న తిరిగి వెళ్లాలని తనకు లేదని…. ఇలా అడిగినోళ్లకి అడగనోళ్ళకి పదేపదే చెబుతున్నారు కేసినేని నాని. నాని మాటలు విని జనం పక్కకు వచ్చి నవ్వుకుంటున్నారు. నిజానికి కేశినేని నాని తిరిగి టిడిపిలోకి వెళ్లడం అనేది అసాధ్యం.

చంద్రబాబు కానీ, లోకేష్ గాని అలాంటి ఆలోచనలోనే లేరు. తన ఉనికి కోసం నాని చెప్పుకునే ఉత్తుత్తి మాటలని అందరికీ తెలుసు. అయితే సామాజిక వర్గం పరంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తో ఉన్న పూర్వ పరిచయం…. ఇటీవల ఆమెతో వరుస సమావేశాలు కేశినేని నాని తిరిగి రాజకీయాల్లోకి రావడానికి లైన్ క్లియర్ చేశాయి. బిజెపిలో చేరడానికి నాని దాదాపుగా నిర్ణయించుకున్నారు. తనకు పదవులు ఏమి ఇవ్వకపోయినా కుమార్తె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బిజెపిలో చేరాలని డిసైడ్ చేసుకున్నారు. ఇందుకోసం విజయవాడ పార్లమెంటు పరిధిలో రహస్య సమావేశాలు కూడా నిర్వహించారు. సన్నిహితులతో చర్చలు జరిపారు. కేంద్రంలో తనకు పరిచయం ఉన్న నితిన్ గట్కరి రాజకీయంగా చేయి అందిస్తారు కనుక….. బిజెపిలో చేరడమే మంచిదని అభిప్రాయంలో ఉన్నారు కేశినేని నాని. టిడిపిలోకి మళ్లీ వెళ్లే అవకాశం లేదు. అక్కడ రానివ్వరు.

పైగా తమ్ముడు కేశినేని చిన్ని టిడిపిలో బలంగా పాతుకు పోయారు. అధిష్టానానికి బాగా దగ్గరయ్యారు. లోకేష్ టీంలో ముఖ్య నాయకుడిగా ఎదిగారు. కేశినేని నాని వైసీపీలో ఒకసారి చేరి, ఓడిపోయిన తర్వాత ఆ పార్టీతో గాని, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్తో గాని పెద్దగా సంబంధాలు కూడా లేవు. ఇంక నానికి ఉన్న ఏకైక దారి బిజెపి మాత్రమే. ఇప్పుడు ఇ పదవులు ఏమి రాకపోయినా…. పార్టీలో ఒక మూల పడి ఉంటే 2029 కైనా తనకి ,తన కుమార్తెకి ఏదో ఒక భవిష్యత్తు ఉంటుందని ఆశతో ఉన్నాడు కేసినేని నాని. రాష్ట్రంలో ఎలాగూ పురందేశ్వరి అండగా ఉండనే ఉంది. కనుక తిరిగి మళ్లీ బిజెపి ద్వారా రాజకీయంగా ఎదగవచ్చు అన్నది నాని ప్లాన్. దీనిలో భాగంగానే తిరిగి బస్సులు వ్యాపారం మొదలుపెట్టారు. ఈసారి ఢిల్లీ కేంద్రంగా ఆయన ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేయబోతున్నారు. దీని ద్వారా ఢిల్లీలో బిజెపి అగ్ర నేతల దగ్గరకు చేరవచ్చు అన్నది కేశినేని ప్లాన్. తన భవిష్యత్తు కంటే కుమార్తె భవిష్యత్తు కూడా ఇప్పుడు కేశినేని చాలా ముఖ్యం. పోయిన పరువును…. పొలిటికల్ పవర్ ను సంపాదించుకోవాలంటే తమ్ముడు కేశినేని చిన్ని దారిలోనే వెళ్తూ… చిన్నచిన్న సేవా కార్యక్రమాలు చేస్తూ మళ్లీ పాతుకు పోవాలన్నది నాని ప్లాన్.

ఢిల్లీలో బస్సు వ్యాపారం…. స్థానికంగా సేవా కార్యక్రమాలు.. ఇది ఇప్పుడు నాని స్ట్రాటజీ. అయితే అహంకారానికి పరాకాష్టగా ఉండే నాని తో కలిసి ప్రయాణించడం చాలా కష్టమని స్థానిక బిజెపి కార్యకర్తలు చెప్తున్నారు. అయినా సరే ధైర్యం చేసి రెండు మూడు నెలల్లో బిజెపిలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు కేసినేని. దీనిలో భాగంగా తనకు మోడీ నుంచి ఆహ్వానం వచ్చిందని, నితిన్ గడ్కరీ పార్టీలోకి రమ్మని పిలుస్తున్నారని చెప్పడానికి ఒక కొత్త కథ కూడా సిద్ధమవుతోంది. అయితే ఇప్పటికే నాని బిజెపి చేరిక వార్తలు గుప్పుమనడంతో…. వాటిని ట్విట్టర్లో ఖండించారు కేశినేని నాని. తాను రాజకీయాల్ని వదిలేశానని… ఇక మళ్లీ ఆ జోలికి పోనని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఆయన ఎంతవరకు మాట మీద నిలబడతాడు…. లేదంటే బిజెపిలో చేరి…. కేవలం పార్టీకే పరిమితమై కూతురు పదవి కోసం కృషి చేస్తాడా… అని చర్చ కూడా జరుగుతుంది.