Khammam MP Seat: ఖమ్మం ఎంపీ హాట్ సీట్.. కాంగ్రెస్‌లో పోటాపోటీగా అప్లికేషన్లు

ఖమ్మం ఎంపీ సీటుకు కాంగ్రెస్ లో పలుకుబడి కలిగిన లీడర్లు, వారి భార్యలు, వారసులు టిక్కెట్లు కోరుకుంటున్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి తెలివిగా ఈ స్థానంలో సోనియాగాంధీని పోటీ చేయాలంటూ ఆహ్వానించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 2, 2024 | 04:53 PMLast Updated on: Feb 02, 2024 | 4:53 PM

Khammam Mp Seat Heavy Competetion For Khamman Seat In Congress

Khammam MP Seat: తెలంగాణలో ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్ సీటు కోసం కాంగ్రెస్ లో పెద్ద పోటీయే నడుస్తోంది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో అన్ని అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. గతంలోనూ ఇక్కడ కాంగ్రెస్ వేవ్ ఉంది. ఇప్పుడూ అదే పరిస్థితి. అందుకే ఖమ్మం లోక్ సభ సీటు గెలవడం ఈజీ అని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. వై నాట్ అనుకుంటూ అందరూ అప్లయ్ చేస్తున్నారు. గతంలో ఈ స్థానానికి సంబంధం లేని వాళ్ళతో పాటు స్థానికులు కూడా ఖమ్మం ఎంపీ సీటు కావాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు.

REVANTH REDDY: గ్రూప్‌ 1, 2.. ఎక్కడ రేవంత్ సార్‌.. ఆడుకుంటున్న నిరుద్యోగులు..

ఖమ్మం ఎంపీ సీటుకు కాంగ్రెస్ లో పలుకుబడి కలిగిన లీడర్లు, వారి భార్యలు, వారసులు టిక్కెట్లు కోరుకుంటున్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి తెలివిగా ఈ స్థానంలో సోనియాగాంధీని పోటీ చేయాలంటూ ఆహ్వానించారు. PCC తరపున ఓ తీర్మానం కూడా చేసి AICC కి పంపారు. సోనియా పోటీ చేస్తారా.. లేదా.. అసలు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటారా అన్నది డౌట్ గా ఉంది. అయితే ఖమ్మం పార్లమెంట్ సీటుపై ఎప్పటి నుంచో మాజీ ఎంపీ రేణుకా చౌదరి కర్చీఫ్ వేసుకున్నారు. గతంలో ఆమె ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు కూడా. అందుకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల తరపున ప్రచారంలోనూ రేణుక పాల్గొన్నారు. ఢిల్లీ లెవల్లో గాంధీ కుటుంబంతో పాటు ఇతర AICC పెద్దలతోనూ ఆమెకు పరిచయాలు ఉన్నాయి. అందుకే AICC స్థాయిలో రేణుకా చౌదరి ఈ టిక్కెట్ కోసం ముందు నుంచీ పైరవీలు చేసుకుంటున్నారు. ఇక ఈ స్థానం కోరుకుంటున్న వాళ్ళల్లో మరో ముఖ్యురాలు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని.

ఆమె ఇంతకు ముందు జిల్లా అంతటికీ పరిచయం లేని వ్యక్తి. మధిరకు మాత్రమే పరిమితం అయ్యారు. అయితే భట్టికి సీఎం సీటు ఇవ్వకుండా రేవంత్ కి ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. దాంతో నందిని అంటే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ప్రస్తుతం భట్టి భార్య నందిని కూడా టిక్కెట్ కోసం గాంధీ భవన్‌లో అప్లయ్ చేశారు. ఖమ్మం ఎంపీ సీటు కోసం కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు కూడా ట్రై చేస్తున్నారు. ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. అందుకే సీనియర్ నేతగా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వీహెచ్ ఉండేది హైదరాబాద్ లో అయినా.. ఖమ్మం స్థానం నుంచి గెలుపు గ్యారంటీ కావడంతో టిక్కెట్ కోసం ట్రై చేస్తున్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యక్తులు. ఇద్దరూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని సీట్లు రావడానికి వీళ్ళిద్దరే కీలకం.

వీళ్ళ సీనియారిటీ, ఇమేజ్ తో ఇద్దరికీ రేవంత్ కేబినెట్ లో మంత్రి పదవులు కూడా దక్కాయి. అందుకే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఒకప్పుడు తాను పోటీ చేసి గెలిచిన ఖమ్మం ఎంపీ సీటులో ఈసారి తన సోదరుడిని నిలబెట్టాలని చూస్తున్నారు. ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ టిక్కెట్ కోసం అప్లయ్ చేసినట్టు తెలుస్తోంది. ఇంకా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ కూడా పోటీలో ఉన్నట్టు సమాచారం. మొత్తానికి ఖమ్మం ఎంపీ సీటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి హాట్ సీట్ గా మారింది. టిక్కెట్ల ఎంపిక బాధ్యతను రేవంత్ రెడ్డి… AICC కి అప్పగించడంతో ఈ టిక్కెట్ కోసం ఢిల్లీ స్థాయిలో పైరవీలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.