హిమాలయాల్లో కేతిరెడ్డి, రెండు రోజుల్లో వస్తా

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి భూ అక్రమాలకు పాల్పడ్డారని అధికారులు నోటీసులు జారీ చేసిన నేపధ్యంలో ఆయన రియాక్ట్ అయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 8, 2024 | 11:47 AMLast Updated on: Nov 08, 2024 | 11:47 AM

Kethireddy Reacts On Irrigation Department Notices

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి భూ అక్రమాలకు పాల్పడ్డారని అధికారులు నోటీసులు జారీ చేసిన నేపధ్యంలో ఆయన రియాక్ట్ అయ్యారు. హిమాలయాల్లో నుంచి వీడియో రిలీజ్ చేసిన కేతిరెడ్డి… కూటమి వచ్చిన నాటి నుండి అధికారులు అందరు దీని మీద పని చేస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్ చేతన్ మంచి వారే …కానీ ఏం చేస్తాం అని మండిపడ్డారు. 908,909,904,905 సర్వే లో మా భూములు ఉన్నాయని స్పష్టం చేసారు.

ఇరిగేషన్ కు సంబందించి 601 సర్వే నెంబర్లను లో మాత్రమే ఉన్నాయని నా భూములకు వాటికి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చేసారు. ఇవి అసందర్భ నోటీసులని మండిపడ్డారు. నేను వీటిపై హైకోర్టు కు వెళ్ళాను…. హై కోర్టు ఆ నోటీసులను కొట్టివేసిందన్నారు. కాగా వారం రోజుల్లో కాళీ చేయకపోతే మాత్రం కచ్చితంగా స్వాధీనం చేసుకుంటాం అని జలవనరుల శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.