తెలంగాణలో ఇక కేఎఫ్ బీర్లు దొరకవు
తెలంగాణ బీవరేజెస్ కార్పోరేషన్‌కు సరఫరా నిలిపివేస్తున్నట్టు కేఎఫ్ బీర్లు తయారు చేసే యునైటెడ్ బ్రూవరీస్ ప్రకటించింది. కేఎఫ్‌తో పాటు హైకెన్ బీర్ల సరఫరా కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
తెలంగాణ బీవరేజెస్ కార్పోరేషన్‌కు సరఫరా నిలిపివేస్తున్నట్టు కేఎఫ్ బీర్లు తయారు చేసే యునైటెడ్ బ్రూవరీస్ ప్రకటించింది.
కేఎఫ్‌తో పాటు హైకెన్ బీర్ల సరఫరా కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.యూబీ పెట్టిన కొన్ని ప్రతిపాదనలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసకున్నట్టు యూబీ ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి యునైటెడ్ బీవరేజెస్‌కు దాదాపు 900 కోట్లు పేమెంట్స్ బకాయిలు ఉన్నాయి. చాలా కాలం నుంచి ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరగలేదని చెప్తోంది యూబీ. అంతే కాదు.. 2019 నుంచి తెలంగాణలో రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం నుంచి యూబీ అనుమతులు కోరుతోంది. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీంతో ఇక తెలంగాణకు స్టాక్ పంపిచబోమంటూ యూబీ తేల్చేసింది. తెలంగాణ మద్యం ప్రియులకు ఫేవరెట్ బ్రాండ్ అయిన కేఎఫ్ బ్యాన్ అవ్వడంతో మందుబాబులంతా తెగ హర్ట్ అయిపోతున్నారు. కేఎస్ అంటే పడిచచ్చిపోయే మీ ఫ్రెండ్స్‌కు ఈ న్యూస్ షేర్ చేయండి. యూబీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి