బ్రేకింగ్: బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులను ఎలాగైనా పట్టుకునేందుకు బెట్టింగ్ యాప్‌పై దూకుడు పెంచారు మియాపూర్ పోలీసులు.

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులను ఎలాగైనా పట్టుకునేందుకు బెట్టింగ్ యాప్‌పై దూకుడు పెంచారు మియాపూర్ పోలీసులు. పలు కంపెనీలపై కేసులు నమోదు చేశారు. సినీ యాక్టర్స్ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ మీద ముందుగా కేసులు నమోదు చేశారు. జంగిల్ రమ్మీ యాప్ కోసం రానా, ప్రకాష్ రాజ్ ప్రమోట్ చేసినట్లు గుర్తించారు. ఏ 23 యాప్ కోసం విజయ్ దేవరకొండ ప్రచారం చేసినట్లు గుర్తించారు.
యోలో 24/7 యాప్ కోసం మంచు లక్ష్మి పని చేసినట్లు చెప్తున్నారు. ఫెయిర్ ప్లే లైవ్ యాప్ కోసం ప్రచారం చేసిన హీరోయిన్ ప్రణీత మీద కేసు బుక్ చేశారు. జీట్ విన్ యాప్ కోసం నిధి అగర్వాల్, ఆంధ్ర 365 ఆప్ కోసం నటి శ్యామల ప్రమోషన్స్ నిర్వహించారు. రీతు చౌదరి, టేస్టీ తేజ, భయ్య సన్నీలు పలు యాప్ల కోసం ప్రచారం చేసినట్టు గుర్తించారు. వీళ్లందరినీ సాక్ష్యులుగా మార్చి బెట్టింగ్ యాప్ నిర్వహించేవాళ్లపై కేసులు పెట్టే పనిలో ఉన్నారు పోలీసులు.